
వైరల్
అమ్లెట్లు ఎచట వేసెదరు? ఆలూ పరాట ఎక్కడ తయారుచేసెదరు?’ అనే ప్రశ్నలకు ‘ఇవి కూడా ప్రశ్నలేనా. స్టవ్ మీద ఉన్న పెనంపై వేస్తారు. చేస్తారు’ అంటాం. అయితే ఒక టెక్ కంటెంట్ క్రియేటర్ మాత్రం మనం చెప్పే జవాబును మార్చే ప్రయత్నంలో ఉన్నాడు.
సదరు ఈ క్రియేటర్ కంప్యూటర్ ‘సిపియు’పై ఆమ్లెట్ వేశాడు. ఆ తరువాత మినీ పరోటా తయారుచేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ‘డిజిటల్ ఆమ్లెట్లు–పరోటాలు వచ్చేశాయి’ అని మురిసిపోతున్నారు ప్రేక్షకమహాశయులు.