పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న బొద్దూరు గ్రామస్తులు
సంతకవిటి : మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి అలజడి నెలకొంది. బొద్దూరు గ్రామస్తులు ఎస్‌ఐ తాతారావు దురుసు ప్రవర్తనను నిరసిస్తూ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే...బీట్ చెకింగ్ నిమిత్తం సంతకవిటి ఎస్‌ఐ తాతారావు తన వాహనంలో రాజాం వైపు మంగళవారం రాత్రి బయలుదేరారు. రాత్రి ఒంటి గంట సమయంలో బొద్దూరు గ్రామంలోని ఓ వీధిలో వినాయక నిమజ్జనోత్సవాల్లో భాగంగా రాజాంకు చెందిన కళాకారులు బుర్రకథను ప్రదర్శిస్తున్నారు. ఇందులో విజయనగరానికి చెందిన డ్యాన్సర్ ప్రదర్శన ఇస్తుండగా గుర్తించిన ఎస్‌ఐ ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆమె పరారీ కావడంతో బుర్రకథ కళాకారులను సంతకవిటి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి కేసు నమోదు చేశారు.
దురుసుగా ప్రవర్తించారు...
ఇంతలో బొద్దూరు గ్రామానికి చెందిన పలువురు మహిళలతో కలసి సంతకవిటి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. బుర్రకథ అనేది జానపద కళ అని, జానపద రీతిలో ప్రదర్శన జరుగుతుండగా, ఎస్‌ఐ ఆకస్మికంగా వచ్చి తమపై దాడి చేయడంతో పాటు మాపై దురుసుగా ప్రవర్తించారంటూ పలువురు మహిళలు, యువకులు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. జానపద గేయాలుకు డ్యాన్స్ చేసేందుకు మాత్రమే ఒక డ్యాన్సర్ వచ్చిందని పేర్కొన్నారు. ఇవేమి పట్టించుకోకుండా తమపై లాఠీతో విరుచుకుపడ్డారని, మద్యం కూడా సేవించి ఉన్నారని గ్రామస్తులు ఆరోపించారు.
సీఐ రంగప్రవేశం..
స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో రాజాం రూరల్ సీఐ యు.శేఖర్‌బాబు సంతకవిటి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఎస్‌ఐ వద్ద వివరాలు సేకరించడంతో పాటు బొద్దూరు గ్రామస్తులు వద్ద కూడా వివరాలు సేకరించారు. బుర్రకథ రూపంలో డ్యాన్స్ ప్రదర్శన ఉండరాదని గ్రామస్తులకు తెలిపారు. వీటిపై కూడా నిషేధం ఉందన్నారు. మరో వైపు గ్రామానికి చెందిన మహిళలు, యువకులు వద్ద కూడా ఫిర్యాదు స్వీకరించారు. మొత్తం వివరాలపై ఆరా తీసి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బొద్దూరు గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ సభ్యులు వి. బాబూరావునాయుడు, సర్పంచ్ ప్రతినిధి మహేశ్‌లకు సర్ది చెప్పారు. వివాదానికి తాత్కాలికంగా తెరదించి బొద్దూరు గ్రామస్తులును వెనక్కి పంపించేశారు.
దాడి చేశామనే...
జిల్లా అధికారులు నుంచి వినాయక నిమజ్జనోత్సవాల్లో ఎటువంటి అశ్లీల ప్రదర్శనలు చేయరాదనే నిబంధనలు ఉన్నాయని ఎస్‌ఐ ఎస్. తాతారావు విలేకరులకు తెలిపారు. బీట్æచెకింగ్ నిమిత్తం వెళ్ళిన తనకు బొద్దూరులో సినిమా పాటలు వినిపించాయని, ప్రదర్శన స్థలం వద్దకు వెళ్లగా విజయనగరానికి చెందిన మíß ళ డ్యాన్స్ చేస్తుందని, ఆమెను పట్టుకొబేయే ప్రయత్నంలో తప్పించుకుందన్నారు.