
జీడిమెట్లలో విషాదం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్లలో విషాదం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మృతులను భార్యాభర్తలు వెంకటేష్, వర్షిణి, వారి పిల్లలు విహంత్, రిషికాంత్‌లుగా గుర్తించారు. వీరి స్వస్థలం మంచిర్యాల. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు తమ పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్థారించారు.