వీపనగండ్ల,న్యూస్‌లైన్: తమకు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్తు సరఫరా చేయక పోవడంతో వీపనగండ్ల మం డల పరిధికి చెందిన పలువురు రైతులు ఆగ్రహంతో విద్యుత్తు ఏఈని ఇతర సిబ్బందిని సోమవారం నిర్బంధించా రు. ఇటీవల సబ్‌స్టేషన్‌ను ముట్టడిం చిన రైతులకు ఏఈ ఏడుగంటల వి ద్యుత్తు సరఫరాలకు హామీ ఇచ్చిన సం గతి విదితమే.అది ఆచరణ దాల్చకపోవడంతో సోమవారం వీపనగండ్ల 33/ 11కేవీ సబ్‌స్టేషన్‌ను సంగినేనిప ల్లి, తూంకుంట, వీపనగండ్ల గ్రామాల రై తులు మరో మారు ముట్టడించారు. ఏ ఈ నర్సింహ్మతో పాటు జేఎల్‌ఎంలు ర మేష్, సాయిప్రసాద్, ఆపరేటర్‌లు నా గరాజు, శ్రీకాంత్‌లను రైతులు గది లో బందించారు.
10రోజులుగా తూం కుంట ఫీడర్‌కు విద్యుత్ సరఫరా నిలి చిపోవడంతో వేలాది రూపాయలు పె ట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయని అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ సమస్య త లెత్తిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చే శారు. ఆందోళన విషయాన్ని తెలుసుకున్న ఏఎస్‌ఐ వహీద్‌అలీబేగ్ సి బ్బం దితో వెళ్లి రైతులను శాంతింపచేసేందుకు యత్నించారు. అధికారులు రైతు ల ఒత్తిడికి తలొగ్గి ఒకే ట్రాన్స్‌ఫార్మర్ నుండి తూంకుంట ఫీడర్‌కు సరఫరా అవుతున్న విద్యుత్ లైన్‌ను సబ్‌స్టేషన్‌లోని రెండో ఫీడర్‌కు కలపడంతో వా రు శాంతించారు. భవిష్యత్తులో వి ద్యుత్ సమస్య తలెత్తకుండా తూం కుంట ఫీడర్‌కు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని రైతులు ఏఈపై ఒత్తిడి తె చ్చారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్ర త్యేక లైన్ పనుల్లో జాప్యం చోటుచేసుకుందని ఉన్నతాధికారులకు విషయా న్ని విన్నవించి పనులు పూర్తయ్యేలా చూస్తానని రైతులకు ఏఈ హమీ ఇచ్చా రు. కార్యక్రమంలో రైతుసంఘాల నా యకులు రాంచంద్రయ్యగౌడ్, పీఏసీఎస్ డెరైక్టర్ కుర్మయ్య, ఉపసర్పంచ్ రాముడు, రైతులు బత్తుల యాదయ్య, సత్యనారాయణగౌడ్, కుర్ముర్తి, కృష్ణ య్య, మౌలాలి, రామన్‌గౌడ్, మైనద్దిన్, తుప్పలయ్య పాల్గొన్నారు.
ఏఈ సహా అధికారుల నిర్బంధం
Published Tue, Dec 17 2013 5:28 AM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM
Advertisement