Why Apple launches new iPhone every year: ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్ ఒకటి. యాపిల్ (Apple) సంస్థ ప్రతి సంవత్సరం కొత్త సిరీస్ ఐఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఐఫోన్ కోసం యూజర్లు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఈ సంవత్సరం, ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌ను తీసుకొచ్చింది. గత సెప్టెంబర్‌లో జరిగిన యాపిల్ వండర్‌లస్ట్ ఈవెంట్ సందర్భంగా వీటిని లాంచ్ చేసింది. కొత్త ఐఫోన్ అమ్మకానికి రాగానే ఆన్‌లైన్‌తోపాటు యాపిల్ స్టోర్‌లకు కస్టమర్లు క్యూకట్టారు.
(iPhone 15 series: ఇంతవరకూ ఏ ఫోన్‌లోనూ లేని 9 ఫీచర్లు! అవి ఏంటంటే..)
యాపిల్ ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్‌ను ఎందుకు విడుదల చేస్తుంది.. ఎక్స్చేంజ్ కింద తీసుకున్న పాత ఐఫోన్లను ఏం చేస్తుంది.. అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఈ ప్రశ్నలకు యాపిల్ సీఈవో టిమ్‌కుక్ (Tim Cook) స్వయంగా సమాధానాలు చెప్పారు.
కొత్త ఐఫోన్ల లాంచ్ గురించి..
యాపిల్ సీఈఓ టిమ్ కుక్, బ్రూట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏటా యాపిల్ ఎందుకు కొత్త ఐఫోన్ సిరీస్‌ను తీసుకొస్తుందన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ కావాలని యూజర్లు కోరుకుంటారని, వారికిది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు.
పాత ఐఫోన్లను ఏం చేస్తామంటే..
అలాగే కొత్త ఐఫోన్ కోసం పాత ఐఫోన్‌లను ట్రేడ్ చేయడానికి అనుమతించే ఆపిల్ పాలసీ గురించి కూడా టిమ్‌కుక్ మాట్లాడారు. ఈ పాత ఫోన్‌లను ఏమి చేస్తారో వివరించారు. పనిచేస్తున్న పాత ఐఫోన్లను తిరిగి విక్రయిస్తామని, పని చేయనివాటిని విడదీసి కొత్త ఐఫోన్‌ను తయారు చేయడానికి వాని విడిభాగాలను ఉపయోగిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment