ఈ భేటీ జీ20 కుటుంబానికి మైలురాయి.. ఎందుకంటే.. | PM Announces Historic Milestone For G20 Family. See Why - Sakshi
Sakshi News home page

ఈ భేటీ జీ20 కుటుంబానికి మైలురాయి.. ఎందుకంటే..

Published Sat, Sep 9 2023 3:28 PM | Last Updated on Sat, Sep 9 2023 3:38 PM

PM Announces Historic Milestone For G20 Family See Why - Sakshi

ఢిల్లీ: ఆఫ్రికన్ యూనియన్‌ను శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవడం G20 కుటుంబానికి ఒక మైలురాయి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన రెండు రోజుల G20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభ సెషన్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్‌ను కూటమిలో కొత్త సభ్యుడిగా స్వాగతించారు. గ్లోబల్ సౌత్‌కు కొత్త ఆశలను కల్పిస్తున్న ఆఫ్రికన్ యూనియన్‌ చైర్‌పర్సన్ అజలీ అసోమానీకి స్వాగతం తెలిపారు. 

'G20లో పూర్తి సభ్యునిగా ఆఫ్రికన్ యూనియన్ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నాను. ఈ సభ్యత్వం కోసం కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాము. ఆఫ్రికా ఖండానికి ప్రపంచ సేవలు అందడమే కాకుండా సవాళ్లపై ఆఫ్రికా దేశాలు పోరాడేలా పరస్పర సహకారాలు అందుతాయి.' అని ట్విట్టర్ వేదికగా ఆఫ్రికన్ యూనియన్ కమీషన్ హెడ్ మౌసా ఫకీ మహమత్  అన్నారు. 

గత కొన్నాళ్లుగా గ్లోబల్ సౌత్‌ ప్రాతినిధ్యంపై భారత్‌ వాయిస్ వినిపిస్తోంది. జీ20 కేవలం 20 దేశాలకు సంబంధించిన విషయం కాదని, వెనకబడిన గ్లోబల్ సౌత్‌ కోసం పాటుపడేలా ఉండాలని ప్రధాని మోదీ గత డిసెంబర్‌లోనే అన్నారు. ప్రపంచ వేదికలపై విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశారు.

ఢిల్లీ వేదికగా నేడు జీ20 సమావేశం ప్రారంభమైంది. ప్రపంచ దేశాల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభ సెషన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆఫ్రికన్ యూనియన్ జీ20 కూటమిలో భాగస్వామిగా చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆఫ్రికా కూటమికి ఆహ్వానం పలికారు. 

ఇదీ చదవండి: కంటికి ఐ ప్యాచ్‌తో జీ20 సదస్సుకు జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్‌.. ఎందుకంటే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement