మష్రూమ్ వంటకాల గురించి తెలిసిన చాలామందికి ‘మష్రూమ్ కాఫీ’ గురించి తెలియకపోవచ్చు. నిజానికి ఇది లేటెస్ట్ కాఫీ ఏమీ కాదు. 1930 నుంచే ఆహా అనిపిస్తోంది. ఔషధ పుట్టగొడుగుల నుంచి దీన్ని తయారు చేస్తారు.
ఈ కాఫీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి...
– మంచి నిద్రకు ఉపయోగపడుతుంది.
– మష్రూమ్ కాఫీలోని అడా΄్టోజెనిక్ శరీరానికి మేలు చేస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది.
– రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
– ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.
– గొంతు కండరాలను రిలాక్స్ చేస్తుంది. యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
– పుట్ట గొడుగులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది.
– వీటిలో అధికంగా ఉండే విటమిన్ బి అలసట తగ్గిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది.
– మామూలు కాఫీలో కంటే కెఫిన్ తక్కువగా ఉంటుంది.
– ఏకాగ్రతను పెంచుతుంది.
ఈ కాఫీని మామూలు కాఫీలాగే తయారు చేస్తారు. అయితే మష్రూమ్ పౌడర్ కలుపుతారు. ‘మామూలు కాఫీకి ప్రత్యామ్నాయ కాఫీకి’గా మష్రూమ్ కాఫీ గురించి చెబుతున్నటికి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మష్రూమ్ అలెర్జీ ఉన్నవారు ఈ కాఫీకి దూరంగా ఉండాలి. దద్దుర్లు, చాతీలో నొప్పి, కడుపులో నొప్పి, వాంతి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది... మొదలైనవి మష్రూమ్ అలర్జీ లక్షణాలు. మూత్రపిండాల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ కాఫీ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందని అంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా మష్రూమ్ కాఫీని సేవించాలనుకోవడానికి ముందు డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment