కావలసినవి: పుట్టగొడుగులు – 5 (నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. అయితే ముక్కల్ని పలుచగా తరగాలి)
గుడ్లు – 3, చిక్కటి పాలు – 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – కొద్దిగా, బటర్ – 1 టీ స్పూన్
చీజ్ తురుము – 1 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ
ఉప్పు – తగినంత, నూనె – సరిపడా
కొత్తిమీర తురుము – గార్నిష్‌కి కొద్దిగా
తయారీ: ముందుగా ఒక బౌల్లో గుడ్లు, ఉప్పు, పాలు, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం పెనంలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని.. వేడి కాగానే పుట్టగొడుగు ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి.
ముక్క బాగా మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుని.. అదే పెనంలో కొద్దిగా నూనె, బటర్ వేసుకుని, బటర్ కరిగిన తర్వాత.. ఎగ్స్ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసుకోవాలి. పైన చీజ్ తురుము వేసుకుని.. చిన్న మంట మీద ఉడకనివ్వాలి. అనంతరం పుట్టగొడుగుల మిశ్రమాన్ని ఆమ్లెట్‌కి మధ్యలో నిలువుగా పరచి.. ఆమ్లెట్‌ని ఇటువైపు నుంచి అటు వైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. పైన కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరి!
క్లిక్ చేయండి: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా
Comments
Please login to add a commentAdd a comment