Intel Announces World's Fastest Desktop Processor Called I9-12900ks - Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అ‍త్యంత వేగవంతమైన ప్రాసెసర్‌ను లాంచ్‌ చేసిన ఇంటెల్‌..! ధర ఏంతంటే..?

Published Tue, Mar 29 2022 6:53 PM | Last Updated on Tue, Mar 29 2022 8:16 PM

Intel Announces Worlds Fastest Desktop Processor Called i9-12900ks - Sakshi

ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఇంటెల్‌ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డెస్క్‌టాప్‌( 12 జెన్‌ i9-12900KS) ప్రాసెసర్‌ను లాంచ్‌ చేసింది. ఇంటెల్‌  i9-12900KS ప్రాసెసర్‌ ఏకంగా 5.5GHz  ఫ్రీక్వెన్సీతో పనిచేయనుంది. ఈ ప్రాసెసర్‌ మునుపటి  i9 చిప్‌సెట్‌లకు కొనసాగింపుగా రానుంది.
 
ఇంటెల్ i9-12900KS ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్‌

  • ప్రాసెసర్ ఇంటెల్ థర్మల్ వెలాసిటీ బూస్ట్‌తో గరిష్టంగా 5.5 GHz వరకు టర్బో ఫ్రీక్వెన్సీతో పనిచేయనుంది.
  •  ఇది మెరుగైన గేమింగ్ పనితీరు కోసం ఇంటెల్ అడాప్టివ్ బూస్ట్ టెక్నాలజీని కలిగి ఉంది.
  • 30MB ఇంటెల్ స్మార్ట్ కాచీతో పాటు మొత్తం 16 కోర్స్‌, 24 థ్రెడ్స్‌ను కల్గి ఉంది.
  • 150W ప్రాసెసర్ బేస్ పవర్,  PCle Gen 5.0 అండ్‌ 4.0కి సపోర్ట్ చేస్తుంది.  
  • DDR5 4800 MT/s వరకు మరియు DDR4 3200 MT/s మద్దతును అందిస్తోంది. 
  • Intel కోర్ i9-12900KS ఇప్పటికే ఉన్న Z690 మదర్‌బోర్డులకు అనుకూలంగా ఉండనుంది.

ధర ఏంతంటే...?
ఇంటెల్ తన కొత్త i9-12900K ప్రాసెసర్‌ను  ఏప్రిల్ 5, 2022 నుంచి అందుబాటులో ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాసెసర్‌ ధర 739 డాలర్లు(సుమారు రూ. 55,937)గా ఉంది. ఈ ప్రాసెసర్‌ను ప్రపంచవ్యాప్తంగా అన్ని రిటైలర్ల వద్ద బాక్స్‌డ్ ప్రాసెసర్‌గా కనుగొనవచ్చు. 

చదవండి: అమెరికాలో రికార్డు సృష్టించిన మోటరోలా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement