
బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్) రూపొందించిన ముఖ్యమైన సాంకేతికతల్లో ఒకటి ‘అర్క మష్రూమ్ చట్నీ పౌడర్’ టెక్నాలజీ. పుట్టగొడుగులకు విలువ జోడించటం ద్వారా వాటిలో పోషక విలువలను అనేక విధాలుగా ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. సంప్రదాయం, పౌష్టికత, రుచిల మేలు కలయికకు మష్రూమ్ చట్నీ పౌడర్ టెక్నాలజీ నిదర్శనంగా నిలుస్తుంది.
తాజా పుట్టగొడుగులు ఎన్నో రోజులు నిల్వ ఉండవు, పైగా మార్కెట్ ధర ఎక్కువ. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండవు. అందుకని వీటిత పొడులు తయారు చేసే టెక్నాలజీని ఐఐహెచ్‌ఆర్ రూపొందించింది. ఎండు పుట్టగొడుగులతో రకరకాలుగా చట్నీ పొడులను తయారు చేసుకోవచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతవాసులు రోజువారీ భోజనంలో సులభంగా వాడుకునే విధంగా పోషకాలు నష్టపోని రీతిలో పొడులు తయారు చేయవచ్చు.
సంప్రదాయ రుచులకు తగినట్టుగా 7 రకాల పుట్టగొడుగుల చట్నీ పొడులను రూపొందించారు. బ్రహ్మీ, మునగ ఆకులు, అవిశ గింజలు, నువ్వులు, వేరుశనగలు, కొబ్బరి వంటి వాటితో వీటిని వేర్వేరుగా రూపొందించారు. మన వంటకాల్లో కలిపి ఈ పొడులను వాడుకోవచ్చు. స్కూళ్లలో మధ్యాహ్నభోజనం, సైన్యానికి భోజనాల్లో సైతం వాడుకోదగినవని ఐఐహెచ్‌ఆర్ పేర్కొంది.
నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఈ పొడులను తయారు చేసి ఎయిర్ టైట్ కంటెయినర్లలో/ పౌచ్‌లలో నింపుకొని (26–28 డిగ్రీల సెల్షియస్) సాధారణ ఉష్ణోగ్రత ఉండే చోట నిల్వ చేసుకుంటే 3 నెలల పాటు వాడుకోవచ్చు. ఈ పొడులను తయారు చేసి విక్రయించడం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలు, సైనిక వితంతువులు, వికలాంగులు.. ఉపాధి పొందవచ్చని ఐఐహెచ్‌ఆర్ చెబుతోంది. ఈ టెక్నాలజీ పూర్తి వివరాలకు.. 080–23086100 – ఎక్స్‌టెన్షన్ 348, 349 mushroomiihr@gmail.com
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment