Nagaraj
-
ప్రేమలో కొత్త కోణం
కార్తీక్ రాజు హీరోగా, మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఐ హేట్ యు’. అంజి రామ్ దర్శకత్వం వహించారు. బి.లోకనాథం సమర్పణలో నాగరాజ్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగరాజ్ మాట్లాడుతూ–‘‘లవ్, సైకలాజికల్ అంశాలతో రూపొందిన చిత్రం ‘ఐ హేట్ యు’. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో అంజిరామ్‌గారు ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: సాకార్. -
ఘోస్ట్.. డేట్ ఫిక్స్
కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ అక్టోబర్‌లో ‘ఘోస్ట్’ సినిమాతో థియేటర్లకు రానున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని (బీర్బల్) దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ఘోస్ట్’ రూపొందింది. అక్టోబర్ రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఐఎంఎస్ కుంభకోణంలో ఓమ్నీ నాగరాజు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు కొనసాగుతోంది. మొదటి నుంచి అధికారులతో కుమ్మక్కయి అధిక ధరలకు మందులు కొనుగోలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఓమ్నీ మార్కెటింగ్ మేనేజర్ చెరుకూరి నాగరాజును ఏసీబీ అధికారులు గురు వారం అరెస్టు చేశారు. ఈ కేసులో నాగరాజు ఏ–9గా ఉన్నాడు. ఓమ్నీ ఫార్మా ఎండీ శ్రీహరిబాబు అలియాస్ బాబ్జిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శ్రీహరిబాబే లెజెండ్ కంపెనీని సృష్టించి దానికి కృపాసాగర్‌రెడ్డి అనే వ్యక్తిని బినామీగా పెట్టాడని దర్యాప్తు లో అధికారులు గుర్తించారు. శ్రీహరిబాబుకు చెందిన ఓమ్నీ ఫార్మాలో నాగరాజు మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేసేవాడు. లెజెండ్ కంపెనీ ద్వారా అప్పటి డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ ద్వారా అధిక ధరలకు బిల్లులు చెల్లించేలా చేయడంలో నాగరాజు కీలకపాత్ర పోషించినట్లు శ్రీహరిబాబు ఏసీబీ దర్యాప్తులో వెల్లడిం చాడు. దీంతో ఏసీబీ నాగరాజును అరెస్టు చేసింది. -
నాగరాజుకే ఎక్కువగా వణికిపోయేవారు....
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్ ) కుంభకోణంలో నాగరాజు లీలలు క్రమంగా వెలుగుచూస్తున్నాయి. ఐఎంఎస్ కుంభకోణంలో నాగరాజు పాత్రపై బుధవారం ‘అవినీతిలో పోటీపడ్డారు’అనే పేరుతో సాక్షి ప్రచురించిన కథనంపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. అతని ఇంటిపై బుధవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తనిఖీల్లో రూ.46 కోట్ల విలువైన ఒరిజినల్ పర్చేజ్ ఆర్డర్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఐఎంఎస్ డైరెక్టరేట్‌లో ఉండాల్సిన పత్రాలు ప్రైవేటు వ్యక్తి ఇంట్లో ఉండటంపై అధికారులే విస్తుపోయారని తెలిసింది. ఇప్పటికే నాగరాజును అరెస్టు చేసిన ఏసీబీ రిమాండుకు పంపిన విషయం తెలిసిందే. దేవికారాణి డైరెక్టర్‌గా చార్జ్ తీసుకున్నాక నాగరాజే డైరెక్టరేట్‌లో చక్రం తిప్పాడని, అతడే సూడో డైరెక్టర్‌గా వ్యవహరించిన వైనం బయటపడింది. నాగరాజు ఎంత చెబితే అంత! ఐఎంఎస్‌లో నాగరాజు వ్యవహారాలు నడపడం ఇదే కొత్తకాదు. దేవికారాణి రాక ముందు అంతకు ముందున్న డైరెక్టర్లతోనూ చాలా తతంగాలు నడిపాడు. దేవికారాణి డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాక ఐఎంఎస్ డైరెక్టరేట్ పేషీలో అతని ఆగడాలు శృతిమించాయి. అతను వచ్చాడంటే తన చాంబర్లో ఎంత బిజీ మీటింగ్‌లో ఉన్నా దేవికారాణి అందరినీ పంపించేసేది. ఆఫీసులో తయారు చేయాల్సిన మెడిసిన్స్ ఇండెంట్‌ను ఇంటి వద్దే నాగరాజు తయారు చేసుకుని వచ్చేవాడు. నాగరాజు చెబితే ఏకబిగిన పదుల సంఖ్యలో ఇండెంట్లపై దేవికారాణి సంతకాలు చేసేది. మందుల ధరలు, కొనుగోలు చేయాల్సిన కిట్లు, యంత్రాలు మొత్తం తానే నిర్ణయించేవాడు. అతనికి పేషీలో ఎంత ప్రాధాన్యం ఉండేదంటే.. తనకు నచ్చిన అధికారి సీట్లో కూర్చుని కంప్యూటర్లపై వీడియో గేములు ఆడేవాడని సిబ్బంది గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏ సెక్షన్లో ఇతని ఫైల్ ఆలస్యమైనా సరే.. ఆ బాధ్యతలు చూసే ఉద్యోగిని అక్కడ నుంచి మరో సెక్షన్‌ను ఆగమేఘాల మీద మార్పించేవాడు. సిబ్బంది మాటల్లో చెప్పాలంటే.. దేవికారాణి కంటే నాగరాజుకే ఎక్కువగా వణికిపోయేవారు. నాగరాజు ఆగడాలపై సమాచారం అందుకున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శశాంక్ గోయల్ ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణిని హెచ్చరించడంతో మే నెల నుంచి పేషీకి రావడం కాస్త తగ్గించాడు. దీంతో సంతకాలన్నీ కారులోనే తీసుకునేవాడని సమాచారం. ఏపీలోనూ ఇతనిదే హవా! నాగరాజు కమీషన్ దందా కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. ఇతడిచ్చే కమీషన్లకు ఆశపడి అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీగా మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల తిరుపతి, విజయవాడల్లోనూ ఏపీ విజిలెన్స్ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఇతని అక్రమాలు విస్తరించాయని, దర్యాప్తు చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తాయని సిబ్బంది చెబుతున్నారు. కంపెనీలన్నీ అతని వెనకాలే..! గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన నాగరాజు పూర్తిపేరు సీహెచ్ శివ నాగరాజు. మెడికల్ రిప్ర జెంటేటివ్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. అధికారులకు విలువైన బహుమతులు, పార్టీలు ఇచ్చి మచ్చిక చేసుకునేవాడు. తర్వాత అధిక ధరలకు ఇండెంట్లు పెట్టుకుని వారికి రూ.లక్షల కమీషన్లు వచ్చేలా స్కెచ్ గీసేవాడు. దీంతో ఇతని ద్వారా మందుల కొనుగోలుకు అధికారులు, రిజిస్టర్డ్, నాన్ రిజిస్టర్డ్ కంపెనీలు ఆసక్తి కనబరిచేవి. 42 కంపెనీలకు ఇతనే అధికారిక రిప్రజెంటేటివ్‌గా మారాడంటే అతని హవా ఎలా నడిచిందో చెప్ప వచ్చు. దేవికారాణి అక్రమాలపై విజిలెన్స్ నివేదిక ఇవ్వగానే అప్రమత్తమయ్యాడు. దేవికా రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల మధ్య రాజీ కుదర్చడంలో సఫలీకృతమయ్యాడు. -
హత్య కేసులో మైనర్ సహా పలువురి అరెస్ట్
బెంగళూరు: పాతకక్షలతో కొందరు వ్యక్తులు ప్లాన్ చేసి ఓ రౌడీషీటర్‌ను హత్యచేసిన కేసులో ఓ బాలుడితో సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రౌడీషీటర్ సునీల్ బంధువు యతిరాజ్‌తో నాగరాజుకు ఓ భవనం నిర్మాణం విషయంలో గొడవలు తలెత్తాయి. దీంతో గతేడాది మార్చి12న రౌడీ షీటర్ సునీల్ తన గ్యాంగ్‌తో కలిసి నాగరాజు అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. నాగరాజు చనిపోయాడని భావించిన సునీల్ గ్యాంగ్ అక్కడినుంచి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడ్డ నాగరాజును ప్రాథమిక చికిత్స అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో బంధువుల ఇంటికి తరలించి చికిత్స అందించారు. బసవేశ్వరనగర్ జైలుకు వెళ్లిన సునీల్ బెయిల్‌పై విడుదలయ్యాడు. సునీల్‌పై కక్ష పెంచుకున్న నాగరాజు గ్యాంగ్ అతడిని ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ చేశారు. గత బుధవారం ఉదయం సునీల్ ఇంటికి వెళ్లి అతడిని బయటకు ఈడ్చుకొచ్చారు. అందరూ చూస్తుండగానే పదునైన ఆయుధాలతో సునీల్‌పై దాడిచేసి హత్యచేసింది నాగరాజు గ్యాంగ్. ఈ కేసులో బసవేశ్వరనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎనిమిది మంది నిందితులను, ఓ మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులలో నాగరాజు(26), నందీషా(19), రమేషా(25), కుమార్(24), వినయ్(21), గురురాజ్(24), ఖాదర్(28), ఉమర్ ఖాన్(23) సహా ఓ మైనర్ బాలుడు ఉన్నట్లు పోలీసులు వివరించారు. -
మలుపు తిరిగిన కారు దగ్ధం కేసు
సాక్షి, చెన్నై: సాయం సంధ్య వేళ నగర రోడ్డుపై పరుగులు తీస్తున్న కారు దగ్ధం కావడం, అందులో ఉన్న ఓ మహిళ, రెండేళ్ల బిడ్డ తీవ్రంగా గాయపడిన వ్యవహారం మలుపు తిరిగింది. కట్టుకున్న వాడే నిప్పు పెట్టి కారు నుంచి దూకేసినట్లుగా పోలీసులకు వాంగ్ములం ఇచ్చి ఆ మహిళ మృత్యువు ఒడికి చేరింది. నందనం సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు... తేనం పేట ఆలయమ్మన్ ఆల యం వీధికి చెందిన నాగరాజన్(33) భార్య ప్రేమ, పిల్లలు యశ్వంత్(4), నిషాంత్రాజ్(2)లతో కలిసి బంధువు కారులో ఆదివారం బయటకు వెళ్లారు. ఈ కారు హఠాత్తుగా నందనం సిగ్నల్ సమీపంలో మంటల్లో చిక్కుకుంది. పరుగులు తీస్తున్న కారులో మంటలు చెలరేగడంతో నాగరాజన్ అప్రమత్తం అయ్యాడు. కారును పక్కగా నిలిపి కిం దకు దూకేశాడు. అతి కష్టం మీద కారు లో ఉన్న పెద్దకుమారుడు యశ్వంత్‌ను బయటకు తీశాడు. ఆ పరిసర వాసులు వెంటనే స్పందించి మంటల్లో చిక్కకున్న ప్రేమ, నిషాంత్ రాజ్‌లను కాపాడే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు నిషాంత్ రాజ్‌ను బయటకు లాగినా, ప్రేమ మాత్రం లోపలే చిక్కుకుంది. ఘటనపై సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రేమను అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా కారు ప్రమాద సంఘటనలు తరచుగా సంభవవిస్తుండడంతో.. ఈ ప్రమాదం అలాంటిదే అని సర్వత్రా భావించారు. అయితే, కొన ఊపిరితో ఉన్న ప్రేమ అతి కష్టం మీద పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంతో కేసు మలుపు తిరిగినట్టు అయింది. భర్తే నిప్పు పెట్టాడని ఆరోపిస్తూ ఆమె కన్నుమూసింది. దీంతో దంపతుల మధ్య సాగుతూ వచ్చిన వివాదం పోలీసుల విచారణలో బయట పడింది. విడి విడిగా ఉంటూ: తొమ్మిది సంవత్సరాల క్రితం నాగరాజన్, ప్రేమల మధ్య వివాహం జరిగింది. మూడు నాలుగేళ్లుగా వీరి మధ్య గొడవలు మరీ పెరిగి ఉన్నాయి. నాగరాజన్‌ను ఆయన కుటుంబానికి దూరంగా ప్రేమ ఉంచడం అసలు గొడవకు కారణంగా తేలి ఉన్నది. ఇటీవల నాగరాజన్ కుటుంబీకులు చెంగల్పట్టు సమీపంలో సొంతంగా ఇంటిని నిర్మించుకుని వెళ్లి పోయారు. కుటుంబంతో కలిసి ఉండేందుకు ప్రేమ ఇష్ట పడక పోవడంతో, నాగరాజన్ తల్లిదండ్రుల వద్దకు తరచూ వెళ్తూ వచ్చాడు. చివరకు గత కొంత కాలంగా నెలలో ఏదో ఒక రోజు మాత్రం తేనం పేటకు రావడం, పిల్లల్ని చూసి, వారికి కావాల్సినది కొనిచ్చి నాగరాజన్ వెళ్తూ వచ్చాడు. దీంతో దంపతుల మధ్య దూరం పెరిగింది. ఆదివారం తన బంధువు పెరుంగుడికి చెందిన గణేషన్ కారును తీసుకుని నాగరాజన్ తేనాంపేటకు వచ్చాడు. పిల్లలతో పాటుగా ప్రేమను తీసుకుని బయటకు వెళ్లారు. తిరిగి తేనాంపేటకు వస్తున్న సమయంలో దంపతుల మధ్య గొడవ జరగడం, ఈ గొడవతో కారులో మంటలు చెలరేగడం గమనార్హం. నాగరాజన్ తనను హతమార్చేందుకు మంటలు సృష్టించాడని ప్రేమ వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. దీంతో నాగరాజన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్యను కడతేర్చేందుకు పథకం రచించి, దానిని ప్రమాదంగా మార్చి తప్పించుకునేందుకు నాగరాజన్ యత్నించినా, అతడి పెద్దకుమారుడు యశ్వంత్ వాదన మరో రకంగా ఉండడం గమనార్హం. నాగరాజన్ బంధువు గణేషన్ పేర్కొంటూ, తాను యశ్వంత్ వద్ద ఆరా తీసిన మేరకు, ప్రేమ కారు ఎక్కే సమయంలో ఓ క్యాన్‌ను బ్యాగ్‌లో పెట్టుకుని వచ్చినట్టు వివరించాడని తెలిపారు. కారులో ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో ప్రేమ ఆ బాటి ల్ మూత తీసి తన మీద పోసుకున్నట్టు, తర్వాత మంటలు వచ్చినట్టుగా యశ్వంత్ తన దృష్టికి తెచ్చాడని ఆయన పేర్కొనడం ఆలోచించదగ్గ విషయమే. అయితే ఈ దంపతుల మధ్య సాగిన వివాదంతో ప్రేమ మృత్యు ఒడిలోకి చేరగా, నాగరాజన్ కటకటాల మధ్యలో నెట్టబడ్డాడు. గాయాలతో రెండేళ్ల నిషాంత్ రాజ్ ఆసుపత్రిలో, తల్లిదండ్రులు తన పక్కనే లేక పోవడంతో యశ్వంత్ కన్నీరు మున్నీరవుతున్నాడు. క్షణికావేశంలో జరిగిన ఈ ఘటనతో ముక్కు పచ్చలారని వయసులో ఇద్దరు చిన్నారులు అటు తల్లి, ఇటు తండ్రి ప్రేమకు దూరంగా ఒంటరిగా మిగలాల్సి రావడం గమనార్హం. -
సిగరెట్టు తాగొద్దన్నందుకు..
మామను హత్య చేసిన అల్లుడు బెంగళూరు (బనశంకరి) : ఇంటిలో సిగిరెట్ తాగొద్దని చెప్పిన పాపానికి మామను అల్లుడు హత్య చేసిన సంఘటన యశవంతపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. బీకే.నగర 17 వక్రాస్లో నివాసముంటున్న నాగరాజ్ (65) టైలర్ . ఇతడి కుమార్తెను సత్యనారాయణకు ఇచ్చి ఏడేళ్ల క్రితం వివాహం చేశాడు. దంపతులిద్దరు మామ నాగరాజ్ ఇంటిలోనే ఉంటున్నారు. అనారోగ్యంతో ఉన్న సత్యనారాయణ ఇంటి వద్దనే ఉంటున్నారు. భార్య గార్మెంట్స్‌లో పనిచేస్తోంది. ఆదివారం రాత్రి సత్యనారాయణ ఇంటిలో సిగిరెట్ తాగుతుండగా గమనించిన మామ నాగరాజ్ సిగిరెట్ తాగొద్దని అల్లుడికి హితవు పలికారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇదే విషయమై సోమవారం సత్యనారాయణ భార్యతో గొడవ పడింది. అనంతరం భార్య విధులకు వెళ్లగా కుమార్తె కూడా పాఠశాలకు వెళ్లింది. దీంతో మరోసారి మామ, అల్లుడు ఘర్షణపడ్డారు. తీవ్ర ఆగ్రహానికి గురైన సత్యనారాయణ చాకుతో మామ నటరాజ్‌పై దాడి చేశాడు. విషయం గమనించి స్థానికులు నాగరాజును హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. పోలీసులు నిందితుడని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
రొమాంటిక్ ప్రేమకథ
ప్రేమకథ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఆమ్లెట్’. సిరాజ్, నాగరాజ్, సౌరభ్, ముఖ్య పాత్రలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తోట కృష్ణ, మంచాల రమేష్ యాదవ్ నిర్మిస్తున్నారు. ఇ.వి.ఎన్.ఆచారి దర్శకుడు . ఈ సినిమా పాటలను, ప్రచార చిత్రాన్ని నిర్మాత సి. కల్యాణ్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘చాలా వైవిధ్యంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఏప్రిల్ రెండో వారంలో సినిమాను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి. సాగర్,తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బేతమంగల నాగరాజ్‌కు కన్నడ రాజ్యోత్సవ అవార్డు
కోలారు : కరగ పూజారి బంగారుపేట తాలూకా బేతమంగల నాగరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం కన్నడ రాజ్యోత్సవ అవార్డుకు ఎంపిక చేసింది. బేతమంగల నాగరాజ్ బంగారుపేట తాలూకా బేతమంగల గ్రామ నివాసి జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన కరగ ఉత్సవాలలో గత 35 సంవత్సరాలుగా నృత్యం చేస్తూ పేరు ప్రఖ్యాతులు సాధించారు. బేతమంగల నాగరాజ్. క రగ ఉత్సవాలు అనగానే గుర్తుకు వచ్చే పేరు బేతమంగల నాగరాజ్. ఆరు పదులు దాటినా నాగరాజ్ నేటికి ఎంతో ఉత్సాహంగా బరువైన కరగను మోస్తూ రాత్రంతా నృత్యం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు. బేతమంగల నాగరాజ్ కరగ ఉత్సవాలలో కరగ మోస్తూ నృత్యం చేస్తున్నారంటే ఆయన కాళ్ల మీద పడే వారు ఎంతోమంది. శతాబ్దాల కాలంగా నాగరాజ్ కుటుంబం కరగ మోస్తూ ఉంది. ఆయన తండ్రి, తాత, ముత్తాతలు కూడా కరగను మోసి నత్యం చేసిన వారే. కరగ నృత్యం చేయడం వీరికి వంశ పారంపర్యంగా వస్తోంది. ప్రస్తుతం ఆయన కుమారుడు కూడా ఈ కళను అనుసరిస్తున్నాడు. 1979లో మొట్ట మొదటి సారిగా నాగరాజ్ కరగ నృత్యం చేశారు. వేల సంఖ్యలో కరగ నృత్య ప్రదర్శనలు అందించారు. చిక్కబళ్లాపురం, బాగేపల్లి, బెంగుళూరులోని హెసరుఘట్ట, తమిళునాడులోని హోసూరు, క్రిష్ణగిరి, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, వి కోట తదితర ప్రాంతాలలో ఆయన అనేక అనేక కరగ ప్రదర్శనలు ఇచ్చారు. రాజ్యోత్స అవార్డు సంతోషం కలిగిస్తోంది : నాగరాజ్ ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నాకు కన్నడ రాజ్యోత్సవ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషంగా కలిగించింది. ఈ అవార్డు 50 ఏళ్లపాటు కరగను మోసిన నా తండ్రికి రావాల్సి ఉండింది. ఆయన బతికుంటే ఇప్పుడు ఎంతో సంతోషించే వారు. కరగ నృత్యమే నా ప్రాణం. -
ఏఈ సహా అధికారుల నిర్బంధం
వీపనగండ్ల,న్యూస్‌లైన్: తమకు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్తు సరఫరా చేయక పోవడంతో వీపనగండ్ల మం డల పరిధికి చెందిన పలువురు రైతులు ఆగ్రహంతో విద్యుత్తు ఏఈని ఇతర సిబ్బందిని సోమవారం నిర్బంధించా రు. ఇటీవల సబ్‌స్టేషన్‌ను ముట్టడిం చిన రైతులకు ఏఈ ఏడుగంటల వి ద్యుత్తు సరఫరాలకు హామీ ఇచ్చిన సం గతి విదితమే.అది ఆచరణ దాల్చకపోవడంతో సోమవారం వీపనగండ్ల 33/ 11కేవీ సబ్‌స్టేషన్‌ను సంగినేనిప ల్లి, తూంకుంట, వీపనగండ్ల గ్రామాల రై తులు మరో మారు ముట్టడించారు. ఏ ఈ నర్సింహ్మతో పాటు జేఎల్ఎంలు ర మేష్, సాయిప్రసాద్, ఆపరేటర్లు నా గరాజు, శ్రీకాంత్‌లను రైతులు గది లో బందించారు. 10రోజులుగా తూం కుంట ఫీడర్‌కు విద్యుత్ సరఫరా నిలి చిపోవడంతో వేలాది రూపాయలు పె ట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయని అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ సమస్య త లెత్తిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చే శారు. ఆందోళన విషయాన్ని తెలుసుకున్న ఏఎస్ఐ వహీద్అలీబేగ్ సి బ్బం దితో వెళ్లి రైతులను శాంతింపచేసేందుకు యత్నించారు. అధికారులు రైతు ల ఒత్తిడికి తలొగ్గి ఒకే ట్రాన్స్ఫార్మర్ నుండి తూంకుంట ఫీడర్‌కు సరఫరా అవుతున్న విద్యుత్ లైన్‌ను సబ్‌స్టేషన్‌లోని రెండో ఫీడర్‌కు కలపడంతో వా రు శాంతించారు. భవిష్యత్తులో వి ద్యుత్ సమస్య తలెత్తకుండా తూం కుంట ఫీడర్‌కు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని రైతులు ఏఈపై ఒత్తిడి తె చ్చారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్ర త్యేక లైన్ పనుల్లో జాప్యం చోటుచేసుకుందని ఉన్నతాధికారులకు విషయా న్ని విన్నవించి పనులు పూర్తయ్యేలా చూస్తానని రైతులకు ఏఈ హమీ ఇచ్చా రు. కార్యక్రమంలో రైతుసంఘాల నా యకులు రాంచంద్రయ్యగౌడ్, పీఏసీఎస్ డెరైక్టర్ కుర్మయ్య, ఉపసర్పంచ్ రాముడు, రైతులు బత్తుల యాదయ్య, సత్యనారాయణగౌడ్, కుర్ముర్తి, కృష్ణ య్య, మౌలాలి, రామన్‌గౌడ్, మైనద్దిన్, తుప్పలయ్య పాల్గొన్నారు. -
కూంబింగ్ ఆపండి
= మావోయిస్టుల హెచ్చరిక = అటవీ శాఖ చెక్‌పోస్టుపై దాడి = సిబ్బంది సురక్షితం = కార్యాలయం ధ్వంసం = గాలిలోకి కాల్పులు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మలెనాడులో మావోయిస్టులు మళ్లీ ఉనికి చాటుకున్నారు. చిక్కమగళూరు జిల్లా శృంగేరి తాలూకా తనికోడు గ్రామంలోని అటవీ శాఖ చెక్‌పోస్టుపై సోమవారం వేకువ జామున దాడి చేశారు. చెక్‌పోస్టులో ఇద్దరు సిబ్బంది ఉన్నప్పటికీ, వారికి ఎలాంటి హాని తలపెట్ట లేదు. అక్కడున్న సీసీ కెమెరాలు, వైర్‌లైస్ సెట్లు, టెలిఫోన్ ఫర్నీచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. రసీదు పుస్తకాలను చేతబట్టుకుని వెళుతూ వెళుతూ గాలిలో కాల్పులు జరిపారు. నలుగురితో కూడిన బృందం అకస్మాత్తుగా ప్రవేశించిందని అక్కడి ఉద్యోగి నాగరాజ్ తెలిపారు. బయట మరో ఇద్దరు నిలుచుని ఉన్నారని చెప్పారు. తక్షణమే కూంబింగ్‌ను నిలిపి వేయాలని వారు డిమాండ్ చేశారని తెలిపారు. కుద్రేముఖ్ జాతీయ ఉద్యాన వనంలో నివాసం ఉంటున్న గిరిజనులను ఖాళీ చేయించరాదని కూడా పేర్కొంటూ అక్కడ పోస్టర్లను అంటించడంతో పాటు కరపత్రాలను వెదజల్లి నిష్ర్కమించారు. ఈ సంఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడారు. మళ్లీ మావోయిస్టుల సంచారం ప్రారంభం కావడంతో ఆందోళన చెందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ అభిషేక్ గోయెల్ హుటాహుటిన తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు. శృంగేరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని చెక్‌పోస్టులతో పాటు పొరుగున ఉన్న శివమొగ్గ, ఉడిపి జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనాల తనిఖీని ప్రారంభించారు. కూంబింగ్‌ను తీవ్రతరం చేశారు. పది రోజుల కిందట మావోయిస్టులు దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా నారావి గ్రామ పంచాయతీ సభ్యుడు రామచంద్ర భట్ ఇంటికి నిప్పు పెట్టారు. అప్పట్లో ఎనిమిది నుంచి పది మంది మావోయిస్టులు దాడి జరిపారు. పోలీసులకు సమాచారం ఇస్తానని అతను చెప్పడంతో ఆగ్రహించి ఇంటి ముందు నిలిపి ఉన్న వ్యాను, బైక్‌లకు నిప్పు పెట్టి పారిపోయారు. కొన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు మళ్లీ పంజా విప్పారు. దీంతో కోస్తా, మలెనాడు ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.