రొమాంటిక్ ప్రేమకథ | Romantic love story | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ ప్రేమకథ

Published Wed, Mar 25 2015 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM

రొమాంటిక్ ప్రేమకథ

రొమాంటిక్ ప్రేమకథ

 ప్రేమకథ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఆమ్లెట్’. సిరాజ్, నాగరాజ్, సౌరభ్, ముఖ్య పాత్రలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తోట కృష్ణ, మంచాల రమేష్ యాదవ్ నిర్మిస్తున్నారు. ఇ.వి.ఎన్.ఆచారి దర్శకుడు . ఈ సినిమా పాటలను, ప్రచార చిత్రాన్ని  నిర్మాత సి. కల్యాణ్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘చాలా వైవిధ్యంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఏప్రిల్ రెండో వారంలో సినిమాను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి. సాగర్,తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement