అలా నా ఎనర్జీ లెవల్స్‌ పెరిగాయి..తమన్నా | Actress Tamanna Talks About Her Diet Plan | Sakshi
Sakshi News home page

అలా నా ఎనర్జీ లెవల్స్‌ పెరిగాయి..తమన్నా

Published Mon, Jul 19 2021 12:15 AM | Last Updated on Mon, Jul 19 2021 12:16 AM

Actress Tamanna Talks About Her Diet Plan - Sakshi

తమన్నా

పన్నెండు గంటల గ్యాప్‌తో ఆహారం తీసుకోవడం వల్ల తనకు ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నట్లుగా హీరోయిన్‌ తమన్నా చెబుతున్నారు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘నేను చాలా రకాల డైట్స్‌ను ఫాలో అయ్యాను. కానీ పెద్దగా ఫలితం లేకపోయింది. కానీ డిన్నర్‌కి, నెక్ట్స్‌ మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్య పన్నెండుగంటల గ్యాప్‌ ఉన్నప్పుడు నాకు మంచి ఫలితాలు కనిపించాయి. ఉదాహరణకు నేను ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు నా లాస్ట్‌ మీల్‌ చేస్తే... మర్నాడు ఉదయం 6 గంటలకు బ్రేక్‌ఫాస్ట్‌ చేసేదాన్ని.

ఇలా చేయడం వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. మునుపటి కన్నా నా ఎనర్జీ లెవల్స్‌ పెరిగాయి. అయితే నాకు బాగుందని అందర్నీ పన్నెండు గంటల గ్యాప్‌ని ఫాలో అవ్వమని చెప్పడంలేదు. ఎందుకంటే వారి వారి ఆరోగ్య స్థితి, వారి సామర్థ్యాలను బట్టి డైట్‌ టైమింగ్‌ని ఫాలో అవ్వడం ఉత్తమం’’ అని పేర్కొన్నారు. కాగా ఓ ప్రముఖ చానెల్‌లో తమన్నా చేస్తున్న కుకింగ్‌ షో ‘మాస్టర్‌ చెఫ్‌’ త్వరలో ప్రసారం కానుంది. సినిమాల విషయానికి వస్తే... తమన్నా నటించిన ‘మ్యాస్ట్రో’, ‘సీటీమార్‌’, ‘గుర్తుందా..శీతాకాలం’ రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement