Processor
-
ఇచట డిజిటల్ ఆమ్లెట్ డిజిటల్ పరోటా వేయబడును
అమ్లెట్లు ఎచట వేసెదరు? ఆలూ పరాట ఎక్కడ తయారుచేసెదరు?’ అనే ప్రశ్నలకు ‘ఇవి కూడా ప్రశ్నలేనా. స్టవ్ మీద ఉన్న పెనంపై వేస్తారు. చేస్తారు’ అంటాం. అయితే ఒక టెక్ కంటెంట్ క్రియేటర్ మాత్రం మనం చెప్పే జవాబును మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. సదరు ఈ క్రియేటర్ కంప్యూటర్ ‘సిపియు’పై ఆమ్లెట్ వేశాడు. ఆ తరువాత మినీ పరోటా తయారుచేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ‘డిజిటల్ ఆమ్లెట్లు–పరోటాలు వచ్చేశాయి’ అని మురిసిపోతున్నారు ప్రేక్షకమహాశయులు. -
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌ను లాంచ్ చేసిన ఇంటెల్..!
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డెస్క్‌టాప్( 12 జెన్ i9-12900KS) ప్రాసెసర్‌ను లాంచ్ చేసింది. ఇంటెల్ i9-12900KS ప్రాసెసర్ ఏకంగా 5.5GHz ఫ్రీక్వెన్సీతో పనిచేయనుంది. ఈ ప్రాసెసర్ మునుపటి i9 చిప్సెట్లకు కొనసాగింపుగా రానుంది. ఇంటెల్ i9-12900KS ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్ ప్రాసెసర్ ఇంటెల్ థర్మల్ వెలాసిటీ బూస్ట్‌తో గరిష్టంగా 5.5 GHz వరకు టర్బో ఫ్రీక్వెన్సీతో పనిచేయనుంది. ఇది మెరుగైన గేమింగ్ పనితీరు కోసం ఇంటెల్ అడాప్టివ్ బూస్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. 30MB ఇంటెల్ స్మార్ట్ కాచీతో పాటు మొత్తం 16 కోర్స్, 24 థ్రెడ్స్‌ను కల్గి ఉంది. 150W ప్రాసెసర్ బేస్ పవర్, PCle Gen 5.0 అండ్ 4.0కి సపోర్ట్ చేస్తుంది. DDR5 4800 MT/s వరకు మరియు DDR4 3200 MT/s మద్దతును అందిస్తోంది. Intel కోర్ i9-12900KS ఇప్పటికే ఉన్న Z690 మదర్బోర్డులకు అనుకూలంగా ఉండనుంది. ధర ఏంతంటే...? ఇంటెల్ తన కొత్త i9-12900K ప్రాసెసర్‌ను ఏప్రిల్ 5, 2022 నుంచి అందుబాటులో ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాసెసర్ ధర 739 డాలర్లు(సుమారు రూ. 55,937)గా ఉంది. ఈ ప్రాసెసర్‌ను ప్రపంచవ్యాప్తంగా అన్ని రిటైలర్ల వద్ద బాక్స్డ్ ప్రాసెసర్‌గా కనుగొనవచ్చు. చదవండి: అమెరికాలో రికార్డు సృష్టించిన మోటరోలా -
2021లో రానున్న ఆపిల్ ఎమ్2 ప్రాసెసర్
ఆపిల్ కంపెనీ ఇటీవలే సిలికాన్ ఎమ్1 ప్రాసెసర్‌తో మూడు మ్యాక్ కంప్యూటర్లను విడుదల చేసింది. దీంతో సంప్రదాయ ఇంటెల్ ప్రాసెసర్లకు స్వస్తి పలికింది. ఆపిల్ కంపెనీ మాక్ కోసం కొత్తగా సిలికాన్ ఎమ్1 ప్రాసెసర్ లను రూపొందించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 2021లో రాబోయే కొత్త 13-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో,16-అంగుళాల మాక్‌బుక్ ప్రోలో సిలికాన్ ఎమ్2 ప్రాసెసర్ ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఎమ్1 ప్రాసెసర్‌తో వచ్చిన కొత్త ల్యాప్‌టాప్‌లు పనితీరు, బ్యాటరీ విషయంలో ఇతర ల్యాప్‌టాప్‌ల కంటే మెరుగైన పనితీరును ప్రదర్శించాయి అని టెక్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంస్థ త్వరలో కొత్త మాక్‌బుక్ మరియు ఐమాక్ పరికరాలలో కొత్త ఆపిల్ సిలికాన్ ఎమ్2 ప్రాసెసర్‌తో తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆపిల్ 2021లో కొత్త డిజైన్‌తో మ్యాక్‌బుక్ ప్రొ మోడల్స్‌ని విడుదల చేయనుందట. అలానే 2022లో మిని-ఎల్ఈడీ డిస్ప్లేతో మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రొ, మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌లను యాపిల్ విడుదల చేస్తుందని సమాచారం. ఎఆర్ఎం ఎమ్1 చిప్ 5నానోమీటర్ పై బిల్డ్ చేయబడింది. కొత్త ఎమ్2 ప్రాసెసర్ ఎమ్1 ప్రాసెసర్ కు కొనసాగింపుగా రాబోతుంది. ఎమ్1 చిప్ లో శక్తివంతమైన 8-కోర్ సీపీయూ ఉంది. ఈ చిప్ మునుపటి తరం ప్రాసెసర్ల కంటే 3.5x వేగంగా మరియు 5x వేగవంతమైన జీపీయు పనితీరును ప్రదర్శిస్తుంది. ఆపిల్ సిలికాన్ ఎం1 చిప్సెట్లు న్యూరల్ ఇంజిన్ వంటి టెక్నాలజీ సహాయంతో రూపొందించబడ్డాయి. -
సెక్యూరిటీ ప్రాసెసర్ చిప్.. హ్యాకర్లకు చెక్
న్యూయార్క్: గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా సెక్యూరిటీ ప్రాసెసర్ చిప్‌ను ఆవిష్కరించింది. ప్లూటన్ పేరుతో కొత్తగా అభివృద్ధి చేసిన ఈ చిప్ విండోస్ పీసీలకు మరింత భద్రతను చేకూర్చనున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఈ కొత్త సెక్యూరిటీ చిప్‌ను సిలికాన్ దిగ్గజాలు ఇంటెల్, ఏఎండీ, క్వాల్కామ్ సాంకేతిక సహకారంతో రూపొందించినట్లు తెలియజేసింది. తద్వారా విండోస్ పీసీలలోని నెక్ట్స్ జనరేషన్ హార్డ్‌వేర్‌కు మరింత భద్రతను కల్పించనున్నట్లు వివరించింది. సీపీయూలతో.. మైక్రోసాఫ్ట్ ప్లూటన్ను భవిష్యత్ సీపీయూలలో అంతర్గతంగా ఏర్పాటు చేయనున్నట్లు ఓఎస్ సెక్యూరిటీ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ డేవిడ్ వెస్టన్ తెలియజేశారు. తద్వారా హార్డ్‌వేర్, క్రిప్టోగ్రాఫిక్స్ భద్రతకు వినియోగించే ట్రస్ట్డ్ ప్లాట్పామ్ మాడ్యూల్(టీపీఎంలు)ను ఈ చిప్ రీప్లేస్ చేయనున్నట్లు వివరించారు. ఈ ఆధునిక సెక్యూరిటీ ప్రాసెసర్(ప్లూటన్) హ్యాకర్ల నుంచి మరింత భద్రతను చేకూరుస్తుందని పేర్కొన్నారు. తద్వారా హ్యాకర్లు ఆపరేటింగ్ సిస్టమ్‌లో భాగంగా అంతర్గతంగా దాక్కునేందుకు లేదా.. ఫిజికల్ ఎటాక్స్ చేసేందుకు కష్టమవుతుందని తెలియజేశారు. క్రెడిన్షియల్, ఎన్క్రిప్షన్ కీస్ వంటివి చోరీ చేయడాన్ని ఈ చిప్ అరికడుతుందని వివరించారు. అంతేకాకుండా సాఫ్ట్వేర్ బగ్స్నుంచి రికవరీ సాధించేందుకు సైతం తోడ్పడుతుందని పేర్కొన్నారు. వెరసి కమ్యూనికేషన్ చానల్‌పై దాడి అవకాశాలకు చెక్ పెడుతుందని చెప్పారు. గత పదేళ్లుగా టీపీఎంలు విండోస్‌కు మద్దతిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
మైక్రోసాఫ్ట్ నుంచి త్వరలో సర్ఫేస్!
ఎంతోకాలం నుంచి త్వరలో విడుదల చేస్తామని చెబుతున్న మైక్రోసాఫ్ట్‌లో తన కొత్త మోడల్ 'సర్ఫేస్'లో ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించారో తెలిసింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో లభ్యం కానుంది. ఇందుకోసం ఎంఎస్ఎం 8998 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను ఆపరేటింగ్ సిస్టంకు తగినట్లుగా సిద్ధం చేసింది. ప్రత్యేకంగా తయారుచేసిన ప్రాసెసర్‌ను క్వాల్కామ్ త్వరలో మైక్రోసాఫ్ట్‌కు అందించనున్నట్లు సమాచారం. ఫోర్బ్స్ ప్రచురణ ప్రకారం ఎంఎస్ఎం8998 ప్రాసెసర్ ముందు తరానికి చెందినదిగా, స్నాప్ డ్రాగన్ 830గా పేర్కొంది. శామ్సంగ్ ఫోన్ల తయారీ పద్దతిలో ఉపయోగించే 10ఎన్ఎం తయారీ పద్ధతిని ఇందుకు ఉపయోగించనున్నారు. 8 జీబీ ర్యామ్‌తో ఉండే ఈ ఫోన్‌ను మూడు రకాలుగా భిన్నమైన ధరలతో ముందుకు తేనున్నట్లు సమాచారం. విండోస్ 10 ఓఎస్‌కు జతచేస్తున్న కొత్త ఫీచర్ల కారణంగా విడుదల సమయం పెరుగుతూ వస్తోంది. కాగా మైక్రోసాఫ్ట్ 2017 వరకు ఈ మొబైల్‌ను అందుబాటులోకి తేలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.