నిగనిగ మెరిసిపోతూ.. ఖర్జూరాలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. రుచికి కూడా బాగుంటాయి. అందుకే అందరూ వీటిని అందరూ ఇష్టపడతారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. రోజూ కొద్ది మొత్తంలో ఖర్జూరం పండ్లు తింటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..
ఖర్జూరాల వల్ల కలిగే ప్రయోజనాలను పొందాలంటే... కనీసం ఒక వారం లేదా పదిరోజులపాటు క్రమం తప్పకుండా నాలుగయిదు తినాలి. డయాబెటిస్ ఉన్న వారు మాత్రం వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి.
గుండెకు బలం..
ఖర్జూరాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ధమని కణాల నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఖర్జూరం తినటం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెపోటు, హైపర్‌టెన్షన్ , స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఖర్జూలంలో ΄÷టాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హార్ట్ బీట్, బీపీని నార్మల్‌గా ఉంచుతుంది.
కండరాలు బలంగా ఉంటాయి..
ఖర్జూరంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో ఉండే. ΄÷టాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, కాపర్, మాంగనీస్ వంటివి ఎముకలు గుల్లబారటం, కీళ్లు అరగటం వంటి ఎముకల సమస్యలు రాకుండా రక్షిస్తాయి.
సంతానోత్పత్తి సామర్థ్యం..
మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడానికి ఖర్జూరాలు సహాయపడతాయి. ఖర్జూరం తింటే స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది.
మెరుగైన జ్ఞాపకశక్తి..
ఖర్జూరాల్లో ఉండే విటమిన్ ‘బి6’ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెదడును ఒత్తిడి, వాపు నుంచి రక్షించవచ్చు. ఖర్జూరాలను రోజూ తింటే.. నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే.. న్యూరో డీ జెనరేటివ్ వ్యాధి నుంచి దూరంగా ఉండొచ్చు. ఖర్జూరం తింటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఖర్జూరంలో ఉండే ఫైబర్ కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుంటాయి. పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది.
జీర్ణ సమస్యలు దూరం..
ఖర్జూరంలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేసి, మలబద్ధకం దరి చేరదు.
ఇవి చదవండి: కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఇలా చేయండి!
Comments
Please login to add a commentAdd a comment