ప్రేమలో కొత్త కోణం | Karthik Raju I Hate You completes filming | Sakshi
Sakshi News home page

ప్రేమలో కొత్త కోణం

Published Mon, Jan 8 2024 1:34 AM | Last Updated on Mon, Jan 8 2024 1:34 AM

Karthik Raju I Hate You completes filming - Sakshi

కార్తీక్‌ రాజు, మోక్ష, షెర్రీ

కార్తీక్‌ రాజు హీరోగా, మోక్ష, షెర్రీ అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఐ హేట్‌ యు’. అంజి రామ్‌ దర్శకత్వం వహించారు. బి.లోకనాథం సమర్పణలో నాగరాజ్‌ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రోడక్షన్  వర్క్స్‌ జరుగుతున్నాయి.

త్వరలోనే ఈ సినిమాని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగరాజ్‌ మాట్లాడుతూ–‘‘లవ్, సైకలాజికల్‌ అంశాలతో రూపొందిన చిత్రం ‘ఐ హేట్‌ యు’. డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో అంజిరామ్‌గారు ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: సాకార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement