Cooking Shows
-
ఇచట డిజిటల్ ఆమ్లెట్ డిజిటల్ పరోటా వేయబడును
అమ్లెట్లు ఎచట వేసెదరు? ఆలూ పరాట ఎక్కడ తయారుచేసెదరు?’ అనే ప్రశ్నలకు ‘ఇవి కూడా ప్రశ్నలేనా. స్టవ్ మీద ఉన్న పెనంపై వేస్తారు. చేస్తారు’ అంటాం. అయితే ఒక టెక్ కంటెంట్ క్రియేటర్ మాత్రం మనం చెప్పే జవాబును మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. సదరు ఈ క్రియేటర్ కంప్యూటర్ ‘సిపియు’పై ఆమ్లెట్ వేశాడు. ఆ తరువాత మినీ పరోటా తయారుచేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ‘డిజిటల్ ఆమ్లెట్లు–పరోటాలు వచ్చేశాయి’ అని మురిసిపోతున్నారు ప్రేక్షకమహాశయులు. -
అలా నా ఎనర్జీ లెవల్స్ పెరిగాయి..తమన్నా
పన్నెండు గంటల గ్యాప్‌తో ఆహారం తీసుకోవడం వల్ల తనకు ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నట్లుగా హీరోయిన్ తమన్నా చెబుతున్నారు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘నేను చాలా రకాల డైట్స్‌ను ఫాలో అయ్యాను. కానీ పెద్దగా ఫలితం లేకపోయింది. కానీ డిన్నర్‌కి, నెక్ట్స్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్య పన్నెండుగంటల గ్యాప్ ఉన్నప్పుడు నాకు మంచి ఫలితాలు కనిపించాయి. ఉదాహరణకు నేను ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు నా లాస్ట్ మీల్ చేస్తే... మర్నాడు ఉదయం 6 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేసేదాన్ని. ఇలా చేయడం వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. మునుపటి కన్నా నా ఎనర్జీ లెవల్స్ పెరిగాయి. అయితే నాకు బాగుందని అందర్నీ పన్నెండు గంటల గ్యాప్‌ని ఫాలో అవ్వమని చెప్పడంలేదు. ఎందుకంటే వారి వారి ఆరోగ్య స్థితి, వారి సామర్థ్యాలను బట్టి డైట్ టైమింగ్‌ని ఫాలో అవ్వడం ఉత్తమం’’ అని పేర్కొన్నారు. కాగా ఓ ప్రముఖ చానెల్లో తమన్నా చేస్తున్న కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ త్వరలో ప్రసారం కానుంది. సినిమాల విషయానికి వస్తే... తమన్నా నటించిన ‘మ్యాస్ట్రో’, ‘సీటీమార్’, ‘గుర్తుందా..శీతాకాలం’ రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. -
కిర్రెక్కించిన కొరియా నాంటాషో
-
కిచెన్‌లో యూట్యూబ్
ఒకప్పుడు కొత్త కొత్త వంటలు నేర్చుకునేందుకు... వంటల పుస్తకాలు దొరికేవి. అలాగే.. టీవీ షోల్లో బోలెడు వంటల కార్యక్రమాలు వస్తున్నాయి. దాంట్లో చూస్తూ... ఆ రెసిపీలను పేపర్లలో రాసుకునే వారు. అలా మగువలు పుస్తకాలను పట్టుకొని, చదువుకుంటూ వంట చేసేవారు. కానీ ఇప్పుడు జమానా బదల్ గయా. టెక్నాలజీ హైటెక్కు టమారాలను నేర్చుకుంది. యూట్యూబ్‌లో చూసి వంటలు చేసే కాలం వచ్చేసింది. అయితే, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లను కిచెన్‌లోకి తీసుకెళ్లడం సాధ్యమయ్యే పనికాదు కదా! దీనికీ పరిష్కారం అందుబాటులోకి వచ్చేసింది. ఐప్యాడ్‌లోనే యూట్యూబ్ ఆన్ చేసుకొని, చూసుకుంటూ వంట చేయొచ్చు. ఎలాగంటారా..? ఇదిగో ఈ ‘ఐప్యాడ్ కిచెన్ సెట్’తో ఇట్టే వంట కానిచ్చేవచ్చు. ఇందులోని బ్లూటూత్ టెక్నాలజీతో పని చేసే స్పీకర్లు బ్యాటరీతో పని చేస్తాయి. కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై దీనిని నిటారుగా నిలబెట్టి పెట్టుకోవడానికి వీలుగా స్టాండ్, నూనె వంటివి చింది ఐపాడ్ తెర పాడవకుండా ఉండేందుకు రిమూవబుల్ స్క్రీన్ షీల్డ్ ఉంటాయి. ఐప్యాడ్ కింద పడిపోకుండా ఈ స్టాండ్‌లో పెట్టి మనకు అనుకూలమైన రీతిలో బిగించుకోవచ్చు. అలా వీటి సాయంతో ఇకపై కిచెన్లోనే యూట్యూబ్ వీడియోలను చూస్తూ, ఎలా చేయాలో వింటూ హ్యాపీగా బోలెడన్ని వెరైటీ వంటకాలను ట్రై చేయొచ్చు. మరెందుకు ఆలస్యం, ప్రపంచంలోని అన్ని రకాల డిషెస్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.