విశాఖపట్నం : హనుమంతవాక సమీపంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో దృష్టి లోపం ఉన్నవారి కోసం గురువారం ప్రత్యేక కంప్యూటర్ శిక్షణను ఆస్పత్రి చైర్మన్ గుళ్లపల్లి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్, ఎంప్లాయి గివింగ్ క్యాంపస్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. దృష్టి లోపంగల విద్యార్థులు విద్య, ఉద్యోగ అవకాశాల కోసం కంప్యూటర్ శిక్షణ పొందేందుకు ఈ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
మూడు నెలల ఈ శిక్షణలో అసిస్టివ్ టెక్నాలజీ, స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్‌వేర్‌లో భాగమైన జాస్, మాజిక్, విండోస్ ఐస్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌లో భాగమైన వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్, టాలీ, స్టావేర్ లాంగ్వేజెస్, సి, సి ప్లస్ ప్లస్, జావా, హెచ్‌టీఎంఎల్, ఎస్‌క్యూఎల్ తదితర అంశాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తారని వివరించారు. పూర్తిగా అంధత్వం ఉన్న 32 మందికి, పాక్షిక అంధత్వ కలిగిన 96 మందికి శిక్షణ ఇస్తారన్నారు. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ మోహన్‌కుమార్, మైక్రోసాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్ మేనేజింగ్ డెరైక్టర్ అనిల్ భన్సాలీ, ఎల్వీపీ కంటి వైద్యుడు డాక్టర్ అవినాష్ పతంగే పాల్గొన్నారు.
దృష్టిలోపం ఉన్నవారికి కంప్యూటర్ విద్య
Published Fri, Sep 5 2014 12:40 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement