omelette
-
ఇచట డిజిటల్ ఆమ్లెట్ డిజిటల్ పరోటా వేయబడును
అమ్లెట్లు ఎచట వేసెదరు? ఆలూ పరాట ఎక్కడ తయారుచేసెదరు?’ అనే ప్రశ్నలకు ‘ఇవి కూడా ప్రశ్నలేనా. స్టవ్ మీద ఉన్న పెనంపై వేస్తారు. చేస్తారు’ అంటాం. అయితే ఒక టెక్ కంటెంట్ క్రియేటర్ మాత్రం మనం చెప్పే జవాబును మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. సదరు ఈ క్రియేటర్ కంప్యూటర్ ‘సిపియు’పై ఆమ్లెట్ వేశాడు. ఆ తరువాత మినీ పరోటా తయారుచేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ‘డిజిటల్ ఆమ్లెట్లు–పరోటాలు వచ్చేశాయి’ అని మురిసిపోతున్నారు ప్రేక్షకమహాశయులు. -
ఈ ఆమ్లెట్ తింటే లక్ష.. కండీషన్స్ అప్లై!
దేశరాజధాని ఢిల్లీలోని ఒక స్ట్రీట్ వెండర్ ఆమ్లెట్ ఛాలెంజ్ చేస్తూ, అందరినీ ఆకర్షిస్తున్నాడు. తన ఛాలెంజ్‌లో గెలిస్తే భారీగా నగదు గెలుచుకునే అవకాశం ఉంటుందని ప్రకటించాడు. తాను చేసిన అతిపెద్ద ఆమ్లెట్‌ను 30 నిముషాల్లో తింటే ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెబుతున్నాడు. రాజీవ్ భాయ్ అనే ఈ స్ట్రీట్ వెండర్ భారీ మోతాదులో వెన్న, 31కి పైగా గుడ్లు, కబాబ్, మిక్స్ వెజ్ మొదలైనవన్నీ కలిపి భారీ ఆమ్లెట్ తయారు చేస్తున్నాడు. ఫిట్నెస్ను అమితంగా ఇష్టపడే భరజాత్య ఈ భారీ ఆమ్లెట్కు చెందిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో వేడిపెనంపై వెన్నను కరిగిస్తూ, ఇతర దినుసులు జతచేస్తూ, ఆమ్లెట్ తయారు చేయడాన్ని చూడవచ్చు. ఆమ్లెట్ పూర్తికాగానే దానిపై కూరగాయల ముక్కలు, పన్నీర్ మొదలైనవాటితో టాపింగ్ చేయడాన్ని గమనించవచ్చు. ఈ ఆమ్లెట్ ధర 1,320. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు.. డబ్బుల కోసం ఆశపడి ఎవరైనా ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే అనారోగ్యం బారినపడతారని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చూడండి: కర్నాటకలో మహిష దసరా వివాదం ఏమిటి? 450g butter, 31 whole eggs, 50g cheese, 100g seekh kebab and 200g paneer. Approximately 3,575 mg of cholesterol in total. Nahi chahiye bhai tere 1 lakh. 👍🏻 pic.twitter.com/wfhayx7UGn — Chirag Barjatya (@chiragbarjatyaa) October 10, 2023 -
వెరైటీగా బనానా ఆమ్లెట్ ట్రై చేయండిలా!
ఎప్పుడు గుడ్డుతో వేసుకునే ఆమ్లెట్ కాకుండా కాస్త వెరైటీగా ఆలోచించండి. మసాలా వేసి చేసే ఎగ్ ఆమ్లెట్ గురించి తెలిసిందే. అలా కాకుండా అరటిపండుతో అదిరిపోయే రుచితో ఇలా ఆమ్లెట్ వేసుకుని చూడండి. పిల్లలు, పెద్దులు వదిలిపెట్టకుండా తినేస్తారు చూడండి. అయితే దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా!. బనానా ఆమ్లెట్కి కావలసినవి: అరటి పండు – ఒకటి గుడ్లు – రెండు ఉప్పు – రుచికి సరిపడా మిరియాల పొడి – టీస్పూను కారం – అరటీస్పూను నూనె – ఆమ్లెట్ వేయించడానికి సరిపడా. తయారీ విధానం: ∙అరటిపండును ముక్కలుగా తరగాలి. మిక్సీజార్‌లో అరటిపండు ముక్కలు, గుడ్ల సొన, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి నురగ వచ్చేంత వరకు గ్రైండ్ చే యాలి. ఇప్పుడు పెనం మీద నూనె వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోసుకోవాలి. సన్నని మంట మీద రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే బనానా ఆమ్లెట్ రెడీ. (చదవండి: వెన్న దొంగకు ఇష్టమైన.. గోపాల్‌కాలా ఎలా చేయాలంటే..) -
'గుడ్డు' లేకుండానే ఆమ్లెట్..ఆ సరికొత్త రెసిపీ వ్యాపారవేత్తగా..
ప్రస్తుతం ఈ ఉరుకులు పరుగులు జీవితంలో ఏదో పొట్టకింత తిన్నమా అన్నట్లు కానిస్తారు. ఏదో తూతూ మంత్రంగా తినడమే గానీ గంటలు గంటలు కూర్చొని చేసే వంటకాల జోలికే వెళ్లరు. ఇక బ్రేక్ ఫాస్ట్‌లు దగ్గరకు వస్తే..త్వరగా అయిపోయే వాటికే ప్రయారిటీ ఇస్తారు. అందులోనూ ముఖ్యంగా బ్రెడ్, ఆమ్లేట్ వంటివే ప్రివర్ చేస్తారు. చాలామంది ఉడకబెట్టి లేదా బ్రెడ్ ఆమ్లెట్ వంటి రెసీపీలు చేసుకుంటారు. మనం వెళ్లే కంగారు ఆ గుడ్డుని పగలుగొట్టడానికి నానాతంటాలు..ఇక గిలకొట్టడం మరో పని. దీంతో హడావిడిగా కిందమీద పడేసి చేసేస్తుంటాం. అలాంటి హైరానా ఏమి లేకుండా..అసలు 'గుడ్డే' లేకుండా క్షణాల్లో రెడీ చేసే ఆమ్లేట్ మన ముందుకు వస్తోంది. ఓ కేరళ వ్యక్తి దీన్ని సృష్టించాడు. ఇంతకీ ఎలా చేస్తారు? ఏవిధంగా వంటి కథాకమామీషులు ఒక్కసారి చూద్దామా!. వివరాల్లోకెళ్తే..కేరళలోని రామనట్టుకర నివాసి అర్జున్ 'గుడ్లు' లేకుండా ఫాస్ట్‌గా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించాడు. అందుకు సంబంధించిన ఇన్స్టెంట్ పౌడర్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చాడు కూడా. ఆ పౌడర్‌కి సంబంధించిన చిన్న ప్యాకెట్ ధర రూ. 5 నుంచి రూ. 100 వరకు వివిధ రేంజ్లో ధరలో పెద్ద ప్యాకెట్ల వరకు కూడా మార్కెట్లోకి తీసుకువచ్చాడు. ఈ పౌడర్ నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుందట. ఈ రెసీపీ తయారీ వెనుక ఉన్న రీజన్.. అర్జున్ తన కూతురు ధన్‌శివ కోసం "ముత్తయప్పం" (ఆమ్లెట్) త్వరగా ఎలా తయారు చేయడం ఎలా అని ఆలోచించాడు. అదే ఈ గుడ్డ లేకుండా త్వరగా చేసే ఆమ్లెట్ రెసీపీకి నాంది పలికింది. ఆ తరువాత అర్జున్ ఇలా మూడు సంవత్సరాలుగా రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. చివరికి అనుకున్నది సాధించడమే గాక తాను రూపొందించిన ఆ పౌడర్‌ను మార్కెట్లకి తీసుకువచ్చే ముందు మరిన్ని ప్రయోగాలు చేసి సత్ఫలితాలు ఇచ్చేంత వరకు కొంత డబ్బును ఖర్చు పెట్టాడు. అంతా ఓకే అనుకున్నాకే మార్కెట్లోకి తాను తయారు చేసిన ప్రొడక్ట్‌లను తీసుకొచ్చాడు. ఈ మేరకు అర్జున్ దాదాపు రూ. 2 కోట్లతో కొండోట్టి వజ్హయూర్‌లో 'ధన్స్ డ్యూరబుల్' అనే పేరుతో ఓ కంపెనీని కూడా పెట్టి..సేల్స్ ప్రారంభించాడు. అంతేకాదు కిడ్స్ ఆమ్మెట్, ఎగ్ బుర్జి, వైట్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్, స్వీట్ ఆమ్మెట్ బార్ స్నాక్ వంటి కొత్త ఫ్లేవర్స్‌లో మరిన్ని వెరైటీలను కస్టమర్లకు పరిచయం చేయనున్నాడు. ఈ మేరకు బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, యూకే, కువైట్ వంటి దేశాలకు కూడా తన ప్రొడక్ట్‌లను మార్కెట్ చేసుకుంటున్నాడు. అర్జున్ 2021లో తన వ్యాపారాన్ని ప్రారంభించారడు. ఈ పౌడర్‌ను మరింతగా ఉత్పత్తి చేసేందుకు యంత్రాలను ఏర్పాటు చేసుకోవడమే గాక సుమారు ఏడుగురు మహిళలతో సహ 12 మందికి ఎంప్లాయిమెంట్‌ని కల్పించాడు అంతేకాదు ఆఖరికి ఆన్లైన్లో కూడా కొనుగొళ్లు చేసేలా మార్కెట్‌ని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాడు కూడా. అతని గురించి ఔట్లుక్ అనే న్యూస్ ఛానెల్ 'ది ఆమ్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా' శీర్షికతో అర్జున్ గురించి కథనం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి అతను ఓ సెలబ్రెటీ మాదిరిగా అన్ని పత్రికలు అతని గురించి కథనాలు రావడం జరిగింది. పైగా తాను త్వరగా ఆమ్లెట్‌ని రెడీ చేసే విధానంలో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ని బద్దలు కొట్టే సన్నహాలు కూడా చేస్తున్నట్లు పేర్కొన్నాడు అర్జున్. (చదవండి: మగ గొరిల్లా కడుపున ఓ ఆడ గొరిల్లా పిల్ల..కంగుతిన్న జూ సిబ్బంది) -
బీరుతో ఆమ్లెట్ కిక్కే కిక్కు
-
చేదు లేకుండా కాకరకాయ ఆమ్లెట్ తయారీ ఇలా..
ఎంతమంచి వంటకం అయినా నోటికి రుచిగా లేకపోతే అస్సలు తినబుద్దికాదు. ఇక చేదుగా ఉండే కాకర కాయ డిష్ అంటే..‘‘అమ్మో కాకరకాయ’’ అంటూ ముఖం మాడ్చేస్తారు. అనేక పోషకాలున్న కాకరకాయను మళ్లీమళ్లీ తినాలనిపించేలా ఎలా వండాలో చెబుతోంది ఈ వారం మన వంటిల్లు... బిట్టర్ ఆమ్లెట్ తయారీకి కావాల్సినవి.. కాకకర కాయ – మీడియం సైజుది ఒకటి గుడ్లు – మూడు ఉప్పు – రెండు టీస్పూన్లు గరం మసాలా – అరటీస్పూను నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు తయారీ విధానమిలా.. కాకర కాయను శుభ్రంగా కడిగి, విత్తనాలు తీసేసి సన్నగా తరగాలి. మరుగుతోన్న నీళ్లలో కొద్దిగా నూనె, టీస్పూను సాల్ట్ , కాకరకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఉడికిన ముక్కలను నీటినుంచి వేరుచేసి, తడిలేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో గుడ్లసొనను వేసి చక్కగా కలపాలి. ఈ సొనలో రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, కాకరకాయ ముక్కలు వేసి కలపాలి. పెనం మీద నూనెవేసి, వేడెక్కిన తరువాత గుడ్ల మిశ్రమం వేసి రెండు వైపులా చక్కగా కాల్చితే బిట్టర్ ఆమ్లెట్ రెడీ. -
Mushroom Omelette: మష్రూమ్స్ ఆమ్లెట్.. వేయడం చాలా ఈజీ!
కావలసినవి: పుట్టగొడుగులు – 5 (నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. అయితే ముక్కల్ని పలుచగా తరగాలి) గుడ్లు – 3, చిక్కటి పాలు – 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – కొద్దిగా, బటర్ – 1 టీ స్పూన్ చీజ్ తురుము – 1 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు – తగినంత, నూనె – సరిపడా కొత్తిమీర తురుము – గార్నిష్‌కి కొద్దిగా తయారీ: ముందుగా ఒక బౌల్లో గుడ్లు, ఉప్పు, పాలు, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం పెనంలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని.. వేడి కాగానే పుట్టగొడుగు ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. ముక్క బాగా మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుని.. అదే పెనంలో కొద్దిగా నూనె, బటర్ వేసుకుని, బటర్ కరిగిన తర్వాత.. ఎగ్స్ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసుకోవాలి. పైన చీజ్ తురుము వేసుకుని.. చిన్న మంట మీద ఉడకనివ్వాలి. అనంతరం పుట్టగొడుగుల మిశ్రమాన్ని ఆమ్లెట్కి మధ్యలో నిలువుగా పరచి.. ఆమ్లెట్‌ని ఇటువైపు నుంచి అటు వైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. పైన కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరి! క్లిక్ చేయండి: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా -
Jangaon: గొంతులో ఆమ్లెట్ ఇరుక్కొని వ్యక్తి మృతి
మద్యం తాగేందుకని ఓ వ్యక్తి వైన్ షాపుకెళ్లాడు. తనకు నచ్చిన బ్రాండు తీసుకుని పక్కనే ఉన్న పర్మిట్ రూమ్(మద్యం తాగేందుకు అనుమతి గది)లోకి వెళ్లాడు. ఖాళీగా ఉన్న ఓ టేబుల్ చూసుకుని కూర్చున్నాడు. బాటిల్ ఓపెన్ చేసి.. ఓ పెగ్గు కలిపాడు. అప్పుడు గుర్తొచ్చింది మనోడికి మంచింగ్ సంగతి. మందు ఓకే.. మరి మంచింగ్ ఏం తీసుకుందాం అని కాసేపు ఆలోచిస్తే.. మరీ కాస్ట్లీవి మనకెందుకనిఓ ఆమ్లెట్‌తో సరిపెట్టేద్దాంలే అనుకుని ఆర్డర్ ఇచ్చాడు. వేడివేడిగా ఆమ్లెట్ టేబుల్‌పైకి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం అనుకుని ఓ పెగ్గేశాడు. వేడివేడి ఆమ్లెట్‌ను తీసుకుని అలా నోట్లో పెట్టుకున్నాడు. అంతే.. అదే ఆమ్లెట్ యమపాశమై మనోడి ప్రాణాలను తీసేసింది. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్‌రెడ్డి (38) స్థానిక మద్యం దుకాణంలోని అనుమతి గదిలో కూర్చొని మద్యం తాగుతున్నాడు. తాను తింటున్న ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రాణం తీసిన ఆమ్లెట్.. మందు తాగుతుండగా గొంతులో ఇరుక్కొని.. -
Recipe: అటుకులు, జొన్నపిండి.. నోరూరించే పోహా రోటీ- ఆమ్లెట్ రోల్స్ తయారీ ఇలా
రోటీ, ఆమ్లెట్ తిని బోర్ కొట్టిందా! ఇలా వెరైటీగా అటుకులు, జొన్నపిండితో రొట్టె చేసుకుని.. ఆమ్లెట్ రోల్స్ చేసుకుని తింటే టేస్ట్ అదిరిపోద్ది. పోహా రోటీ – ఆమ్లెట్ రోల్స్ కావలసినవి: ►గుడ్లు – 3 (ఒక బౌల్లో గుడ్లు పగలగొట్టుకుని, అందులో ఉప్పు,కారం, పసుపు, పాలతోపాటు ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కూరగాయల తరుగు వంటివి అభిరుచిని బట్టి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి) ►అటుకులు – 2 కప్పులు ►జొన్నపిండి – పావు కప్పు ►నెయ్యి – టేబుల్ స్పూన్ ►గోరు వెచ్చని నీళ్లు – సరిపడా ►ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ►ముందుగా అటుకులు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ►జొన్నపిండి, ఉప్పు, నెయ్యి వేసుకుని, గోరువెచ్చని నీళ్లను కొద్దికొద్దిగా కలుపుకుంటూ.. ముద్దలా చేసుకోవాలి. ►15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని, తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ►ఆ ఉండలను చపాతీల్లా ఒత్తుకోవాలి. ►పాన్‌పై సరిపడా నూనె వేసుకుని ఇరువైపులా దోరగా వేయించుకోవాలి. ►ఒకవైపు ఆమ్లెట్ వేసుకుని.. సర్వ్చేసుకునే ముందు.. నచ్చిన మసాలా కర్రీతో రోల్స్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Korrala Idli- Millet Halwa: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా తయారీ ఇలా.. బాస్మతి బియ్యంతో ఘీ రైస్.. కార్న్‌ఫ్లోర్‌తో పనీర్ జిలేబీ! తయారీ ఇలా -
Recipe: నోరూరించే ఫిష్ ఆమ్లెట్స్ రోల్స్ తయారీ ఇలా!
టేస్టీ టేస్టీ ఫిష్ ఆమ్లెట్స్ రోల్స్ ఇంట్లో ఇలా తయారు చేసుకోండి! ఫిష్ ఆమ్లెట్స్ రోల్స్ తయారీకి కావలసినవి: ►చేప ముక్కలు – 2 ►గుడ్లు – 3, కారం, పసుపు, ఉప్పు– తగినంత ►అల్లం–వెల్లుల్లి పేస్ట్ – అర టేబుల్ స్పూన్ ►పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – కొద్దికొద్దిగా ►గరం మసాలా – 1 టేబుల్ స్పూన్ ►కొత్తిమీర తురుము – కొద్దిగా ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా ఫిష్ ఆమ్లెట్స్ రోల్స్ తయారీ: ►ముందుగా చేప ముక్కలపై కారం, పసుపు, ఉప్పు కొద్దికొద్దిగా వేసుకోవాలి. ►అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకుని ముక్కలకు బాగా పట్టించాలి. ►15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం కళాయిలో నూనె వేడి చేసుకుని, దోరగా వేయించుకోవాలి. ►చల్లారిన తర్వాత ముళ్లు తొలగించి.. పొడిపొడిగా చిదుముకుని.. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ►పెనం మీద నూనె వేసుకుని.. వేడి కాగానే.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దోరగా వేయించి.. చేప మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. ►కొత్తిమీర తురుము కూడా వేసుకుని ఆ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకోవాలి. ►అనంతరం పాన్ మీద కొద్దిగా నూనె వేసుకుని, ప్లెయిన్ ఆమ్లెట్స్ వేసుకుని.. వాటిలో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని ఉంచి రోల్స్‌లా చుట్టాలి. ►ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Beetroot Bajji Recipe: బీట్రూట్ బజ్జీలు ఇలా! Corn Palak Pakoda Recipe: స్వీట్ కార్న్, పాలకూర.. కార్న్ పాలక్ పకోడి ఇలా తయారు చేసుకోండి! -
Recipe: చికెన్ ఆమ్లెట్ ఇలా ఈజీగా తయారు చేసుకోండి!
చికెన్‌తో రొటీన్ వంటకాలు కాకుండా ఇలా ఓసారి ఆమ్లెట్ ట్రై చేయండి. చికెన్ ఆమ్లెట్ తయారీకి కావలసినవి: ►గుడ్లు – నాలుగు ►ఉప్పు – రుచికి సరిపడా ►మిరియాలపొడి – రుచికి సరిపడా ►నూనె – టీస్పూను ►ఉడికించి సన్నగా తురిమిన చికెన్ – ముప్పావు కప్పు ►ఛీజ్ తురుము – రెండు టేబుల్ స్పూన్లు ►పాలకూర తురుము – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: ►గుడ్ల సొనను గిన్నెలో వేసి చక్కగా బీట్ చేయాలి. ►బీట్ చేసిన గుడ్ల సొనలో రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి వేసి మరోసారి బీట్ చేయాలి. ►ఇప్పుడు పాన్‌పై నూనెవేసి వేడెక్కనివ్వాలి. ►వేడెక్కిన నూనెపై బీట్చేసిపెట్టుకున్న గుడ్ల సొన మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోసుకోవాలి. ►ఆమ్లెట్ మధ్యలో నుంచి అంచుల వరకు చక్కగా కాలేలా సొనను పరుచుకుంటూ సన్నని మంట మీద కాల్చాలి. ►ఇప్పుడు చికెన్ తరుగుని అవెన్‌లో కాస్త వేడి చేసి ఆమ్లెట్పైన వేయాలి. ►చికెన్‌తోపాటు చీజ్ తరుగు, పాలకూర తరుగు వేసి నిమిషం పాటు వేయించాలి. ►ఇప్పుడు ఆమ్లెట్‌ను సగభాగం మడిచి చీజ్ కరిగేంత వరకు రెండు వైపులా చక్కగా కాల్చాలి. ►చక్కగా కాలిన ఆమ్లెట్‌ను ఫ్రైడ్ బ్రెడ్, స్పినాచ్ సలాడ్‌తో సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Masala French Toast Recipe: ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్.. మసాలా ఫ్రెంచ్ టోస్ట్! Chilakada Dumpa Poorilu: నోరూరించే చిలగడదుంపల పూరీ తయారీ ఇలా! -
రొయ్యల ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
కావలసినవి: రొయ్యలు – 15 నుంచి 20 (లైట్‌గా ఉప్పు, కారం, చిటికెడు పసుపు దట్టించి కుకర్‌లో ఉడికించుకోవాలి), గ్రీన్ పీస్ లేదా గ్రీన్ సోయాబీన్స్ – 100 గ్రాములు (నానబెట్టి, ఉడికించినవి), గుడ్లు – 3 (పెద్ద సైజ్), కారం, మిరియాల పొడి – కొద్దికొద్దిగా, సోయాసాస్ – 1 టీ స్పూన్, నువ్వుల నూనె – సరిపడా, కొత్తిమీర తురుము, పుదీనా తురుము – గార్నిష్‌కి (అభిరుచిని బట్టి మరిన్ని), ఉల్లికాడలు – 2 (చిన్నగా కట్ చేసుకోవాలి), ఉప్పు – తగినంత తయారీ: ముందుగా ఒక చిన్న బౌల్లో గుడ్లు, చిటికెడు ఉప్పు, కారం, మిరియాల పొడి, అర టీ స్పూన్ సోయాసాస్ వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని మీడియం మంటపైన, ఒక బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేడి చేసుకుని, ఉల్లికాడ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో ఉడికించి పక్కనపెట్టుకున్న సోయాబీన్స్ లేదా బఠాణీలు వేసుకుని గరిటెతో తిప్పాలి. వెంటనే రొయ్యలు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని, పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో అర టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, ఆమ్లెట్ వేసుకుని.. దానిపైన రొయ్యల–బఠాణీ మిశ్రమాన్ని పరచుకోవాలి. ఆమ్లెట్‌ని జాగ్రత్తగా ప్లేట్లోకి తీసుకుని.. గార్నిష్ కోసం కొద్దిగా నూనె, మిగిలిన సోయాసాస్ వేసుకుని కొత్తిమీర, పుదీనా తురుముని ఓ వేపు వేయించి తీసుకుంటే సరిపోతుంది. కొర్ర లు–కీమా గారెలు కావలసినవి: మటన్ కీమా – అర కప్పు (శుభ్రం చేసుకుని, ఉప్పు, కారం, మసాలా వేసుకుని ఉడికించుకోవాలి), కొర్రలు – 1 కప్పు (6 గంటలు నానబెట్టుకోవాలి), పెరుగు – 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి – 2 (ముక్కలుగా కట్ చేసుకోవాలి), అల్లం – చిన్న ముక్క, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా నానబెట్టిన కొర్రలను మిక్సీలో వేసుకుని, అందులో పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు, అల్లం ముక్క, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో మటన్ కీమా వేసుకుని బాగా కలుపుకోవాలి. నూనె కాగిన తర్వాత గారెలుగా వేసుకుని, వాటిని మజ్జిగ ఆవడ వేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి ఈ గారెలు. ఆపిల్–ఎగ్ కేక్ కావలసినవి: ఆపిల్ – 4 (మీడియం సైజ్‌వి తీసుకుని, తొక్క, గింజలు తొలగించి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), పంచదార – పావు కప్పు, నిమ్మతొక్కల తురుము – కొద్దిగా, నిమ్మరసం – 1 టీ స్పూన్, గుడ్లు – 2, వెజిటబుల్ ఆయిల్ – 100 గ్రాములు, మైదా పిండి – పావు కప్పు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్ తయారీ: ముందుగా మిక్సీలో ఆపిల్ ముక్కలు, పంచదార, నిమ్మతొక్కల తురుము, నిమ్మరసం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గుడ్లు, వెజిటబుల్ ఆయిల్ వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని.. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని కేక్ మేకర్లో వేసుకుని.. ఓవెన్లో బేక్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు నచ్చిన విధంగా క్రీమ్స్, బిస్కెట్స్, ఆపిల్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. -
'నేను నీలాగా కావాలంటే ఎన్ని ఆమ్లెట్స్ తినాలి'
రాయ్‌పూర్: టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. సచిన్ ఈ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సచిన్ సారధ్యంలో రెండు మ్యాచ్‌లాడిన ఇండియా లెజెండ్స్ ఒక దాంట్లో ఓడి మరొక దాంట్లో గెలిచింది. తాజాగా ఇంగ్లండ్ లెజెండ్స్ ఆటగాడు క్రిస్ ట్రెమ్లెట్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి దిగిన ఫోటోను తన ట్విటర్లో షేర్ చేశాడు. ''ప్రస్తుతం నేను ఫిట్‌గా ఉన్నా.. సచిన్ వయసు వచ్చేసరికి అదే ఫిట్నెస్తో ఉంటే ఇంకా సంతోషంగా ఉంటా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ట్రెమ్లెట్ ఫోటోను రీట్వీట్ చేస్తూ సచిన్ వినూత్నరీతిలో కామెంట్ చేశాడు. సచిన్ ట్రెమ్లెట్ ఫిజిక్‌ను పొగుడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ట్రెమ్లెట్.. నేను నీలాగా ఉండాలంటే రోజుకు ఎన్ని ఆమ్లెట్స్ తినాలి? అంటూ'' ఎమోజీ పెట్టాడు. సచిన్ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. కాగా ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ ట్రెమ్లెట్ ఆరు అడుగుల ఏడు అంగుళాల పొడగరి కాగా.. అతను తన ఫిజిక్‌ను కాపాడుకోవడంలో ఎప్పుడు ముందుంటాడు. స్వతహగా మంచి బిల్డర్ అయిన ట్రెమ్లెట్ రోజుకు 8వేల కేలరీల ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. చూడగానే భారీ కాయంగా కనబడే ట్రెమ్లెట్ ఇంగ్లండ్ తరపున 12 టెస్టుల్లో 50 వికెట్లు , 15 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. చదవండి: వైరలవుతోన్న సచిన్ ప్రాంక్ వీడియో మా పాజీ తర్వాత మ్యాచ్ ఆడుతాడా! How many OMELETTES would I need to eat to look like TREMLETT? 😋 🍳 मुझे TREMLETT जैसे बनने के लिए कितने OMELETTE 🍳 खाने पड़ेंगे?? 😜 https://t.co/jGa4mCgA8L — Sachin Tendulkar (@sachin_rt) March 10, 2021 -
కోడి గుడ్డు లేని ఆమ్లెట్ తిన్నారా..?
అవును మీరు చదివింది కరెక్టే.. ఎగ్‌లెస్ కేక్ తిన్నాం కానీ.. ఎగ్ లేకుండా ఆమ్లెట్ ఏంటీ అనుకుంటున్నారా... మొక్కల ప్రొటీన్లతో తయారు చేసే ఆమ్లెటే ఎగ్‌లెస్ ఆమ్లెట్. దీనినే వీగన్ ఆమ్లెట్ అని కూడా అంటారు. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న డైట్ ‘వీగన్ డైట్’. ఈ ఆహారపు ముఖ్య లక్ష్యం.. మనిషి తిండికోసం ఏ జీవినీ బాధించకపోవడమే.. అందుకే వీగన్ డైట్ ఫాలోవర్స్ అంతా మాంసం, గుడ్డు, చేపలు, పాలు, పెరుగు, వెన్న, జున్ను, తేనె వంటివేవీ ఆహారంగా తీసుకోరు. అయితే ఈ డైట్ ఫాలో అయ్యే వాళ్ల కోసం ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ‘ఇవో ఫుడ్స్’ అనే ఓ స్టార్టప్ రెస్టారెంట్ మొక్కల ప్రొటీన్ల నుంచి వీగన్ ఎగ్స్‌ను తయారు చేసి వాటితో ఆమ్లెట్స్, ఎగ్‌రోల్స్, వివిధ రకాల ఎగ్‌వెరైటీ డిష్‌లను అందిస్తోంది. అయితే ఎగ్స్ వాడకుండా చేసే ఆమ్లెట్ టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా..? వీగన్ ఎగ్స్‌తో చేసినప్పటికీ దీని రుచి నిజమైన గుడ్లతో తయారు చేసిన ఆమ్లెట్లానే ఉంటుందని రుచి చూసిన వారంతా చెబుతున్నారు. లిక్విడ్ ఎగ్.. ఫ్యాబేసీ కుటుంబానికి చెందిన లెగ్యుమ్ మొక్కల నుంచి ప్రొటీన్లను సేకరించి వాటికి విటమిన్ డి3, బి12లు కలిపి లిక్విడ్ రూపంలో ఎగ్‌ను తయారు చేస్తారు. ఆ తరువాత సాధారణ ఎగ్‌తో చేసే అన్ని రకాల డిష్‌లను దీనితో తయారు చేస్తున్నట్లు్ల రెస్టారెంట్ యాజమాన్యం వెల్లడించింది. రుచి కూడా చాలా బాగుంటుందని, జంతు ప్రేమికులకు, వీగన్ డైట్ ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని యాజమాన్యం చెబుతోంది. మీరు వీగన్ డైట్‌ను ఫాలో అవుతున్నారా.. అయితే ఒకసారి ఎగ్‌లెస్ ఆమ్లెట్ రుచి చూసేయండి. -
వైరల్ వీడియో.. 60 గుడ్లతో ఆమ్లెట్
రోజులు గడుస్తున్న కొద్ది భోజనం విషయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త రుచులు జ్విహను లబలబలాడిస్తున్నాయి. తినడంతో పాటు వడ్డించే విధానం కూడా చాలా ఆకర్షణీయంగా మారింది. కేకులు, దోశలు, లడ్డులు వంటి వాటిని భారీ సైజుల్లో తయారు చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి ఆమ్లెట్ చేరింది. 60 గుడ్లతో భారీ ఆమ్లెట్‌ను తయారు చేసి.. ముక్కలుగా కత్తిరించి అందంగా ప్యాక్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో ఓ కొరియన్ స్ట్రీట్ ఫుడ్ వెండర్ ఓ భారీ ఆమ్లెట్‌ని తయారు చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తన దుకాణంలో అమ్మకానికి ఉంచాడు. అతడు ఆమ్లెట్ తయారు చేసే విధానం నెటిజనులను తెగ ఆకట్టుకుంటుంది. (చదవండి: ఇంట్లో ప్రయత్నించకండి.. కాలిపోద్ది!) ఇక వీడియోలో చెఫ్ ఓ పెద్ద గిన్నె తీసుకుని.. 60 గుడ్లను పగులకొట్లి దానిలో వేస్తాడు. వాటిని బాగా చిలకొట్టి.. ఉల్లిపాయ, ఉల్లికాడల తరుగు, క్యారెట్, మాంసం ముక్కలు కలుపుతాడు. ఆ తర్వాత సరిపడా ఉప్పు, మసలాలు వేసి మరోసారి బాగా గిలక్కొట్టి... ప్యాన్‌పై నూనె వేసి మిశ్రమం మొత్తాన్ని దాని మీద వేస్తాడు. తరువాత దాన్ని చుట్టి పెద్ద ఇటుకలాగా తయారు చేస్తాడు. పూర్తిగా కాలాక దాన్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్యాక్ చేస్తాడు. దాన్ని కంటైనర్‌లో ఉంచి అమ్మకానికి పెడతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అర్జెంట్‌గా ఆమ్లెట్ తినాలినిపిస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
నోరూరించే ఆమ్లెట్ వేసిక రష్మిక
కరోనా సెలబ్రిటీల జీవితాల్లో కొన్ని వైవిధ్యమైన మార్పులు తీసుకువచ్చింది. షూటింగ్‌లతో క్షణం కూడా తీరిక ఉండని వారికి బోలెడంత ఖాళీ సమయాన్ని ఇచ్చింది. దీంతో కొందరు ఇంటి పనులు నేర్చుకోగా మరికొందరు ఎవరి పనులు వారే చేసుకుంటున్నారు. ఇక ఈ అవకాశం మళ్లీ దొరకదంటూ చాలామంది వంటింట్లో దూరి గరిటె తిప్పారు. ఆ లిస్టులో చిరంజీవి కూడా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మలయాళ బ్యూటీ రష్మిక మందన్నా తనకిష్టమైన వంటకాన్ని వండుతూ మరీ అభిమానులకు తెలియజేశారు. అంతేకాదు, ప్రతిరోజు తన డైట్లో ఆమ్లెట్ ఉండాల్సిందేనని, అది లేకపోతే ముద్ద దిగదంటున్నారు. (చదవండి: ‘రాధే శ్యామ్’ లో ప్రేరణగా పూజా.. ఫస్ట్‌లుక్ అదుర్స్) స్టౌ వెలిగించడం దగ్గర నుంచి ఆమ్లెట్ వేయడం వరకు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. చూస్తుంటేనే నోరూరించే విధంగా ఆమ్లెట్‌ను రెడీ చేశారు. "నాకు ప్రతిరోజు ఆమ్లెట్ ఉండాల్సిందే. మీరు కూడా దీన్ని ఓసారి ప్రయత్నించండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి" అని రాసుకొచ్చారు. కాగా "ఛలో" సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన రష్మిక తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటించే ఛాన్సులు కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఆమె 'పుష్ప' సినిమాలో హీరో అల్లు అర్జున్‌కు జోడీగా నటిస్తున్నారు. (చదవండి: అలలు.. ఇసుక... భలే మంచి అనుభూతి) View this post on Instagram Try it.. and let me know how you like it. 💛 A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on Oct 13, 2020 at 5:54am PDT -
ఐస్ ఆమ్లెట్
ఐస్ ఆమ్లెట్... ఎప్పుడైనా తిన్నారా? కనీసం పేరైనా విన్నారా? బహుశా వినకపోవచ్చు. ఎందుకంటే.. గతంలో ఎవరూ ఇలాంటి ఆమ్లెట్ వేయలేదు. కానీ అమెరికాలో కురుస్తున్న హిమపాతానికి అక్కడి నదులు, సరస్సులు గడ్డకట్టిపోవడం, రహదారులు, ఇళ్లు మంచుమయం కావడంతో యువత కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. వేడివేడి పెనంపై ఆమ్లెట్ వేస్తే మజా ఏముంది? గడ్డకట్టిన మంచుపై వేసి చూద్దామనుకున్నారు. తీరా వేస్తే.. వెడల్పు చేసే అవకాశం ఇవ్వకుండా వెంటనే గడ్డకట్టి పోతోందట. ఇలా మంచుతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు భలే ఫన్నీగా ఉంటున్నాయి. ఇక్కడ చూడండి.. ఏ ఆధారం లేకుండానే ఈ ప్యాంట్లు ఎలా నిలుచున్నాయో.. అంతా మంచు మహత్యం! -
గుడ్డు అదే ఆమ్లెట్ ఇది
గుడ్డు చూసినప్పటి నుంచి ఆమ్లెట్‌ను చూస్తూనే ఉన్నాం. కోడి ముందా? గుడ్డు ముందా? అంటే ఆమ్లెట్టే ముందు అని చెప్పాం. అంత సుపరిచితమైన ఆమ్లెట్లలో సూపర్ రుచివంతమైన ఆమ్లెట్లు ఇవి. మష్రూమ్ ఆమ్లెట్ కావలసినవి: అన్సాల్టెడ్ బటర్ – 2 టీ స్పూన్లు, బటన్ మష్రూమ్స్ (చిన్న పుట్ట గొడుగులు) – అర కప్పు (నీళ్లలో శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి), కోడి గుడ్లు – 2 (లేదా నాలుగు తెల్ల సొనలు), నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి / కారం– కొద్దిగా, చీజ్ తురుము – టేబుల్ స్పూను తయారి: ∙పెనం స్టౌ మీద పెట్టి, టీ స్పూను అన్సాల్టెడ్ బటర్ వేసి కరిగించాలి ∙సన్నగా తరిగిన మష్రూమ్స్‌ని వేసి వేయించాలి ∙ఉప్పు, మిరియాల పొడి/కారం జత చేసి దోరగా వేయించి, ఒక ప్లేట్లోకి తీసుకుని మూత పెట్టి, పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో కోడి గుడ్లు, నీళ్లు వేసి బాగా గిలకొట్టాక, ఉప్పు, మిరియాల పొడి జత చేసి బాగా కలపాలి ∙పెనం మీద బటర్ వేసి పెనమంతా పరుచుకునేలా చేయాలి ∙బాగా కాగాక... గిలకొట్టిన కోడిగుడ్డు మిశ్రమం వేసి పెనం మీద సమానంగా పరవాలి ∙బాగా ఉడికిన తరవాత, వేయించి ఉంచుకున్న మష్రూమ్ ముక్కల మిశ్రమాన్ని ఆమ్లెట్ మీద సమానంగా వేయాలి ∙మధ్యకు మడతపెట్టి ప్లేట్లోకి తీసుకోవాలి ∙సన్నగా తురిమిన చీజ్‌ను పైన చల్లి అందించాలి. పీనట్ చికెన్ ఆమ్లెట్ రోల్స్ కావలసినవి: కోడి గుడ్డు – 1, నీళ్లు – టేబుల్ స్పూను, ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు, స్వీట్ చిల్లీ సాస్ – టేబుల్ స్పూను, జ్యూస్ అండ్ ఫిష్ సాస్ – టీ స్పూను, చికెన్ ముక్కలు – అర కప్పు, ఉడికించిన బఠాణీ + క్యారట్ ముక్కలు – కప్పు, కీరా తురుము – పావు కప్పు, మిరియాల పొడి – టీ స్పూను, పుదీనా ఆకులు – గుప్పెడు, ఉల్లి కాడల తరుగు – పావు కప్పు, ఉప్పు – తగినంత, పీనట్స్ సాస్ – రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కాడలు – తగినన్ని తయారి: ∙ఒక పాత్రలో కోడిగుడ్డు, టేబుల్ స్పూను నీళ్లు, ఉప్పు చేసి బాగా గిలకొట్టాలి ∙సన్నటి మంట మీద పాన్ వేడయ్యాక ఆలివ్ ఆయిల్ వేసి కాగాక, గిలకొట్టిన కోడిగుడ్డు మిశ్రమం వేసి, ఆమ్లెట్ కొద్దిగా మందంగా వచ్చేలా జాగ్రత్తపడాలి ∙బాగా కాలిన తరవాత ఆమ్లెట్‌ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙ఒక పాత్రలో స్వీట్ చిల్లీ సాస్, జ్యూస్ అండ్ ఫిష్ సాస్ వేసి కలపాలి ∙బాణలిలో నూనె కాగాక చికెన్, మిరియాల పొడి, ఉప్పు వేసి వేయించాక, తయారుచేసి ఉంచుకున్న స్వీట్ చిల్లీ సాస్ మిశ్రమం జత చేయాలి ∙ఆమ్లెట్ మీద ఉడికించిన కూరల తరుగు, చికెన్ మిశ్రమం సమానంగా పరిచి, పుదీనా ఆకులు ఉంచి, రోల్ చేయాలి కొత్తిమీర కాడలతో ముడి వేసి, పీనట్స్ సాస్‌తో అందించాలి. స్వీట్ ఫ్రూట్ ఆమ్లెట్ కావలసినవి: కోడి గుడ్లు – 2 (తెల్ల సొన మాత్రమే), పంచదార పొడి – టేబుల్ స్పూను, నీళ్లు – టేబుల్ స్పూను, అన్సాల్టెడ్ బటర్ – టేబుల్ స్పూను, అరటి పండు ముక్కలు – అర కప్పు, ఆపిల్ ముక్కలు – పావు కప్పు, స్ట్రా బెర్రీలు – 4 (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి), తేనె – కొద్దిగా తయారి: ∙ఒక పాత్రలో తెల్ల సొనలు, పంచదార పొడి, నీళ్లు వేసి బాగా గిలకొట్టి పక్కన ఉంచాలి ∙మరో పాత్రలో పండ్ల ముక్కలు, తేనె వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద పెనం పెట్టి, వేడయ్యాక బటర్ వేసి పెనం మీద అంతా పరచాలి ∙గిలకొట్టిన కోడి గుడ్డు మిశ్రమం వేసి బాగా కాలనివ్వాలి ∙రెండవ వైపు కూడా కాలాక, ఆమ్లెట్‌ను ప్లేట్లోకి తీసి, పండ్ల ముక్కల మిశ్రమం వేసి, ఆమ్లెట్‌ను మధ్యకు మడిచి, వెంటనే అందించాలి. ప్రాన్స్ ఆమ్లెట్ కావలసినవి: ఉల్లి తరుగు – పావు కప్పు, వెల్లుల్లి రేకలు – 1 (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి), క్యాప్సికమ్ తరుగు – టేబుల్ స్పూను, రొయ్యలు – 12 (శు్ర¿¶ ం చేయాలి), కోడి గుడ్లు – 5, నీళ్లు – టేబుల్ స్పూను, పాలు – కప్పు, కరివేపాకు పొడి – టీ స్పూను, ఉప్పు – తగినంత, మిరప పొడి – టీ స్పూను, మిరియాల పొడి – తగినంత, ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూను, చీజ్ తురుము – 3 టేబుల్ స్పూన్లు, టొమాటో తరుగు – అర కప్పు తయారి: ∙బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక, ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి దోరగా వేగాక, రొయ్యలు, తగినంత ఉప్పు, మిరప పొడి జత చేసి మరోమారు వేయించాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి దగ్గర పడే వరకు ఉడికించి, తీసేయాలి ∙ఒక పాత్రలో కోడి గుడ్లు వేసి గిలకొట్టాక, పాలు, కరివేపాకు పొడి, ఉప్పు, మిరియాల పొడి జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక ఆలివ్ ఆయిల్ వేసి కాగాక, కలిపి ఉంచుకున్న కోడి గుడ్ల మిశ్రమం వేయాలి ∙బాగా కాలిన తరవాత చీజ్ తురుము, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ తరుగు, తయారుచేసి ఉంచుకున్న రొయ్యల మిశ్రమం వేసి ఆమ్లెట్‌ను మధ్యకు మడిచి అందించాలి. స్టఫ్డ్ ఆమ్లెట్ కావలసినవి: ఆలివ్ ఆయిల్ – టీ స్పూను, రెడ్ క్యాప్సికమ్ తరుగు – 2 టేబుల్ స్పూన్లు (సన్నగా పొడవుగా తరగాలి), ఉల్లి తరుగు – టేబుల్ స్పూను, చిన్న మెంతి కూర ఆకులు – కప్పు, జీడిపప్పు ముక్కలు – టేబుల్ స్పూను, కోడి గుడ్లు – 2, నీళ్లు – టేబుల్ స్పూను, ఉప్పు – తగినంత, మిరియాల పొడి / కారం – తగినంత, చీజ్ – టేబుల్ స్పూను. తయారి: ∙స్టౌ మీద పెనం ఉంచి ఆలివ్ ఆయిల్ వేసి, సన్న మంట మీద కాగనివ్వాలి ∙రెడ్ క్యాప్సికమ్ తరుగు, ఉల్లి తరుగు, జీడి పప్పు ముక్కలు వేసి ఆపకుండా కలుపుతూ, దోరగా వేయించాలి ∙రెండు నిమిషాల తరవాత మెంతి కూర జత చేసి, పచ్చి వాసన పోయేవరకు వేయించి తీసేయాలి ∙ఒక పాత్రలో కోడి గుడ్లు, టేబుల్ స్పూను నీళ్లు వేసి బాగా గిలకొట్టాలి ∙ఉప్పు, మిరియాల పొడి / కారం పొడి జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙స్టౌ మీద పెనం వేడి చేసి, చీజ్ వేసి, కరిగించాలి ∙గిలకొట్టిన కోడిగుడ్డు మి్రÔ¶ మాన్ని వేసి, సమానంగా పరవాలి ∙బాగా కాలిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న స్టఫ్‌ను వేసి, ఆమ్లెట్ మీద సగ భాగం వరకు సర్ది మధ్యకు మడత వేయాలి ∙పైన చీజ్ తురుము వేసి, వెంటనే అందించాలి. -
పొట్ట అడుగు
పొట్ట అడుగుతుందా! బిర్యానీ చేసిపెట్టమని.. ఆమ్లెట్ వేసిపెట్టమని.. మంచూరియా కావాలని.. చిల్లీ కర్రీని టేస్ట్ చేస్తానని!! అడగదు పాపం. ఆకలో రామచంద్రా అంటుంది కానీ.. అది కావాలి రామచంద్రా.. ఇది కావాలి రామచంద్రా.. అని రాగాలు తీయదు. కానీ పుట్టగొడుగులు వేరు. వాటితో ఒక్కసారి ఏదైనా చేసి పెట్టామా? పొట్ట మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంటుంది. అవురావురుమంటూనే ఉంటుంది. మష్రూమ్ మంచూరియా కావలసినవి: మష్రూమ్స్ – 250 గ్రా; ఉడికించిన బంగాళాదుంపలు – 2 పెద్దవి; ఉప్పు – తగినంత; కారం – టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్స్; మైదా – 2 టేబుల్ స్పూన్స్; కార్న్‌ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్; నూనె – టీప్ ఫ్రైకి సరిపడ. గ్రేవీ కోసం: ఉల్లి తరుగు – 4 టేబుల్ స్పూన్స్; తెల్ల ఉల్లికాడల తరుగు – 2 టీ స్పూన్స్; గ్రీన్ ఉల్లికాడల తరుగు – 4 టీ స్పూన్స్; పచ్చిమిర్చి తరుగు – 3 టీ స్పూన్స్; వెల్లుల్లి తరుగు – 6 టీ స్పూన్స్; అల్లం తరుగు – 6 టీ స్పూన్స్; ఉప్పు – తగినంత; సోయా సాస్ – 6 టీ స్పూన్స్; చిల్లీసాస్ – 2 టీ స్పూన్స్; వెనిగర్ – 6 టీ స్పూన్స్; పంచదార – టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 3 టీ స్పూన్స్; నూనె – 2 టేబుల్ స్పూన్స్. తయారి: ∙మష్రూమ్స్‌ను కడిగి కాడలను తుంచి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో తరిగిన మష్రూమ్, ఉడికించిన బంగాళా దుంపలను కలపాలి ∙ఉప్పు, కారం, కొత్తిమీర తరుగు టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి ముద్దగా చేసుకోవాలి ∙ఈ మిశ్రమాన్ని మష్రూమ్స్‌లో కూరి పక్కన పెట్టుకోవాలి ∙మరొక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు వేసి నీరు పోస్తూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి ∙నూనె వేడయ్యాక, స్టఫ్ చేసిన మష్రూమ్స్‌ను పిండి మిశ్రమంలో ముంచి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ∙ మరో కడాయిలో నూనె వేడయ్యాక తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేలా వేగనివ్వాలి ∙ఇప్పడు వరుసగా ఉల్లి, పచ్చిమిర్చి, తెల్ల ఉల్లికాడల తరుగు, ఉప్పు, కారం, సోయాసాస్, చిల్లి సాస్, వెనిగర్, పంచదార, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలుపుతూ ఉండాలి ∙చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న స్టఫ్డ్ మష్రూమ్స్‌ను వేసి గ్రేవీ పట్టేలా మరికొంతసేపు వేగనివ్వాలి ∙స్టౌ ఆఫ్ చేసి గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. మష్రూమ్ ఛీజ్ ఆమ్లెట్ కావలసినవి: కోడిగుడ్లు – 4; మష్రూమ్స్ – 100 గ్రా; ఉల్లిపాయ – 1; వెల్లుల్లి – 4 రెబ్బలు; తరిగిన ఛీజ్ – 2 టేబుల్ స్పూన్స్; కొత్తిమీర తరుగు – కొంచెం; ఉప్పు – రుచికి సరిపడ; నూనె – 2 టేబుల్ స్పూన్స్. తయారి: ∙స్టౌ పైన పాన్ పెట్టి వేడయ్యాక 1 స్పూన్ నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లి, వెల్లుల్లి, మష్రూమ్స్ వేసి 5 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కొత్తిమీర కలిపి పక్కనపెట్టుకోవాలి . ఒక గిన్నెలో గుడ్లు కొంచెం ఉప్పు వేసి బాగా బీట్ చేసుకోవాలి ∙పాన్‌లో నూనె వేసి వేడయ్యాక బీట్ చేసిన గుడ్డు మిశ్రమాన్ని కొంచెం మందంగా ఆమ్లెట్‌లా వేసుకోవాలి ∙ముందుగా తయారు చేసుకున్న మహ్రూమ్స్ మిశ్రమాన్ని కూడా వేసి రెండు వైపులా ఆఫ్ బాయిల్ అయ్యేలా చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి. మష్రూమ్ బిర్యాని కావలసినవి: మష్రూమ్స్ – 900 గ్రా; బాస్మతి బియ్యం – 4 కప్పులు; ఉల్లిపాయలు – 2; పచ్చిమిరపకాయలు – 4; టమోటాలు – 3; క్యారెట్ – 2 టేబుల్ స్పూన్స్; అల్లం తరుగు – 3 టీ స్పూన్స్; వెల్లులి – 3 రెబ్బలు; నెయ్యి/నూనె – 1/2 కప్పు; నిమ్మకాయ – 1; లవంగాలు – 7; దాల్చినచెక్క – అంగుళం ముక్క; యాలకులు – 3; ధనియాల పొడి – 3 టీ స్పూన్స్; సోయా సాస్ – 2 టీ స్పూన్స్; కారం – 1 1/1 టీ స్పూన్; ఉప్పు – రుచికి సరిపడ; నీళ్లు – 7 కప్పులు; పుదీనా – కొంచెం. తయారి: ∙బాస్మతి బియ్యాన్ని కడిగి సరిపడ నీరు పోసి గంట సేపు నానబెట్టి నీరు వాడ్చి పెట్టుకోవాలి ∙స్టౌ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టి కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 5 నిమిషాలు వేడిచేసి పక్కన పెట్టుకోవాలి ∙మష్రూమ్స్‌ను పెద్ద ముక్కలుగా తరుగిపెట్టుకోవాలి ∙అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ∙ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేసి ముందుగా తయారు చేసుకున్న మసాలా ముద్దను వేసి పచ్చివాసన పోయేలా సిమ్‌లో వేగనివ్వాలి ∙సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి ∙పచ్చిమిర్చి, క్యారెట్, టమోటా ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత మష్రూమ్స్ ముక్కలు కూడా వేసి పది నిమిషాలు వేయించుకోవాలి ∙ఇప్పుడు వరుసగా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ∙ముక్కలన్నీ వేగిన తర్వాత 7 కప్పుల నీరు పోసి మరుగుతున్నప్పుడు బియ్యం వేసి కుక్కర్ మూత పెట్టి సిమ్‌లో 2 లేదా 3 విజిల్స్ రానివ్వాలి ∙ప్రెషర్ పోయిన తర్వాత పుదీనా గార్నిష్ చేసుకోవాలి. చిల్లీ మష్రూమ్ కర్రీ కావలసినవి: మష్రూమ్స్ పెద్ద సైజువి – 10; నల్ల మిరియాల పొడి – 1/4 టీ స్పూన్; మైదా – 4 టేబుల్ స్పూన్స్; కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్; రెడ్ కాప్సికమ్ – 1/2 కప్పు; గ్రీన్ కాప్సికమ్ – 1/2 కప్పు; ఎల్లో కాప్సికమ్ – 1/2 కప్పు; ఉల్లిపాయ – 1 (ఆప్షనల్); పచ్చిమిర్చి తరుగు – 4 టీ స్పూన్స్; అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్; టమోటా సాస్ – 3 టీ స్పూన్స్; సోయా సాస్ – 1 టీ స్పూన్; వెనిగర్ – 1 టీ స్పూన్; కారం – 1/2 టీ స్పూన్; ఉప్పు – రుచికి సరిపడ; కొత్తిమీర – గార్నిష్ కోసం; నూనె – వేయించడానికి సరిపడ. తయారి: ∙మష్రూమ్స్ కాడలను కట్ చేసి తుడిచి పెట్టుకోవాలి ∙బౌల్లో మైదా పిండి ఉప్పు, మిరియాల పొడి వేసి నీరు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి ∙నూనె వేడయ్యాక మష్రూమ్స్‌ను పిండిలో ముంచి బజ్జీల్లా బంగారు రంగు వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి ∙మరో బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అర కప్పు నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి ∙మరొక బాణలిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి రెడ్, గ్రీన్, ఎల్లో కాప్సికమ్ ముక్కలు వేయించాలి ∙5 నిమిషాలు వేయించి, తరిగిన పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి మూత పెట్టి సిమ్‌లో నిమిషం మగ్గనివ్వాలి ∙ఇప్పుడు టమోటా సాస్, సోయా సాస్, వెనిగర్, సరిపడ ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి ∙ముందుగా తయారు చేసి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని పోసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్‌ను వేసి మరో రెండు నిమిషాలు వేసి వేయించుకొని కొత్తిమీరతో గార్నిష్‌తో చేసుకుంటే వేడి వేడి చిల్లీ మష్రూమ్స్ కర్రీ రెడీ. రైస్‌లోకి, చపాతీలో కూడా బాగుంటుంది. పుట్టగొడుగులతో దీర్ఘాయుష్షు! పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివని అప్పుడప్పుడూ తినడం మేలన్నది మనందరికీ తెలుసుగానీ.. కారణాలేమిటో చూద్దాం. పెన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా ఇలా చెప్తున్నారు. మిగిలిన పోషకాలను పక్కకు పెట్టి కేవలం పుట్టగొడుగుల్లో ఉండే రెండు యాంటీ ఆక్సిడెంట్ల ద్వారా మన ఆయుష్షు పెరిగే అవకాశముందన్నది సారాంశం. ఎర్గోథియోనైన్, గ్లుటాథియోన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు పుట్టగొడుగులో ఉంటాయి. శరీరం మనం తిన్న ఆహారాన్ని ఇంధనంగా మార్చుకునే క్రమంలో ఒక రకమైన ఆక్సిజన్ కణాలు పుడుతూంటాయి. ఫ్రీ రాడికల్స్ అని పిలిచే ఈ కణాలు శరీరం మొత్తం తిరుగుతూ ఒక ఎలక్ట్రాన్‌ను ఆకర్షించుకుని స్థిరపడేందుకు ప్రయత్నిస్తూంటాయి. ఈ క్రమంలో ఇవి మన కణాలు, ప్రొటీన్లు.. డీఎన్ఏకు నష్టం కలిగిస్తూంటాయి. యాంటీ ఆక్సిడెంటు పుష్కలంగా లభిస్తే ఫ్రీరాడికల్స్‌తో జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. వయసుతోపాటు వచ్చే సమస్యలను తగ్గించుకుని దీర్ఘాయుష్షు పొందవచ్చునని శాస్త్రవేత్త రాబర్ట్ బీల్మన్ తెలిపారు. పుట్టగొడుగుల్లోని యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువగా తీసుకునే ఫ్రాన్స్, ఇటలీల్లో అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత సమస్యలు తక్కువగా ఉన్న నేపథ్యంలో రెండింటికీ మధ్య సంబంధం ఏమిటన్నది కూడా పరిశీలించాలని తాము ఆలోచిస్తున్నట్లు తెలిపారు. -
ఆమ్లెట్ వేస్తే....ప్లాస్టిక్ బయటకు వచ్చింది..
-
ఆమ్లెట్ వేస్తే....ప్లాస్టిక్ బయటకు వచ్చింది..
కోల్‌కతా: ప్లాస్టిక్ రైసే కాదు...ప్లాస్టిక్ ఎగ్స్ కూడా మార్కెట్లో వచ్చేశాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో ప్లాస్టిక్ కోడిగుడ్ల విక్రయం కలకలం రేపుతోంది. ఓ మహిళకు ప్లాస్టిక్ కోడిగుడ్లు విక్రయించిన ఓ దుకాణదారుడు కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది. కోల్‌కతాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదుతో దుకాణదారుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పార్క్ సర్కస్ మార్కెట్ వద్ద షమీమ్ అన్సారీ షాపు నిర్వహిస్తున్నాడు. అతని వద్ద గురువారం సాయంత్రం అనిత కుమార్ అనే మహిళ కోడిగుడ్లు కొనుగోలు చేసింది. ఇంటికి వెళ్లాక వాటితో ఆమ్లెట్ వేసేందుకు గుడ్డును పెనం మీద వేయగానే, ప్లాస్టిక్‌లాగే గట్టిపడింది. దీంతో అనుమానం వచ్చిన ఆమె ... అగ్గిపుల్లతో ఆ గుడ్డును వెలిగించగా, మంటలు వచ్చాయి. గుడ్డు పై పెంకు కూడా ప్లాస్టిట్‌లా ఉండటంతో, అది సహజమైన కోడిగుడ్డు కాదని నిర్థారణకు వచ్చిన ఆమె కరయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుకాణదారుడిని అదుపులోకి తీసుకుని, దుకాణంలోని కోడిగుడ్లను సీజ్ చేశారు. కాగా అన్సారీ ఆ గుడ్లను రూ.1.15 లక్షలకు హోల్‌సేల్ గా కొనుగోలు చేసినట్లు పోలీసులు విచారణలో తెలిపాడు. అలాగే ఈ గుడ్లు సరఫరా చేస్తున్న హోల్ సేల్ వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు కోల్‌కతా మున్సిపల్ కార్పోరేషన్ కూడా దీనిపై విచారణకు ఆదేశించింది. -
బట్టలు సువాసన రావాలంటే..
ఇంటిప్స్ ఆమ్లెట్ బాగా పొంగాలంటే... కోడిగుడ్డు సొనలో చిటికెడు పంచదార కానీ, కాసింత మొక్కజొన్న పిండి కానీ కలపాలి.ఇస్త్రీ చేసేటప్పుడు ఇస్త్రీపెట్టెలో వేసే నీళ్లలో కాసింత పర్ఫ్యూమ్ వేస్తే బట్టలు మంచి సువాన వస్తాయి. కోడిగుడ్లు ఉడికించే గిన్నె నల్లబడిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే... ఉడికించేటప్పుడు నీటిలో కొద్దిగా చింతపండు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే దానిలో కొద్దిగా పసుపు కలిపి డబ్బాలో దాచిపెట్టాలి. మాంసం కాస్త ముదురుగా అనిపిస్తే... ఉడికించేటప్పుడు చిన్న బొప్పాయి ముక్క వేస్తే త్వరగా ఉడుకుతుంది. బియ్యం కడిగిన నీళ్లలో కాకరకాయ ముక్కలను కాసేపు నానబెట్టి తీసి, ఆ తర్వాత వండితే చేదు ఉండదు. -
ఇంటిప్స్
ఆమ్లెట్ మెత్తగా, పొంగినట్టు రావాలంటే గుడ్డు గిలకొట్టేటప్పుడు చిటికెడు పంచదార, మొక్కజొన్న పిండి కలపాలి. వేపుళ్లు చేసేటప్పుడు టీ స్పూన్ వెనిగర్ కలిపితే కూరగాయలు నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి పుస్తకాల బీరువాలో చిన్న చిన్న గంధపు చెక్కలను ఉంచితే పురగులు చేరవు. -
ఇంటిప్స్
అల్లంపై తొక్క తీయడానికి చాకుకు బదులుగా స్పూను వాడితే సులభంగా పోతుంది. అల్లాన్ని ఫ్రీజర్‌లో నిల్వ ఉంచితే ఎక్కువ రోజులు ఉంటుంది. తొక్క సులభంగా వస్తుంది. వెల్లుల్లిరేకలను ముప్ఫై సెకన్లపాటు పెనం మీద వేడిచేస్తే పొట్టు త్వరగా వస్తుంది. ఆమ్లెట్ కోసం కోడిగుడ్డును గిన్నెలో వేసి గిలక్కొట్టే ముందు గిన్నెలో నీళ్లు పోసి వంపేస్తే గుడ్డు సొన గిన్నెకు అంటుకోకుండా ఉంటుంది. వంటలో ఉప్పు ఎక్కువైందనపిస్తే వెంటనే పచ్చిబంగాళాదుంపను చక్రాలుగా కోసి వేయాలి. బంగాళాదుంప ముక్కలు ఉప్పును పీల్చుకుంటాయి. క్యాలీఫ్లవర్ వండిన తర్వాత కూడా తెల్లగా ఆకర్షణీయంగా కనిపించాలంటే వండేటప్పుడు ఒక టీ స్పూన్ పాలు కలపాలి. -
రొమాంటిక్ ప్రేమకథ
ప్రేమకథ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఆమ్లెట్’. సిరాజ్, నాగరాజ్, సౌరభ్, ముఖ్య పాత్రలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తోట కృష్ణ, మంచాల రమేష్ యాదవ్ నిర్మిస్తున్నారు. ఇ.వి.ఎన్.ఆచారి దర్శకుడు . ఈ సినిమా పాటలను, ప్రచార చిత్రాన్ని నిర్మాత సి. కల్యాణ్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘చాలా వైవిధ్యంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఏప్రిల్ రెండో వారంలో సినిమాను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి. సాగర్,తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.