Why
-
ఇంటెల్ ఉద్యోగుల కోసం మాజీ సీఈవో ఉపవాసం..
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ ఉద్యోగుల కోసం దాని మాజీ సీఈవో పాట్ గెల్సింగర్ ఉపవాసం ఆచరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. ఉపవాసంలో తనతో చేరాలని సహోద్యోగులనూ కోరుతున్నారు. ఇంతకీ ఉపవాసం ఎందుకు చేస్తున్నారు.. ఇంటెల్ ఉద్యోగులకు ఏమైంది.. ఈయన ఏం చెప్పారన్నది ఇప్పుడు చూద్దాం..ఇంటెల్ సంస్థ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ సీఈవో పాట్ గెల్సింగర్.. సంస్థలో పనిచేస్తున్న లక్ష మందికి పైగా ఉద్యోగుల శ్రేయస్సు, వారి భవిష్యత్తు కోసం లోతైన ఆందోళనను వ్యక్తం చేస్తూ తాను ఆచరిస్తున్న ప్రార్థన, ఉపవాసంలో తనతో చేరాలని సహోద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరుకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు."నేను ప్రతి గురువారం 24 గంటలపాటు ప్రార్థన, ఉపవాసం ఆచరిస్తున్నాను. క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న లక్ష మంది ఇంటెల్ ఉద్యోగుల కోసం ప్రార్థనలు, ఉపవాసం చేయడంలో నాతో చేరాలని ఈ వారం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇంటెల్, దాని సిబ్బంది పరిశ్రమకు, యూఎస్ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది" అని గెల్సింగర్ రాసుకొచ్చారు.ఇదీ చదవండి: ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే తీపి కబురుచిప్ మార్కెట్లో ఇంటెల్ ప్రభ తగ్గిపోవడం, మరోవైపు ఎన్విడియా పుంజుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కంపెనీ బోర్డ్ విశ్వాసాన్ని కోల్పోయిన జెల్సింగర్ ఉద్వాసనకు గురయ్యారు. ఇంటెల్ సంస్థను నడిపించడం తనకు లభించిన జీవితకాల గౌరవమని తన పదవీ విరమణ సందర్భంగా గెల్సింగర్ పేర్కొన్నారు.ఇంటెల్‌లో ఇటీవల గణనీయమైన పునర్వ్యవస్థీకరణ మార్పులు సంభవించాయి. 15% సిబ్బందిని తొలగించింది. 10 బిలియన్ డాలర్ల మేర ఖర్చును తగ్గించుకుంది. కంపెనీ ఇటీవలే ఒక్కో షేరుకు 0.46 డాలర్ల చొప్పున నష్టపోయింది. గతేడాదితో పోలిస్తే ఆదాయం 6.2% క్షీణించి 13.28 బిలియన్ డాలర్లకు తగ్గింది. జెల్సింగర్ నిష్క్రమణ తరువాత డేవిడ్ జిన్స్నర్, మిచెల్ జాన్స్టన్ హోల్తాస్లు తాత్కాలికంగా సహ సీఈవోలుగా నియమితులయ్యారు. శాశ్వత సీఈవో కోసం ఇంటెల్ తీవ్రంగా అన్వేషిస్తోంది.Every Thursday I do a 24 hour prayer and fasting day . This week I'd invite you to join me in praying and fasting for the 100K Intel employees as they navigate this difficult period. Intel and its team is of seminal importance to the future of the industry and US.— Pat Gelsinger (@PGelsinger) December 8, 2024 -
ఏటా కొత్త ఐఫోన్ ఎందుకు? పాత ఫోన్లను ఏం చేస్తారు?
Why Apple launches new iPhone every year: ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ ఒకటి. యాపిల్ (Apple) సంస్థ ప్రతి సంవత్సరం కొత్త సిరీస్ ఐఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఐఫోన్ కోసం యూజర్లు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఈ సంవత్సరం, ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌ను తీసుకొచ్చింది. గత సెప్టెంబర్‌లో జరిగిన యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్ సందర్భంగా వీటిని లాంచ్ చేసింది. కొత్త ఐఫోన్ అమ్మకానికి రాగానే ఆన్‌లైన్‌తోపాటు యాపిల్ స్టోర్లకు కస్టమర్లు క్యూకట్టారు. (iPhone 15 series: ఇంతవరకూ ఏ ఫోన్లోనూ లేని 9 ఫీచర్లు! అవి ఏంటంటే..) యాపిల్ ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్‌ను ఎందుకు విడుదల చేస్తుంది.. ఎక్స్చేంజ్ కింద తీసుకున్న పాత ఐఫోన్లను ఏం చేస్తుంది.. అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఈ ప్రశ్నలకు యాపిల్ సీఈవో టిమ్‌కుక్ (Tim Cook) స్వయంగా సమాధానాలు చెప్పారు. కొత్త ఐఫోన్ల లాంచ్ గురించి.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్, బ్రూట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏటా యాపిల్ ఎందుకు కొత్త ఐఫోన్ సిరీస్‌ను తీసుకొస్తుందన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ కావాలని యూజర్లు కోరుకుంటారని, వారికిది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. పాత ఐఫోన్లను ఏం చేస్తామంటే.. అలాగే కొత్త ఐఫోన్ కోసం పాత ఐఫోన్లను ట్రేడ్ చేయడానికి అనుమతించే ఆపిల్ పాలసీ గురించి కూడా టిమ్‌కుక్ మాట్లాడారు. ఈ పాత ఫోన్లను ఏమి చేస్తారో వివరించారు. పనిచేస్తున్న పాత ఐఫోన్లను తిరిగి విక్రయిస్తామని, పని చేయనివాటిని విడదీసి కొత్త ఐఫోన్‌ను తయారు చేయడానికి వాని విడిభాగాలను ఉపయోగిస్తామని వెల్లడించారు. -
ఈ భేటీ జీ20 కుటుంబానికి మైలురాయి.. ఎందుకంటే..
ఢిల్లీ: ఆఫ్రికన్ యూనియన్ను శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవడం G20 కుటుంబానికి ఒక మైలురాయి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన రెండు రోజుల G20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభ సెషన్లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్ను కూటమిలో కొత్త సభ్యుడిగా స్వాగతించారు. గ్లోబల్ సౌత్‌కు కొత్త ఆశలను కల్పిస్తున్న ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ అజలీ అసోమానీకి స్వాగతం తెలిపారు. Advancing a more inclusive G20 that echoes the aspirations of the Global South! PM @narendramodi extends a heartfelt welcome to President @_AfricanUnion and the President of Comoros Azali Assoumani. Thrilled to have the African Union as a permanent member. A milestone for the… pic.twitter.com/SqwziRCwiT — PMO India (@PMOIndia) September 9, 2023 'G20లో పూర్తి సభ్యునిగా ఆఫ్రికన్ యూనియన్ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నాను. ఈ సభ్యత్వం కోసం కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాము. ఆఫ్రికా ఖండానికి ప్రపంచ సేవలు అందడమే కాకుండా సవాళ్లపై ఆఫ్రికా దేశాలు పోరాడేలా పరస్పర సహకారాలు అందుతాయి.' అని ట్విట్టర్ వేదికగా ఆఫ్రికన్ యూనియన్ కమీషన్ హెడ్ మౌసా ఫకీ మహమత్ అన్నారు. గత కొన్నాళ్లుగా గ్లోబల్ సౌత్ ప్రాతినిధ్యంపై భారత్ వాయిస్ వినిపిస్తోంది. జీ20 కేవలం 20 దేశాలకు సంబంధించిన విషయం కాదని, వెనకబడిన గ్లోబల్ సౌత్ కోసం పాటుపడేలా ఉండాలని ప్రధాని మోదీ గత డిసెంబర్లోనే అన్నారు. ప్రపంచ వేదికలపై విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశారు. I welcome the @_AfricanUnion's entry into the #G20 as full member. This membership, for which we have long been advocating, will provide a propitious framework for amplifying advocacy in favor of the Continent and its effective contribution to meeting global challenges. — Moussa Faki Mahamat (@AUC_MoussaFaki) September 9, 2023 ఢిల్లీ వేదికగా నేడు జీ20 సమావేశం ప్రారంభమైంది. ప్రపంచ దేశాల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభ సెషన్లో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆఫ్రికన్ యూనియన్ జీ20 కూటమిలో భాగస్వామిగా చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆఫ్రికా కూటమికి ఆహ్వానం పలికారు. ఇదీ చదవండి: కంటికి ఐ ప్యాచ్‌తో జీ20 సదస్సుకు జర్మనీ ఛాన్సలర్.. ఎందుకంటే! -
Health tip : కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయొద్దు
తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం వల్ల అది మన మనస్తత్వ శాస్త్రాన్ని ప్రభావితం చేస్తుందని, జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుందని వెల్నెస్ కోచ్, ఆయుర్వేద ఔత్సాహికురాలు అమృత కౌర్ రాణా తెలిపారు. FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు అమృత. ఆమె చెప్పిన హెల్త్ టిప్స్ ఇవి. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి (షవర్ తీసుకోకండి), ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది ఆయుర్వేదం 'జీవిత శాస్త్రం'. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంలో సహాయపడుతోంది శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచుకోవడం మన కర్తవ్యం, లేకుంటే మన మనస్సును బలంగా మరియు స్పష్టంగా ఉంచుకోలేము ప్రతిరోజూ, మన ఆరోగ్యాన్ని నిర్దేశించే ఎంపికలను చాలా తరచుగా, మనకు తెలియకుండానే మార్చుకుంటాం. వేగవంతమైన జీవితాలు మరియు అనేక బాహ్య కారకాలచే ప్రభావితమవుతున్నాయి. వేదాలు ప్రకృతిలోని ఐదు అంశాలను - గాలి, నీరు, అంతరిక్షం, అగ్ని మరియు భూమి - పంచమహాభూతంగా సూచిస్తాయి. మానవ శరీరంలో ఈ మూలకాల ఉనికి లేదా లేకపోవడం దాని జీవ స్వభావం లేదా దోషాన్ని నిర్ణయిస్తుంది. ఆధునిక జీవనం కోసం ఆరోగ్యకరమైన శరీరం & మనస్సు కోసం ఆయుర్వేద సూత్రాల ఆధారంగా రోజువారీ అభ్యాసాలు చాలా ముఖ్యమైనవి శక్తితో కూడిన శరీరం కోసం మనస్సు తేలికగా ఉండాలి ఎప్పుడు మానసిక ఒత్తిడితో జీవితం గడిపితే అది కచ్చితంగా శరీరంపై, తద్వారా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఆయుర్వేద పోషకాహారం ప్రకారం రోజువారీ మంచి ఆహారపు అలవాట్లు పెంచుకోవాలి మంచి జీర్ణ శక్తి, సరైన రుతుస్రావం మెరుగైన హార్మోన్లకు దోహదపడతాయి ఒత్తిడి లేని జీవితం గడిపేలా స్వీయ-సంరక్షణ పద్ధతులను పాటించాలి కంటి నిండా నిద్ర, మానసిక ఆరోగ్యం వల్ల చర్మం, జుట్టు సంరక్షింపబడతాయి మైండ్‌ఫుల్‌గా తినడం అంటే ఎక్కువ తినమని కాదు అర్థం. దీనికి కేలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు లేదా ప్రోటీన్‌తో సంబంధం లేదు. కానీ ఏం తింటున్నామో.. మనసుకు తెలియజేయాలి. మనం నోట్లో పెట్టుకున్నప్పుడు మనసు దాన్ని జీర్ణింపజేయడానికి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. ఇంద్రియ జ్ఞానం వల్ల తినే తిండి సత్పలితాలను ఇస్తుంది. తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం మన శరీరధర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ఆహారం తిన్న కొద్దిసేపటి వరకు నీళ్లు తాగకుండా చూసుకోండి. భోజనం చేసిన వెంటనే కనీసం 100 అడుగులు నడవడం మంచిది. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. మీరు అతిగా తింటే, మీ తదుపరి భోజనాన్ని తగ్గించండి లేదా దానిని దాటవేయండి. సూర్యాస్తమయం తర్వాత పెరుగు తినకూడదు. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి. ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది. స్నానం మీ హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది ఇది కడుపు నిండినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది అని ఆమె తెలిపారు (అమృత ఫుడ్ బ్లాగర్ మరియు సర్టిఫైడ్ ఆయుర్వేద పోషకాహార సలహాదారు, జర్నలిస్ట్, రేడియో జాకీ, కంటెంట్ సృష్టికర్త మరియు ఉపాధ్యాయురాలు) -
పనగారియా ఎందుకు తప్పుకున్నారు?
న్యూఢిల్లీ: ఆర్థిక ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేసిన ‘నీతి ఆయోగ్’ వైస్ చైర్మన్ పదవికి ప్రముఖ ఆర్థిక నిపుణులు అరవింద్ పనగారియా ఎందుకు రాజీనామా చేశారు? గుజరాత్ తరహా పాలన అందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన ఆర్థిక గురువు జగదీశ్ భగవతితోపాటు ఎప్పుడూ సన్నిహితంగా ఉండే పనగారియా అర్ధాంతరంగా ఎందుకు కీలక పదవి నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది? పనగారియా ఆలోచన మేర కే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను జనరల్ బడ్జెట్లో కలిపేశారు. పట్టణ ఆరోగ్య వ్యవస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖతో మంతనాలు జరుపుతున్న తరుణంలోనే ఆయన పదవిని వదులుకున్నారు. భారీ నష్టాల్లో నడుస్తున్న భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కూడా ప్రైవేటీకరించాలన్నది ఆయన బలమైన ఆకాంక్ష. ఇటు కేంద్ర, అటు రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటును తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నది ఆయన భవిష్యత్తు వ్యూహం. ఆయన సూచనమేరకే దేశంలో పెద్ద నోట్లను ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ నిర్ణయం బెడిసికొట్టిందన్న కారణంగా పనగారియా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందా? భారత్‌లో పనిచేసేందుకు న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి సెలవు తీసుకొని తాను వచ్చానని, సెలవు పొడిగించేందుకు యూనివర్శిటీ నిరాకరించడంతో తాను నీత్ ఆయోగ్ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఇంత లేటు వయస్సులో అంత మంచి పదవి మళ్లీ దొరకదని, అందుకనే తిరిగి పాత ఉద్యోగానికి వెళుతున్నానని అన్నారు. ఆయన వాదన ఎంత బలహీనంగా ఉందో ఆయన మాటలనుబట్టి ఇట్టే తెలిసిపోతోంది. మరి, అలాంటప్పుడు ఆయన రాజీనామా వెనక బలమైన కారణాలు ఉన్నాయా? కార్పొరేట్ ఎజెండాను పక్కన పెట్టాల్సిందిగా ఆయనపై ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలైన స్వదేశీ జాగారన్ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్‌ల నుంచి ఒత్తిళ్లు తీవ్రమయ్యాయట. మోదీ విధేయుడిగా ఆ ఒత్తిళ్లను ఎదుర్కోవడం కూడా ఆయనకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయినా ఎందుకు తప్పుకున్నారు? తనతో ఎలాంటి సంప్రతింపులు జరపకుండానే నీతి ఆయోగ్ సంస్థకు సీఈవోగా అమితాబ్ కాంత్‌ను నియమించడం ఆయనకు నచ్చలేదట. దాంతోపాటు ఆరెస్సెస్ ఒత్తిళ్లు కూడా భరించలేక తప్పుకున్నారని తెలుస్తోంది. -
రద్దయిన నోట్లు ఉంటే నేరమా? ఎలా?
ముంబై: పాత నోట్లపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం అనేక అనుమానాలకు, చర్చలకు తావిచ్చింది. రద్దయిన నోట్లను కలిగి ఉండటం ఎలా నేరమవుతుంది. ఇపుడిదే ప్రశ్న సామాన్య ప్రజలతో పాటు పలువుర్ని వేధిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రూ.500, రూ.1000 నోట్ల చలామణికి ఎలాంటి చట్టబద్ధత లేదు. దీంతో ఎలాంటి లావాదేవీలకు ఆస్కారం లేదు. మరి తాజా ఆర్డినెన్స్ ఉద్దేశం ఏమిటి? దేశంలో పెద్ద మొత్తంలో చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్ల రద్దుచేస్తూ నవంబర్ 8 న కేంద్ర ప్రభుత్వం సంచలన రేపింది. ఈ నోట్లను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీనికి కొంతగడువును , పరిమితులను విధించింది. ఈ నేపథ్యంలోనే ఇంకా బయటపడని, చట్టపరంగా వెల్లడించని నల్లధనానికి చెక్ పెట్టేందుకే తాజా ఆర్డినెన్స్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆర్బీఐ చట్ట సవరణ ద్వారా తీసుకొచ్చిన ఈ చట్ట ప్రకారం రద్దయిన నోట్లను కలిగి ఉండటం నేరమే అవుతుంది. చట్ట నిబంధనల ప్రకారం ఆయా వ్యక్తులు శిక్షార్హులే. గతంలో 1978లో కూడా ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి గమనార్హం. మరోవైపు కొన్ని రోజుల తరువాత ప్రస్తుతం చలామణీలోకి తీసుకొచ్చిన కొత్త రెండు వేల నోటును కూడా రద్దుచేసి, మళ్లీ వెయ్యి నోట్లను చలామణిలోకి తేనున్నారనే వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. రద్దు చేసిన పాత రూ.1000 నోటుకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని గతంలో పుకార్లు షికార్లు చేశాయి. రానున్న పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షాలకు, పలు రాజకీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు 2017 లో రెండు వేల నోటును కూడా రద్దు చేయనుందన్న వాదనలు కూడా వినిపించాయి. ది స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ సెసేషన్ ఆఫ్ లయబిలిటీస్ ఆర్డినెన్స్'గా పేర్కొన్న ఈ కొత్త ఆర్డినెన్స్ ప్రకారం 2017 మార్చి 31 తర్వాత 10 కంటే ఎక్కువ పాతనోట్లు కలిగి ఉంటే నేరం. ఇలాంటి వారికి 4 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు. దీంతోపాటు పాత నోట్లను మార్చుకునే వారికి, పాతనోట్ల లావాదేవీలలో పాలుపంచుకున్న వారికి రూ.5 వేలు జరిమానా విధించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రద్దయిన నోట్ల డిపాజిట్లకు గడువు డిసెంబర్ 30వరకు మాత్రమే. ఈ గడువు తర్వాత మార్చి 31 వరకు కేవలం రిజర్వు బ్యాంకు వద్ద మాత్రమే పాతనోట్ల మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 30 తర్వాత కూడా పాత రూ.500, రూ.1000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉన్నవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా ఉన్న క్లాజును కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులో చేర్చింది. ఈ ఆర్డినెన్సును ఆమోదించిన కేంద్ర కేబినెట్ దానిని రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్ కు పంపనుంది. బుధవారం అత్యవసరంగా భేటీ అయిన కేంద్ర కేబినెట్ పెద్దనోట్ల రద్దుపై రూపొందించిన ఆర్డినెన్సుకు ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. -
మార్పు వెనుక మతులబేమిటో?
స్థలాల మార్పుపై అనేక అనుమానాలు చక్రం తిప్పుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు నిజామాబాద్‌అర్బన్ : నగర అభివృద్ధికి పాటుపడాల్సిన ప్రజాప్రతినిధులు ముడుపుల బాగోతానికి తెరలేపుతున్నారని, మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని వేదికగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 27న నిర్వహించిన కౌన్సిల్ సమావేశం ఏజెండా అంశాల్లో పారిశ్రామిక ప్రాంతంగా పేర్కొంటున్న స్థలాలను నివాసప్రాంతాలుగా మార్చాలనే అంశాన్ని కేవలం రెండు గంటల ముందు చేర్చడం చర్చనీయాంశమైంది. నగరంలోని నాలుగు డివిజన్లలోని దుబ్బ, అర్సపల్లి, ఆటోనగర్, ఎన్ఆర్ఐ కాలనీల్లో పారిశ్రామిక ప్రాంతాలున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు నిర్మించారు. దుబ్బ ప్రాంతంలోని బైపాస్ రోడ్డును ఆనుకుని నగరం వరకు ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటికి కార్పొరేషన్ అధికారులు సైతం అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఈ ప్రాంతంలో 3229, 3230, 3231,3232,3233,3193,3194 నెంబర్లతో పాటు 29 సర్వే నెంబర్లలో పారిశ్రామికవాడ పరిధి ఉంది. దీన్ని ఆసరా చేసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు నిర్మించిన వారితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పైన పేర్కొన్న సర్వే నెంబర్లతో పాటు ఇతర సర్వే నెంబర్లను గుర్తించి న్యాల్‌కల్‌రోడ్డు, గాయత్రినగర్, ప్రాంతాల్లోని పారిశ్రామివాడ ప్రాంతాన్ని నివాసప్రాంతాలుగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కౌన్సిల్ ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చి ఆమోదం పొందితే ఇబ్బందులు ఉండవని ఆలోచించారు. కొందరు కార్పొరేటర్లు ఎజెండాలోని ఈ అంశాన్ని వ్యతిరేకించడంతో విఫలమయ్యారు. గాయత్రినగర్‌లోని సర్వే నెంబర్813/అ లోని పారిశ్రామికవాడకు చెందిన 0.13 గుంటల భూమిని నివాసయోగ్యంగా మార్చేందుకు స్థానిక కార్పొరేటర్‌కు సమాచారం లేకుండానే ఏజెండాలో చేర్చారు. న్యాల్కల్ రోడ్డులో 1551 , 1552,1553 సర్వే నెంబర్లను సైతం ఏజెండా అంశంలో చేర్చారు. ఇందులో కొందరు ప్రజాప్రతినిధులు ముఖ్యపాత్ర పోషించినట్లు తెలిసింది. భారీగా ముడుపులు.. పారిశ్రామిక ప్రాంతాలను నివాస ప్రాంతాలుగా మార్చేందుకు భారీగానే ముడుపులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ అధికారులు కొందరు ముఖ్యపాత్రపోషించినట్లు సమాచారం. ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు కొందరు అధికారులు రూ.లక్ష నుంచి 2లక్షల వరకు, మరో వైపు స్థానిక ప్రజాప్రతినిధులు రూ.2లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద మొత్తంలో ముడుపులు వసూలు చేసిన వీరు పారిశ్రామికవాడకు చెందిన ప్రాంతాలను నివాసప్రాంతాలుగా మారిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. ఈ మేరకు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే మాస్టర్ ప్లాన్ కొనసాగుతుండగా ఇండస్ట్రీయల్ ప్రాంతాన్ని నివాస ప్రాంతాలుగా మార్చడానికి అనుమతి లేదని, మాస్టర్‌ప్లాన్‌లో అన్ని ప్రాంతాలకు సంబంధించి సరైన ప్రణాళిక వస్తుందని, హుటాహుటిన ఈ తీర్మాణాన్ని సమావేశంలోకి ఎందుకు తీసుకొచ్చారని కొందరు టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎంఐఎం కార్పొరేటర్లు ప్రశ్నించారు. ప్రస్తుతం పారిశ్రామిక ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకున్న వారిని విచారించి చర్యలు తీసుకుంటే కొత్తగా ఇళ్ల నిర్మాణం జరగదని పేర్కొంటున్నారు. అనుమతి ఇవ్వం.. పారిశ్రామిక ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం కుదరదు. నిబంధనలు ఒప్పుకోవు. మాస్టర్‌ప్లాన్ రూపుదిద్దుకుంటున్నందున మరికొన్ని రోజుల్లో సరైన ప్రణాళిక వస్తుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టకూడదు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు. – నాగేశ్వర్, మున్సిపల్ కమిషనర్ -
ఈ దుర్మార్గం ఎవరి మెప్పు కోసం: స్వరూపానందేంద్ర
విశాఖపట్టణం: హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా విజయవాడలో దేవాలయాలను కూల్చివేస్తున్నారని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే దేవాలయాలను కూల్చి.. విగ్రహాలను ఈడ్చుకుంటూ తరలించడం మంచి పరిణామం కాదన్నారు. ఎవరి మెప్పు కోసం ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. ధనుర్మాస దీక్ష కోసం రుషికేశ్‌లో ఉన్న స్వామీజీ విజయవాడలో జరుగుతున్న పరిణామాలపై శనివారం స్పందించారు. దేవాలయాల కూల్చివేతపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక సంఘాలు హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యయప్రయాసలకోర్చి ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలాంటి దేశంలో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కారణజన్ములైన శంకరాచార్య, రామానుజాచార్య, మద్వాచార్యుల చేతుల మీదుగా ఎన్నో దేవాలయాలకు ప్రతిష్ఠాపన జరిగిందని గుర్తు చేశారు. అందులో స్వయంభూ, రుషిప్రతిష్టలు, ఆగమాలతో కూడిన ప్రతిష్టలు ఎన్నో ఉన్నాయన్నారు. అలాంటి దేవాలయాలను కృష్ణా పుష్కరాలు, రోడ్డు విస్తరణల పేరుతో శాస్త్ర విరుద్ధంగా కూల్చివేయడం, విగ్రహాలను తాళ్లతో కట్టి తీసుకువెళ్లడం ఎంతో అపచారమన్నారు. ఒకవేళ నిజంగా ఆలయాలను కూల్చాల్సిన పరిస్థితి వస్తే ఏ ఆగమ పద్ధతుల్లో వాటిని ప్రతిష్టించారో..అవే ఆగమ పద్ధతుల్లో శాస్త్రోక్తంగా తొలగించాలన్నారు. కానీ ఇష్టానుసారంగా దేవాలయాలను కూల్చివేసి హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించారు. ఎవరి మెప్పు కోసం ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడ్డారో.. ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టారో చెప్పాలన్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని స్వామీజీ డిమాండ్ చేశారు. ఇలాంటి వాటిని ప్రశ్నించిన వారి గురించి కొంతమంది నాయకులు నీతిబాహ్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, అధినాయకుల మెప్పు కోసం అలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. -
అర్ధరాత్రి ముహుర్తం ఎందుకు?
-
మలోరీనా... మజాకా!
విచిత్రం ‘ఈ బాధ పగవాళ్లకు కూడా వద్దు బాబోయ్’ అని మాట సామెతగా అనేవాళ్లను చూశాం కానీ, అది నోటిమాటగా కాదు, నీటైన వెద్యం రూపంలో రుజువు చేసి చూపింది ఈ పదమూడేళ్ల అమ్మాయి. అమెరికాకు చెందిన మలోరీ కివ్మాన్కి తరచు ఎక్కిళ్లు వస్తుండేవి. డాక్టర్ల చుట్టూ తిరగలేక ఉప్పునీటితో పుక్కిలించటం, పంచదార చప్పరించటం, ఆపకుండా ఏడుగుక్కల నీళ్లు తాగటం వంటి గృహవైద్య చిట్కాలు కూడా పాటించేది. అలా ఎన్నో పాట్లు పడితే ఎప్పటికో గానీ ఎక్కిళ్లు తగ్గేవి కావు మలోరీకి. దాంతో ఆమె ఎక్కిళ్ల మీద దృష్టి పెట్టింది. వాటిని త్వరగా తగ్గించే మార్గం కోసం రకరకాల ప్రయోగాలు చేసింది. చివరికి యాపిల్, వెనిగర్, చక్కెర మిశ్రమంతో వెక్కిళ్లకు చెక్ పెట్టవచ్చని కనిపెట్టింది. ఆ మూడూ కలిపి ఒక లాలీపాప్ తయారు చేసింది. అంతేకాదు, దానికి ‘ది హికప్ పాప్’అని పేరు కూడా పెట్టింది. కొందరు డాక్టర్లు దీనిని రకరకాలుగా పరీక్షించారు. పరిశోధన జరిపారు. చివరికి ఈ మందు ఎక్కిళ్లకు చాలా బాగా పని చేస్తుందని నిర్థారించారు. దాంతో తను కనిపెట్టిన లాలీపాప్‌ను... సారీ.. హికప్ పాప్‌ను తల్లిదండ్రులు, స్నేహితుల సాయంతో భారీ ఎత్తున తయారు చేసి, దానిని మార్కెట్టులోకి దింపడానికి సన్నాహాలు చేస్తోంది మలోరీ. ఆమె ఆలోచన, పరిశోధన ఫలితాల గురించి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు లాలీపాప్స్‌ను తామే ఉత్పత్తి చేసి, ఎక్కిళ్లతో బాధపడేవారికి ఉచితంగా పంచిపెట్టేందుకు ముందుకొచ్చాయి. దాంతో ఒకప్పుడు మలోరీని ‘హికప్ బేబీ’ అని గేలిచేసి, దూరం పెట్టిన వారు ఇప్పుడు ఆమె తమ స్నేహితురాలని చెప్పుకుంటూ, ఆమెని అంటిపెట్టుకుని ఉంటున్నారు. అంతేకాదు, ఆమె తయారు చేసిన హికప్ పాప్స్‌ను మార్కెట్ చేసేందుకు ఎంబిఏ విద్యార్థులు కొందరు ఆమె చుట్టూ తిరుగుతున్నారు. మరి మలోరీనా మజాకా!