ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ ఉద్యోగుల కోసం దాని మాజీ సీఈవో పాట్ గెల్సింగర్ ఉపవాసం ఆచరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. ఉపవాసంలో తనతో చేరాలని సహోద్యోగులనూ కోరుతున్నారు. ఇంతకీ ఉపవాసం ఎందుకు చేస్తున్నారు.. ఇంటెల్ ఉద్యోగులకు ఏమైంది.. ఈయన ఏం చెప్పారన్నది ఇప్పుడు చూద్దాం..
ఇంటెల్ సంస్థ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ సీఈవో పాట్ గెల్సింగర్.. సంస్థలో పనిచేస్తున్న లక్ష మందికి పైగా ఉద్యోగుల శ్రేయస్సు, వారి భవిష్యత్తు కోసం లోతైన ఆందోళనను వ్యక్తం చేస్తూ తాను ఆచరిస్తున్న ప్రార్థన, ఉపవాసంలో తనతో చేరాలని సహోద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరుకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు.
"నేను ప్రతి గురువారం 24 గంటలపాటు ప్రార్థన, ఉపవాసం ఆచరిస్తున్నాను. క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న లక్ష మంది ఇంటెల్ ఉద్యోగుల కోసం ప్రార్థనలు, ఉపవాసం చేయడంలో నాతో చేరాలని ఈ వారం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇంటెల్, దాని సిబ్బంది పరిశ్రమకు, యూఎస్ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది" అని గెల్సింగర్ రాసుకొచ్చారు.
ఇదీ చదవండి: ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే తీపి కబురు
చిప్ మార్కెట్‌లో ఇంటెల్ ప్రభ తగ్గిపోవడం, మరోవైపు ఎన్‌విడియా పుంజుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కంపెనీ బోర్డ్ విశ్వాసాన్ని కోల్పోయిన జెల్సింగర్ ఉద్వాసనకు గురయ్యారు. ఇంటెల్ సంస్థను నడిపించడం తనకు లభించిన జీవితకాల గౌరవమని తన పదవీ విరమణ సందర్భంగా గెల్సింగర్ పేర్కొన్నారు.
ఇంటెల్‌లో ఇటీవల గణనీయమైన పునర్‌వ్యవస్థీకరణ మార్పులు సంభవించాయి. 15% సిబ్బందిని తొలగించింది. 10 బిలియన్ డాలర్ల మేర ఖర్చును తగ్గించుకుంది. కంపెనీ ఇటీవలే ఒక్కో షేరుకు 0.46 డాలర్ల చొప్పున నష్టపోయింది. గతేడాదితో పోలిస్తే ఆదాయం 6.2% క్షీణించి 13.28 బిలియన్ డాలర్లకు తగ్గింది. జెల్సింగర్ నిష్క్రమణ తరువాత డేవిడ్ జిన్స్నర్, మిచెల్ జాన్‌స్టన్ హోల్తాస్‌లు తాత్కాలికంగా సహ సీఈవోలుగా నియమితులయ్యారు. శాశ్వత సీఈవో కోసం ఇంటెల్ తీవ్రంగా అన్వేషిస్తోంది.
Every Thursday I do a 24 hour prayer and fasting day . This week I'd invite you to join me in praying and fasting for the 100K Intel employees as they navigate this difficult period. Intel and its team is of seminal importance to the future of the industry and US.
— Pat Gelsinger (@PGelsinger) December 8, 2024
Comments
Please login to add a commentAdd a comment