న్యూఢిల్లీ: ఐటీ రంగ సంస్థ హెచ్‌సీఎల్‌టెక్ తాజాగా యూఎస్‌కు చెందిన చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ సహకారంతో డేటా ట్రస్ట్ షీల్డ్ పేరుతో ఎంటర్‌ప్రైస్ డేటా సెక్యూరిటీ సర్వీసులను ప్రారంభించింది. క్లౌడ్ వ్యవస్థలో సున్నిత సమాచార రక్షణను ఇది మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది.
ఇంటెల్ ట్రస్ట్ డొమైన్ ఎక్స్‌టెన్షన్స్ (ఇంటెల్ టీడీఎక్స్), ఇంటెల్ ట్రస్ట్ అథారిటీ వంటి విశ్వసనీయ సాధనాలను ఉపయోగించడం ద్వారా క్లౌడ్ కార్యకలాపాల సమయంలో సున్నిత సమాచారాన్ని భద్రపరచడానికి డేటా ట్రస్ట్ షీల్డ్ రూపొందించినట్టు వివరించింది. ఈ సొల్యూషన్ గూగుల్ క్లౌడ్‌లో పరీక్షించామని, భవిష్యత్తులో ఇతర భారీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లతో అనుసంధానిస్తామని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: రూ.5 లక్షల కోట్ల ఐటీ కంపెనీ.. వారసురాలికి గ్రీన్‌సిగ్నల్
ఈ సేవలు డేటా భద్రతలో ఒక ప్రధాన ముందడుగు అని, అధిక స్థాయి రక్షణను అందిస్తుందని హెచ్‌సీఎల్‌టెక్ ఈవీపీ ఆనంద్ స్వామి వివరించారు. ఇంటెల్ అధునాతన సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఈ సొల్యూషన్ డిజిటల్ ఆస్తులను సురక్షితం చేస్తుందని, క్లౌడ్ వ్యవస్థపై విశ్వాసం పెంచుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment