కార్తీక్ రాజు హీరోగా హార‌ర్ మూవీ.. కీలక పాత్రలో ఆమని | Aamani Play Key Role In Karthik Raju Sandeep Gopisetty New Movie | Sakshi
Sakshi News home page

కార్తీక్ రాజు హీరోగా హార‌ర్ మూవీ.. కీలక పాత్రలో ఆమని

Published Wed, Jun 30 2021 4:18 PM | Last Updated on Wed, Jun 30 2021 4:33 PM

Aamani Play Key Role In Karthik Raju Sandeep Gopisetty New Movie - Sakshi

కార్తీక్ రాజు, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, ప్రశాంత్ కార్తి ప్రధాన తారణంగా తేజ‌స్వి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై సందీప్ గోపి శెట్టి ద‌ర్శ‌క నిర్మాణంలో ఓ హారర్‌ సినిమా తెరకెక్కుతోంది. కరనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్‌ తాజాగా రీస్టార్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ద‌ర్శ‌క నిర్మాత సందీప్ గోపిశెట్టి మాట్లాడుతూ ‘‘డైరెక్ట‌ర్‌గా ఇది నా తొలి చిత్రం. సినిమాపై ఉన్న ఆస‌క్తితో ద‌ర్శ‌కుడిగా మారాను. కానీ నా మీద‌, క‌థ‌పై న‌మ్మ‌కంతో ఎంటైర్ యూనిట్ ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సీనియ‌ర్ ఎడిట‌ర్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావుగారు అందిస్తోన్న స‌హ‌కారం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అలాగే హీరో కార్తీక్‌, ప్ర‌శాంత్‌, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తిల‌తో పాటు పోసాని కృష్ణ‌ముర‌ళి, భీమినేని శ్రీనివాస్‌, దేవీ ప్ర‌సాద్‌గా, ఆమ‌ని ఇలా పేరు పేరునా అంద‌రికీ థాంక్స్ చెప్పుకుంటున్నాను’అని అన్నారు.

భీమినేని, దేవీ ప్రసాద్‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం హ్యాపీగా ఉందన్నారు హీరో కార్తీక్‌ రాజు. సీనియర్‌ నటి ఆమని మాట్లాడుతూ.. ‘సినిమా బాగా వ‌చ్చింది. మంచి పాత్ర చేస్తున్నాను. ఫ్యామిలీతో క‌లిసి కూర్చుని చూసే సినిమా. తొలి సినిమానే అయినా మంచి అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడిలా తెర‌కెక్కిస్తున్నారు. త‌న‌కు మంచి పేరుని తెచ్చి పెట్టాల‌ని కోరుకుంటున్నాను’అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement