Mushroom
-
Mushroom: పుట్టగొడుగుల సంబరాలు
పుట్టగొడుగుల్లో ఒక జాతికి చెందిన ‘వైట్ ట్రఫల్’ పుట్టగొడుగుల కోసం ఇటలీలో ఏటా దాదాపు రెండు నెలల పాటు సంబరాలు జరుగుతాయి. ఇటలీలోని అల్బా నగరంలో ఈ సంబరాలు అక్టోబర్ 12న మొదలై, డిసెంబర్ 8 వరకు కొనసాగుతున్నాయి. పుట్టగొడుగుల్లోని అత్యంత ప్రత్యేకమైనవిగా పరిగణించే వైట్ ట్రఫల్ అభిమానులు దేశ విదేశాల నుంచి ఈ వేడుకలకు హాజరవుతారు. ఈ వేడుకల్లో భాగంగా వైట్ ట్రఫల్ వేలంపాటలు జరుగుతుంటాయి. అల్బా నగరంలో 94 ఏళ్లుగా ‘ఇంటర్నేషనల్ వైట్ ట్రఫల్ ఫెస్టివల్’ పేరిట ఈ సంబరాలు జరుగుతున్నాయి. వేలంపాటల్లో పెద్దసైజులో ఉండే నాణ్యమైన వైట్ ట్రఫల్కు కళ్లు చెదిరే ధరలు పలుకుతుంటాయి. వైట్ ట్రఫల్ సంబరాల్లో భాగంగా వైట్ ట్రఫల్తో ప్రత్యేకమైన వంటకాలు తయారు చేయడంలో శిక్షణ శిబిరాలు, వైట్ ట్రఫల్ను రుచి చూసి నాణ్యతను ఎంపిక చేసే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు టేస్ట్ వర్క్‌షాప్, మ్యూడెట్ ట్రఫల్ మ్యూజియం సందర్శన, ట్రఫల్ వంటకాలతో ప్రతిరోజూ విందులు, ట్రఫల్ వంటకాల తయారీలో షెఫ్‌లకు పోటీలు, అల్బా నగరానికి చేరువలోని రోడీ పట్టణంలో ఉన్న రోడీ కోట సందర్శనతో పాటు ఆ కోటలో ప్రత్యేక విందు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. అల్బాలో వేడుకలు జరిగే చోట ఏర్పాటు చేసే ట్రఫల్ దుకాణాలు జనాలతో కిక్కిరిసి కనిపిస్తాయి. వైట్ ట్రఫల్ కిలో ధర దాదాపుగా 2,300 యూరోల (రూ.2.38 లక్షలు) వరకు ఉంటుంది. అల్బాలో జరిగే ఇంటర్నేషనల్ వైట్ ట్రఫల్ ఫెస్టివల్లో పెద్ద పరిమాణంలో ఉండే వైట్ ట్రఫల్ను ప్రత్యేకంగా ఎంపిక చేసి, వాటిని వేలం పాటల్లో విక్రయిస్తుంటారు. రెండేళ్ల కిందట జరిగిన వేలంలో 700 గ్రాముల బరువున్న వైట్ ట్రఫల్కు ఏకంగా 1.84 లక్షల యూరోల (రూ.16.91 కోట్లు) పలికింది. వేలంలో పాల్గొన్న హాంకాంగ్ సంపన్నుడు ఒకరు దీనిని సొంతం చేసుకున్నారు. వైట్ ట్రఫల్ వేలం పాటల్లో ఇప్పటి వరకు ఇదే రికార్డు. -
మెరిసే పుట్టగొడుగులు..! తింటే.. అంతే..!
మిణుగురు పురుగులు చీకట్లో వెలుగులు వెదజల్లుతూ ఎగురుతుంటాయి. ఈ పుట్టగొడుగులు కూడా మిణుగురుల్లాగానే చీకట్లో వెలుగులు వెదజల్లుతుంటాయి. రాత్రి పూర్తిగా చీకటి పడిన తర్వాత ఇవి ఆకుపచ్చ రంగులో వెలుగుతూ మిరుమిట్లు గొలుపుతాయి.‘మైసీనీ క్లోరోఫాస్’ అనే ఈ పుట్టగొడుగులు పగటివేళ మిగిలిన పుట్టగొడుగుల మాదిరిగానే బూడిదరంగు గోధుమరంగు కలగలసిన రంగులో కనిపిస్తాయి. ఇవి భారత్, శ్రీలంక, తైవాన్, ఇండోనేసియా, పోలినేసియా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో కనిపిస్తాయి. అమెరికన్ వృక్షశాస్త్రవేత్త చాల్స్ రైట్ 1854లో తొలిసారిగా వీటిని జపాన్‌లోని బోనిన్ దీవుల్లో గుర్తించాడు. ఈ పుట్టగొడుగుల కాండం 2–12 అంగుళాల వరకు ఉంటుంది. పైనున్న గొడుగు వంటి భాగం 1.2 అంగుళాల వరకు ఉంటుంది. జపాన్‌లో దీనిని ‘యాకో టాకె’ అని అంటారు. అంటే, ‘రాత్రి దీపం’ అని అర్థం. రాత్రివేళ వెలుగుతూ ఆకర్షణీయంగా కనిపించే ఈ పుట్టగొడుగులు తినడానికి మాత్రం పనికిరావు. పొరపాటున తింటే, వీటిలోని విషపదార్థాలు ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తాయి. (చదవండి: గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరి..) -
అబ్బా.. తొక్కేం కాదు! నారింజ పుట్టగొడుగు!!
నేల మీద ఎవరో నారింజ తొక్కలను పడేసినట్లుగా ఉంది కదూ! నారింజ తొక్కలేమీ కాదు, ఇవి పుట్టగొడుగులు. నారింజ తొక్కల్లా కనిపించడం వల్ల ఈ పుట్టగొడుగులు ‘ఆరెంజ్ పీల్ ఫంగస్’గా పేరు పొందాయి. ఈ పుట్టగొడుగుల శాస్త్రీయ నామం ‘అల్యూరియా ఆరాంటియా’.చక్కని నారింజ రంగులో, అప్పుడే వలిచిన తజా నారింజ తొక్కల్లా కనిపించే ఈ అరుదైన పుట్టగొడుగులు ఉత్తర అమెరికాలోను, యూరోప్‌లోని కొన్ని ప్రాంతాల్లోను, చిలీ దక్షిణ ప్రాంతంలోను ఆగస్టు నుంచి నవంబర్ నెలల మధ్య కాలంలో కనిపిస్తాయి. ఈ పుట్టగొడుగులు కొద్దిపాటి తేమ ఉన్న మట్టి నేలల్లో పెరుగుతాయి. ఈ పుట్టగొడుగులు తినడానికి పనికి వస్తాయి.ఇవి చదవండి: దస్తూరి అయాచిత వరం! -
'మష్రూమ్ కాఫీ'ని ఎప్పుడైనా తాగారా! కొందరికి ఇదీ..?
మష్రూమ్ వంటకాల గురించి తెలిసిన చాలామందికి ‘మష్రూమ్ కాఫీ’ గురించి తెలియకపోవచ్చు. నిజానికి ఇది లేటెస్ట్ కాఫీ ఏమీ కాదు. 1930 నుంచే ఆహా అనిపిస్తోంది. ఔషధ పుట్టగొడుగుల నుంచి దీన్ని తయారు చేస్తారు.ఈ కాఫీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి...– మంచి నిద్రకు ఉపయోగపడుతుంది.– మష్రూమ్ కాఫీలోని అడా΄్టోజెనిక్ శరీరానికి మేలు చేస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది.– రోగనిరోధక శక్తి పెరుగుతుంది.– ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది.– గొంతు కండరాలను రిలాక్స్ చేస్తుంది. యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.– పుట్ట గొడుగులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది.– వీటిలో అధికంగా ఉండే విటమిన్ బి అలసట తగ్గిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది.– మామూలు కాఫీలో కంటే కెఫిన్ తక్కువగా ఉంటుంది.– ఏకాగ్రతను పెంచుతుంది.ఈ కాఫీని మామూలు కాఫీలాగే తయారు చేస్తారు. అయితే మష్రూమ్ పౌడర్ కలుపుతారు. ‘మామూలు కాఫీకి ప్రత్యామ్నాయ కాఫీకి’గా మష్రూమ్ కాఫీ గురించి చెబుతున్నటికి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మష్రూమ్ అలెర్జీ ఉన్నవారు ఈ కాఫీకి దూరంగా ఉండాలి. దద్దుర్లు, చాతీలో నొప్పి, కడుపులో నొప్పి, వాంతి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది... మొదలైనవి మష్రూమ్ అలర్జీ లక్షణాలు. మూత్రపిండాల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ కాఫీ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందని అంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా మష్రూమ్ కాఫీని సేవించాలనుకోవడానికి ముందు డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది. -
బతికుండగానే కప్పపై పుట్టగొడుగులు..!
సహజంగా పుట్టగొడుగులు ఎలా పెరుగుతాయో మనకు తెలిసిందే. కుళ్లిన కలపపై వచ్చు ఒకరకమైన శిలింధ్రం. ఇవి అసాధారణ జీవులు. అవి సాధారణంగా సాప్రోట్రోఫ్లు లేదా సహజీవులు. ఇవి పోషకాల సైక్లింగ్‌ను సులభతరం చేస్తాయి. సధారణంగా పుట్టగొడుగులు చనిపోయిన లేదా కుళ్లిన వాటిపై శిలింధ్రాలు పుట్టగొడుగులుగా రావడం జరగుతుంది. బతికి ఉండు జీవుల్లో పుట్టగొడుగులు రావడం అనేది అత్యంత అరుదు. కానీ ఇక్కడొక కప్ప బతికే ఉన్న ఓ బంగారు రంగు కప్ప శరీరంపై పుట్టగొడుగు మొలిచింది. ఇక్కడ కప్ప బతికే ఉంది. అయితే ఇదెలా సాధ్యమని శాస్త్రవేత్తలు షాకవ్వుతున్నారు. వివరాల్లోకెళ్దే..ఈ ఫొటోలోని కప్పను బాగా పరిశీలిస్తే మీకు కప్ప మీద ఒక పుట్టగొడుగు కనిపిస్తుంది. ఇది ఒక రకమైన బోనెట్ మష్రూమ్. పుచ్చిపోతున్న దశలో ఉన్న కలపపైన, లేదా జంతువుల పేడపైన పెరుగుతుంది. అయితే ఇంకా సజీవంగానే ఉన్న కప్ప శరీరంపై కనిపించడం ఇదే మొదటిసారి. దీన్ని ఈ మధ్యనే కర్ణాటక పశ్చిమ కనుమల్లోని కర్కాలలో గుర్తించారు. దీనిపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఈ కప్పను ‘రావుస్ ఇంటర్మీడియట్ గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్’ (హైలార్నా ఇంటర్మీడియా)గా గుర్తించారు. పైగా ఆ కప్ప ఎడమ వైపు నుంచి పుట్టగొడుగు పెరుగుతూ ఉన్నప్పటికీ కప్ప సజీవంగా, చురుకుగా ఉంది. దీంతో వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ పరిశోధకులతో సహా శాస్త్రవేత్తలంతా అయోమయంలో పడ్డారు. సజీవంగా ఉన్న కప్ప శరీరంపై పుట్టగొడుగులు ఎలా పెరుగుతాయో తెలుసుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తునే ఉన్నారు. ఇది ఒక రకమైన వ్యాధి వల్ల కావచ్చునని అనుకుంటున్నా.. అందుకు బలమైన ఆధారాలేవీ ఇప్పటివరకు దొరకలేదు. (చదవండి: గడ్డకట్టే చలిలో మెడిటేషన్ చేస్తున్న యోగి!) -
Mushroom Omelette: మష్రూమ్స్ ఆమ్లెట్.. వేయడం చాలా ఈజీ!
కావలసినవి: పుట్టగొడుగులు – 5 (నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. అయితే ముక్కల్ని పలుచగా తరగాలి) గుడ్లు – 3, చిక్కటి పాలు – 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – కొద్దిగా, బటర్ – 1 టీ స్పూన్ చీజ్ తురుము – 1 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు – తగినంత, నూనె – సరిపడా కొత్తిమీర తురుము – గార్నిష్‌కి కొద్దిగా తయారీ: ముందుగా ఒక బౌల్లో గుడ్లు, ఉప్పు, పాలు, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం పెనంలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని.. వేడి కాగానే పుట్టగొడుగు ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. ముక్క బాగా మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుని.. అదే పెనంలో కొద్దిగా నూనె, బటర్ వేసుకుని, బటర్ కరిగిన తర్వాత.. ఎగ్స్ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసుకోవాలి. పైన చీజ్ తురుము వేసుకుని.. చిన్న మంట మీద ఉడకనివ్వాలి. అనంతరం పుట్టగొడుగుల మిశ్రమాన్ని ఆమ్లెట్కి మధ్యలో నిలువుగా పరచి.. ఆమ్లెట్‌ని ఇటువైపు నుంచి అటు వైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. పైన కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరి! క్లిక్ చేయండి: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా -
ప్రాణాలు తీసిన పుట్టగొడుగుల కూర
సాక్షి, బెంగళూరు: పుట్టగొడుగులు ఎన్నో పోషకాలతో కూడి ఉంటాయి, కానీ సురక్షితమైన రకాలని తిన్నప్పుడే పోషకాలు లభిస్తాయి, లేదంటే ప్రాణాలే తీస్తాయి. విషపూరిత పుట్ట గొడుగుల కూర తిని తండ్రీ కొడుకు మృతి చెందిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకాలో జరిగింది. పుదువెట్టు గ్రామం మీయారుపాదె కేరిమారుకు చెందిన గురువ మేఠ (80) ఆయన కొడుకు ఓడియప్ప (41)లు కూర తిన్న తరువాత స్పృహ కోల్పోయి మరణించారు. సోమవారం గురువ సమీపంలోని అడవిలోకి వెళ్లి పుట్ట గొడుగులను ఏరుకొచ్చాడు. రాత్రి ఇంటిలో కూర చేసుకొని ఆరగించి నిద్రపోయారు. ఉదయం లేవకపోవడంతో మంగళవారం ఉదయం తండ్రీ కొడుకులు ఉదయం 10 గంటలైనా లేవలేదు. అనుమానంతో పక్కింటివారు వచ్చి చూడగా విగతజీవులై ఉన్నారు. మరో కొడుకు ఇంట్లో లేకపోవడంతో బతికి బయటపడ్డాడు. ధర్మస్థల పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలకు బెళ్తంగడి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. విషపూరితమైన పుట్టగొడుగులను తినడమే కారణమై ఉంటుందని తెలిపారు. చదవండి: (భర్త కాదు.. మృగం.. భార్యను దారుణంగా..) -
Recipe: మష్రూమ్ పాప్ కార్న్ ఇలా చేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది!
పుట్టగొడుగు కర్రీ బోర్ కొట్టిందా.. అయితే.. మష్రూమ్ పాప్‌కార్న్‌ను ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని కొత్త రుచిని ఆస్వాదించండి. మష్రూమ్ పాప్ కార్న్ తయారీకి కావలసినవి: ►పుట్టగొడుగులు – 15 నుంచి 20 లోపు(శుభ్రం చేసుకుని, ముక్కల్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి) ►అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు, కారం, ►చాట్ మసాలా – 1 టీ స్పూన్ చొప్పున ►మైదా , నిమ్మరసం, జీలకర్ర పొడి, గరం మసాలా ►పాలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►ఓట్స్ పౌడర్, బ్రెడ్ పౌడర్ – 5 టేబుల్ స్పూన్లు చొప్పున(రెండు కలిపి పెట్టుకోవాలి) ►గుడ్లు – 2 (ఒక గుడ్డుని పాలలో కలిపి పెట్టుకోవాలి) ►ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా మష్రూమ్ పాప్ కార్న్ తయారీ: ►ముందుగా ఒక గిన్నెలో పుట్టగొడుగు ముక్కలు వేసుకోవాలి. ►అందులో అల్లం–వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కారం, చాట్ మసాలా, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ నూనె, ఒక గుడ్డు వేయాలి. ►ఆ మిశ్రమాన్ని ముక్కలకు బాగా పట్టించి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం ఒక చిన్న బౌల్లో ఓట్స్, జీలకర్ర పొడి, గరం మసాలా, మైదా వేసుకొని బాగా కలిపి ఉంచాలి. ►కళాయిలో నూనె వేడి చేసుకుని, ఒక్కొక్క పుట్టగొడుగు ముక్కను మొదట గుడ్డు–పాల మిశ్రమంలో, ఆపై ఓట్స్–బ్రెడ్ పౌడర్ మిశ్రమంలో ముంచి బాగా పట్టించి నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇది కూడా ట్రై చేయండి: Mutton Rogan Josh Recipe In Telugu: అన్నం, రుమాలీ రోటీలోకి అదిరిపోయే మటన్ రోగన్ జోష్! -
మష్రూమ్స్ మంచూరియా, మష్రూమ్స్ మటన్ కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా..?
ఎప్పుడూ ఒకేలా కాకుండా వంటకాలకు ఏదైనా ప్రత్యేకతను జోడించాలని ఆలోచన వస్తే ఎంపికలో మొదటి స్థానంలో ఉండేవి పుట్టగొడుగులు. వెజ్ అయినా.. నాన్ వెజ్ అయినా విందు పసందుగా మార్చేయాలంటే అన్నింటికీ అండగా నేనన్నానంటూ వచ్చి చేరుతాయి. రుచితో పాటు పోషకాలనూ సమృద్ధిగా అందిస్తాయి. మష్రూమ్స్ మటన్ కావలసినవి: ► మటన్– 500 గ్రాములు; టొమాటో – 250 గ్రాములు; ఉల్లిపాయ – 2 (సన్నగా తరగాలి); బటన్ పుట్టగొడుగులు – 200 గ్రాములు; కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్లు; ► నూనె – 6 టేబుల్ స్పూన్లు; లవంగాలు – 2; ఏలకులు – 2; సాజీర – అర టీ స్పూన్; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ► గరం మసాలా – పావు టీ స్పూన్; బిర్యానీ ఆకులు – 2; మెంతిపొడి – అర టీ స్పూన్; అల్లం పేస్ట్ – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు; ► కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి– టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత తయారీ: ప్రెజర్ పాన్‌లో నూనె వేసి, వేడి చేయాలి. ►లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, సాజీర వేసి, కొన్ని సెకన్ల తర్వాత, ఉల్లిపాయ తరుగు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ► అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి ∙దీంట్లో టమోటా ముక్కలు వేసి, గుజ్జులా అయ్యే వరకు ఉడికించాలి. ► దీంట్లో మటన్ ముక్కలను వేసి, గోధుమ రంగులోకి వచ్చే వరకు ఉడికించాలి. ► తర్వాత పుట్టగొడుగులు, కొబ్బరి పొడి, ఉప్పు వేసి, కప్పు నీళ్లను కలిపి, ప్రెజర్ కుకర్ మూత పెట్టి, 15 నిమిషాలు ఉడికించాలి. ► 10 నిమిషాలు చల్లారేవరకు ఉంచి, ఆ పైన కుక్కర్ మూత తీయాలి. ► ధనియాల పొడి, మసాలా వేసి, 5 నిమిషాలు ఉడికించి, దించాలి. ► కొత్తిమీర తరుగు వేసి, సర్వ్ చేయాలి. చదవండి: (మాంసాహారం డీప్ ఫ్రై లేదా రోస్ట్ చేస్తే.. ‘హెటెరోసైక్లిక్ అరోమాటిక్ అమైన్స్’ వల్ల) మష్రూమ్స్ మంచూరియా కావలసినవి: ►మైదా – అర కప్పు; మష్రూమ్స్ – 250 గ్రాములు; కార్న్‌ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్లు; అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; ►నీళ్లు – కప్పు; ఉప్పు – తగినంత; పంచదార – అర టీ స్పూన్; పచ్చి మిర్చి – 3 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; ►కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్; ఉల్లికాడల తరుగు – టేబుల్ స్పూన్; బెల్ పెప్పర్ – 1 (సన్నగా తరగాలి) సాస్ కోసం: నల్ల మిరియాల పొడి – చిటికెడు; పంచదార – చిటికెడు; సోయా సాస్ – టీస్పూన్ తయారీ: ►పుట్టగొడుగులను కడిగి, తుడిచి, సగానికి కట్ చేయాలి. ఒక గిన్నెలో సాస్ మినహా పై పదార్థాలన్నీ తీసుకోవాలి. ► తగినన్ని నీళ్లు పోసి పిండిని బాగా కలుపుకోవాలి.స్టౌ పై బాణలి పెట్టి, తగినంత నూనె పోసి, వేడి చేయాలి. ► పుట్టగొడుగులను పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, తీసి, పక్కన పెట్టుకోవాలి. ►అదే నూనెలో, కట్ చేసి పెట్టుకున్న ఉల్లి కాడలను వేసి, నిమిషం సేపు వేయించి, తీసి పక్కనుంచాలి. ►నల్ల మిరియాలు, ఉప్పు, చక్కెర, సోయా సాస్ కలిపి పక్కనుంచాలి. ఈ సాస్‌లో వేయించిన పుట్టగొడుగులను వేసి, అన్నింటికీ సాస్ పట్టేలా బాగా కదిలించాలి. ► తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీరతో అలంకరించి, సర్వ్ చేయాలి. చదవండి: (30 ఏళ్లకే బీపీ, షుగర్.. ఒక్కపూట అన్నానికే పరిమితం.. కోటీశ్వరులు మెచ్చిన తిండి..) -
గరిటె పట్టిన రాహుల్.. వీడియో వైరల్
చెన్నై: ప్రస్తుతం యూట్యూబ్‌లో బాగా పాపులర్ చానెల్స్ ఏంటి అంటే వంటల వీడియోలకు సంబంధించిన చానెల్స్. సరదాగా మొదలు పెట్టిన వారు ఇప్పుడు తమ పాక శాస్త్ర ప్రావీణ్యంతో జనాలను ఆకట్టుకుని.. లక్షల్లో సంపాదిస్తున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక ఇలాంటి వీడియోలో ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే.. ఇంకేముంది.. వారి చానెల్ ఎక్కడికో వెళ్లి పోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ యూట్యూట్ కుకింగ్ చానెల్లో కనిపించడమే కాక స్వయంగా గరిటె తిప్పి.. సదరు యూట్యూబ్ చానెల్ మెంబర్స్‌తో కలిసి వారు చేసిన వంటను ఆరగించారు. ఇక వంట చేసే సమయంలో రాహుల్ ఆయా పదార్థాల పేర్లను తమిళంలో పలికేందుకు ట్రై చేయడం.. చాలా బాగా కుదిరింది అంటూ సరదాగా కామెంట్ చేస్తూ.. ఉత్సాహంగా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఇటీవల తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ.. అక్కడ బాగా ఫేమస్ అయిన ఓ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ పెరియతంబీ బృందాన్ని కలిశారు. సడెన్‌గా వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు. వారు చేస్తోన్న మష్రూమ్ (పుట్టగొడుగులు) బిర్యానీ తయారీ విధానం చూశారు. ఆ బృందంతో పాటు తాను గరిటె తిప్పారు. (చదవండి: లెక్కల ‘అంతు’ తేల్చినవాడు) బిర్యానీ సైడ్ డిష్ కోసం రాహుల్ రైతా తయారు చేశారు. ఇక దానికి వాడే పదార్థాలైన ఉల్లిపాయలు, పెరుగు, కల్లుప్పును తమిళంలో ఏం అంటారో తెలుసుకుని.. తిరిగి పలకడానికి ప్రయత్నించారు. ఇక బిర్యానీ వంటడం పూర్తయిన తర్వాత వారంతా అక్కడే కూర్చుని దాన్ని తిన్నారు. అనంతరం బిర్యానీ సూపర్ అంటూ వారిని తమిళంలో ప్రశంసించారు. రాహుల్‌కి, పెరియతంబీ బృందానికి మధ్య జరిగిన ఆ సంభాషణ ఆసాంతం ఆకట్టుకునేలా ఉంది. స్థానిక మహిళ ఒకరు రాహుల్‌కు, పెరియతంబి టీమ్‌కు మధ్య ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించారు. రాహుల్ ఆంగ్లంలో చెప్పింది వారికి తమిళంలో చెప్పి, వాళ్లు తమిళంలో మాట్లాడింది రాహుల్‌కు ఆంగ్లంలో వివరించి సంభాషణ కొనసాగించారు. ఈ క్రమంలో ఒకసారి ఆమె రాహుల్ ఇంగ్లిష్‌లో చెప్పిన మాటలను వారికి మళ్లీ అదే భాషలో చెప్పడం వీడియోలో నవ్వులు పూయిస్తుంది. (చదవండి: తమిళులపై మోదీ సవతి ప్రేమ ) తమ వంటలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని ఈ బృందానికి చెందిన సుబ్రహ్మణ్యం రాహుల్ గాంధీకి తెలిపాడు. తమిళనాడు మాత్రమే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూడా వెళ్లి వంటలు చేయాలనేది తమ కోరిక అని చెప్పాడు. అంతేకాక తమ చానెల్ ద్వారా తాము డబ్బు సంపాదించడమే కాక మరో నలుగురికి ఉపాధి కల్పించడమే తమ ధ్యేయం అన్నారు. అది విన్ని రాహుల్.. అమెరికాలో తనకొక మిత్రుడు ఉన్నాడని, ఆయనకు చెప్పి షికాగోలో వంట కార్యక్రమం పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆ మిత్రుడు ఎవరో కాదు.. శ్యామ్ పిట్రోడా. 14 నిమిషాల నిడివి గల ఈ వీడియో చివరివరకూ ఆసక్తికరంగా సాగింది. ఇక ఈ వీడియోపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
కారు మట్టిలో కూరుకుపోయి..18 రోజుల తర్వాత
ఆస్ట్రేలియాకు చెందిన 58 ఏళ్ల రాబర్ట్ వెబర్ క్వీన్స్‌లాండ్‌లోని ఓ హోటల్ నుంచి తన పెంపుడు కుక్కతో జనవరి 6న బయటకు వెళ్లారు. ఆరోజు నుంచి అతను మళ్లీ ఎవరికీ కనిపించలేదు. ఆ తరువాత 18 రోజుల తర్వాత అంటే జనవరి 24 ఆదివారం అతన్ని పోలీసులు గుర్తించి రక్షించారు. కాగా వెబర్ పంటపొలాలు ఉన్న ఒక రోడ్డులో వెళ్తుండగా తన కారు మట్టిలో కూరుకుపోయింది. కారు అటూ ఇటూ కదలలేని పరిస్థితి. దాంతో ఎంత ప్రయత్నించినా అతను బయటకు రాలేక కారులోనే ఉండిపోయాడు. మూడురోజుల తరువాత అతికష్టం మీద కారునుంచి బయటపడి దగ్గరల్లో ఉన్న డ్యామ్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ కాస్త సేదతీరిన తరువాత అక్కడ దొరికిన పుట్టగొడుగులు(మష్రూమ్స్), డ్యామ్‌లోని నీటిని తాగి ప్రాణాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే ఆదివారం స్థానిక ఎంపీ టోనీ పెరెట్ అటుగా వెళ్తుండగా.. వెబర్ ఒక చెట్టుకింద కూర్చొని కనిపించడంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన పోలీసులు వెబర్‌ను రక్షించి వైద్యసాయం అందిస్తున్నారు. వెబర్ శరీరంలో వైటల్స్ తగ్గడం వల్ల కాస్త నీరసంగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు. అయితే తనతో వచ్చిన పెంపుడు కుక్క ఆచూకీ మాత్రం ఇంతవరకు దొరకలేదు. భౌభౌ రికార్డు కాలిఫోర్నియాకు చెందిన విష్, హలో అనే రెండు శునకాలు ఒకే నిమిషంలో ‘28’ ట్రిక్స్ ప్రదర్శించి వరల్డ్ రికార్డ్ సెట్ చేశాయి. గతంలో ఉన్న రికార్డ్‌ను బ్రేశాయి. జంప్, క్యాచ్, ఫార్వర్డ్, ఎరౌండ్ లెఫ్ట్, ఎరౌండ్ రైట్, డౌన్...ఇలా ఈ శునకాల రకరకాల ట్రిక్స్ వీడియో చూస్తే ఆశ్చర్యమే కాదు బోలెడంత నవ్వు కూడా వస్తుంది. వీటి పిల్లలు కికో, స్పానిష్, టగ్‌లు చిన్న చిన్న రికార్డుల కోసం శిక్షణ పొందుతున్నాయి. ట్రైనర్ ఎమిలీ లర్ల్హమ్ శునకాల కోసం ప్రత్యేకమైన యూట్యూబ్ చానల్ నిర్వహిస్తోంది. -
పుట్ట గొడుగుల సౌందర్యం
ప్రపంచ సౌందర్య ఉత్పాదనలో రెండేళ్లుగా అవకాడో వాడకం అగ్రగామిగా ఉంటే ఈ యేడాది వండర్ స్కిన్‌కేర్ పదార్థంగా పుట్టగొడుగులు చేరాయి. చైనీయుల ప్రాచీన సౌందర్య ఉత్పత్తుల వాడకంలో పుట్టగొడుగులను వాడినట్టు చరిత్ర చెబుతోంది. చర్మం ముడతల నివారణిగానూ, కణాలను పునరుజ్జీవింప చేయడంలోనూ పుట్టగొడుగులు పేరొందాయి. ఇందుకు కారణం పుట్టగొడుగుల్లో చర్మ ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని పెంచే విటమిన్లు అధికంగా ఉండటమే. ముఖ్యంగా వీటిలో కొవ్వు, పిండిపదార్థాలు తక్కువ. విటమిన్ –డి, సెలీనియమ్, యాంటీయాక్సిడెంట్ల గుణాల శాతం ఎక్కువ. దీని వల్ల ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడే పుట్టగొడుగులు ఆల్‌రౌండర్‌గా పేరొందుతున్నాయి. పొడిబారిన చర్మానికి.. చర్మం మృదుత్వానికి మాయిశ్చరైజర్లను పైపూతగా వాడుతుంటాం. చర్మ గ్రంధులనుంచి విడుదలయ్యే సహజనూనెలు తగ్గితే చర్మం ముడతలు, చారలు ఏర్పడి త్వరగా వయసు పైబడినట్టు కనిపిస్తారు. పోషకాలున్న పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకుంటే చర్మం పొడిబారడం సమస్య తగ్గుతుంది. యవ్వనకాంతికి.. పుట్టగొడుగుల్లో ఉండే పోషకాలు, ఔషధగుణాలు యవ్వనకాంతిని పెంచుతాయి. అందుకే యాంటీ ఏజింగ్ క్రీములు, లోషన్లు, సీరమ్స్ తయారీలో పుట్టగొడుగుల నూనెలను ఉపయోగిస్తుంటారు. ఈ ఉత్పాదనల అమ్మకం పెరగడం వల్లే ఈ యేడాది పుట్టగొడుగులతో తయారు చేసిన సౌందర్య ఉత్పాదనల వాడకం పెరగనుందన్నమాట. ఫేస్‌ప్యాక్ ఈ తరం యువతీయువకులు మొటిమలు, యాక్నె సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీనికి విరుగుడుగా పుట్టగొడుగుల పొడితో ఫేస్‌ప్యాక్ ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు. మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు. ►టీ స్పూన్ పుట్టగొడుగులు పొడి, మూడు టేబుల్ స్పూన్లు ఉడికించిన ఓట్స్, తగినన్ని నీళ్లు, రెండు చుక్కల సుగంధ నూనె, అర టీ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. ముందుగా చేతులను, ముఖాన్ని చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే యాక్నె, మొటిమల సమస్యలు త్వరగా తగ్గుముఖం పడతాయి. చర్మకాంతీ పెరుగుతుంది. -
పుట్టగొడుగుల సాగు భలే తేలిక!
పుట్టగొడుగుల్లో పౌష్టిక విలువల గురించి తెలియని వారుండరు. కానీ, అవి అందుబాటులో లేక తినలేకపోతున్నామనే వారు మాత్రం చాలా మందే కనిపిస్తారు. గ్రామాల్లో, నగరాల్లో ఎక్కడైనా ఇదే పరిస్థితి. పుట్టగొడుగులను ఎండబెట్టుకొని కూరగా లేదా జావగా చేసుకొని తీసుకుంటే విటమిన్–డి లోపం కొద్ది వారాల్లోనే తీరిపోతుందని డాక్టర్ ఖాదర్ వలి చెప్తుండడంతో వీటి వాడకంపై ముఖ్యంగా నగరవాసుల్లో ఆసక్తిపెరుగుతోంది. అయితే, మనసుపెట్టి నేర్చుకుంటే ఆరు గంటల్లోనే పుట్టగొడుగులను ఇంటిపట్టునే పెంచుకునే పద్ధతులు తెలిసిపోతాయని బెంగళూరుకు చెందిన వినయ్ పరడె అంటున్నారు. తన స్నేహితుడు నగేష్ ఆనంద్‌తో కలిసి కేవలం 6 గంటల శిక్షణతో పుట్టగొడుగుల పెంపకం ఎలాగో నగరవాసులకు నేర్పిస్తున్నారు. ‘పంటలకు అవసరమయ్యే నీటిలో 5 శాతంతోనే పుట్టగొడుగులను అతి తక్కువ పెట్టుబడితో సులభంగా ఇంట్లోనే మనం సాగు చేసుకోవచ్చు. వెలుతురు కూడా అవసరం లేదు. చీకటి గదిలో పెంచుకోవచ్చు..’అంటారు వినయ్. విద్యుత్ అవసరం లేకుండానే ఎండుగడ్డి వంటి వ్యర్థాలను శుద్ధిచేసి, వాటిపై ముత్యపు చిప్పల్లాంటి పుట్టగొడుగుల(ఆయిస్టర్ మష్రూమ్స్) పెంపకాన్ని బడికెళ్లే పిల్లలు కూడా చేయగలిగే సులువైన సేంద్రియ పద్ధతిని మేం అందరికీ నేర్పిస్తున్నాం అంటున్నారాయన. -
కొబ్బరితోటలో వింత
రణస్థలం: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం డేరశాం గ్రామంలో వింత సంఘటన వెలుగుచూసింది. గ్రామంలోని ఓ కొబ్బరితోటలో వింత పుట్టగొడుగు స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కోబ్బరి తోటలో మనిషి చేయిన పోలిన పుట్టుగొడుగు గుర్తించిన రైతు ఎవరో గుర్తుతెలియని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని తన తోటలో పాతిపెట్టారని హడలిపోయాడు. అనంతరం విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఇది పుట్టగొడుగు అని స్పష్టం చేశారు. వింత పుట్టగొడుగు విషయం ధావానంలా పాకడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇది చూడటానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. -
పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటే ఆ బాధ ఉండదు!
క్యాన్సర్ పూర్తిగా తగ్గిన వారిలో ఒక రకమైన మానసిక వేదన ఉంటుంది. అది పూర్తిగా తగ్గినా... అంతకు ముందు వారు క్యాన్సర్ వల్ల వచ్చిన షాక్ కారణంగా ‘ఎగ్జిస్టెన్షియల్ డిస్ట్రెస్’ అనే మానసిక సమస్యకు గురవుతారు. అత్యంత వేగంగా ప్రయాణం చేస్తున్న వాహనంలో ఉన్నవారు, ఆ వాహనం వేగం తగ్గాక కూడా ముందున్న ఉద్విగ్నతను అనుభవించినట్లుగా... క్యాన్సర్ తగ్గాక కూడా ఆ ముందు అనుభవించిన వేదనలో కొద్దికాలం కొనసాగుతారు. అయితే సిలోసైబన్ మష్రూమ్స్ అనే ఒక రకం పుట్టగొడుగులను ఆహారంగా తీసుకునే వారిలో ఈ సమస్య ఉండదని పేర్కొంటోంది ఒక హెల్త్ జర్నల్. దీన్ని ఆహారంగా తీసుకునేవారు లేదా దీని నుంచి దీని నుంచి తయారు చేసిన సైలోసైబిన్ అనే డ్రగ్‌తో కూడా ఇదే ప్రభావం ఉంటుందని పేర్కొంటోంది ‘హెల్త్ డే’ అనే హెల్త్ జర్నల్. సైలోసైబిన్‌ను తీసుకున్న వారు ఒక రకమైన హాయి గొలుపుతున్న ఫీలింగ్‌ను పొందుతుంటారు. అందుకే దీన్నే సెకెడైలిక్ మష్రూమ్ అని కూడా అంటారని చెబుతున్నారు ఆ జర్నల్‌కు చెందిన ప్రతినిధి స్టీవెన్ రెయిన్‌బర్గ్. మామూలుగానైతే సైలోసైబిన్‌ను నరాలకు సంబంధించిన జబ్బుల్లోనూ, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతలోనూ సాధారణంగా ఉపయోగిస్తుంటారు. అయితే అనేక మంది క్యాన్సర్ రోగుల నుంచి సేకరించిన వివరాలను బట్టి కీమోథెరపీ తర్వాత క్యాన్సర్ నయమైన రోగుల నుంచి తీసుకున్న వివరాల ఆధారంగా క్యాన్సర్ రోగులలోనూ ఇది ప్రభావపూర్వకంగా పనిచేస్తుందని తెలిసింది. దాంతో ఆ రసాయనం పుష్కలంగా ఉండే మ్యాజిక్ మష్రూమ్స్‌ను ఆహారం తీసుకోవడం వల్ల కూడా అదే ఫలితం దొరుకుతుందని పేర్కొంటోంది ఆ హెల్త్ జర్నల్. -
పే..ద్ద... పుట్టగొడుగు
పాడేరు రూరల్: విశాఖ జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి పంచాయతీ కోట్లగరువు గ్రామంలో ఓ నర్సరీలో ఐదున్నర కిలోల పుట్టగొడుగు లభ్యమైంది. దండు కేశ సాయిరాజుకు గ్రామంలో గోధుమగడ్డి నర్సరీ ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు అందులో పుట్టగొడుగులు మొలకెత్తాయి. శనివారం ఉదయం నర్సరీలో పనిచేస్తున్న వెంకటస్వామి అనే వ్యక్తి భారీ పుట్టగొడుగును శనివారం పాడేరుకు తీసుకొచ్చాడు. దాన్ని తూకం వేయగా ఐదున్నర కిలోలు ఉంది. పాడేరు ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు దానిని పరీక్షించి కూరగా వండుకోవచ్చని చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లారు. -
పుట్టగొడుగులు తిని ముగ్గురికి అస్వస్థత
సరవకోట (శ్రీకాకుళం) : పొలంలో దొరికిన పుట్టగొడుగులను కూర చేసుకుని తిని ముగ్గురు అస్వస్థత పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా సరవకోట మండలం బుడితి గ్రామంలో ఈ ఘటన జరిగింది. భారతి అనే మహిళ పొలంలో పుట్టగొడుగులు కనిపించగా వాటిని తీసుకొచ్చి సోమవారం ఉదయం కూర చేసింది. దానిని ఆమెతోపాటు పిల్లలు యయాత్(10), సంతోషి (13)లకు పెట్టింది. అనంతరం ఆమె పొలానికి వెళ్లగా, పిల్లలు స్కూల్‌కు వెళ్లారు. యయాత్, సంతోషిలకు స్కూల్లో వాంతులు కాగా, వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భారతికి కూడా పొలంలో వాంతులు అవుతుండడంతో ఆమెను కూడా ఆస్పత్రికి తరలించారు. -
మష్రూమ్... ఖుష్రూమ్!
పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా? మనలో చాలామందికి డౌట్. దీనికి సమాధానం... ఒకసారి తిని చూడ్డం! డీప్ మష్రూమ్ కర్రీ, మష్రూమ్ కర్రీ, రాజ్మా మష్రూమ్ కర్రీ, టొమాటో పాస్తా కర్రీ, కొరమీను మష్రూమ్ పొరటు... వీటిలో ఏం తిన్నా మీకు ఒకటే అనిపిస్తుంది ‘శాకాహరమైతేనేం? మాంసాహారమైతేనేం మష్రూమ్ ఇంత టేస్టుగా ఉంటే’ అని!! ఇవే కాదు... ఇంకా రకరకాల ప్రయోగాలను మీరు మష్రూమ్‌తో చెయ్యండి. ఈ ఆదివారం మీ డైనింగ్ హాల్ని... ఖుష్రూమ్గా మార్చండి. డీప్ మష్రూమ్ కర్రీ కావలసినవి: మష్రూమ్స్ - 2 కప్పులు చింతపండు - కొద్దిగా (నీళ్లలో నానబెట్టాలి) ఉప్పు - తగినంత గరంమసాలా - టీ స్పూను శనగపప్పు - టేబుల్ స్పూను మిరియాల పొడి - టీ స్పూను నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను ఎండుమిర్చి - 2 కొత్తిమీర - కొద్దిగా టొమాటో ముక్కలు - పావు కప్పు కరివేపాకు - 2 రెమ్మలు తయారి: చింతపండు గుజ్జు తీసి పక్కన ఉంచాలి బాణలిలో శనగపప్పు వేసి వేయించి మిరియాలపొడి జతచేసి కలిపి తీసేయాలి పాన్‌లో నూనె కాగాక కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాక టొమాటో ముక్కలు వేయించాలి. మష్రూమ్ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి, మూతపెట్టి, ఉడికించాలి చింతపండు గుజ్జు జత చేసి పది నిముషాలయ్యాక, గరం మసాలా వేసి 5 నిముషాలు ఉడికించి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్చేయాలి. అలసందలు మష్రూమ్ కర్రీ కావలసినవి: అలసందలు - 50 గ్రా. మష్రూమ్స్ - 200 గ్రా., ఉల్లితరుగు - పావు కప్పు టొమాటో తరుగు - అర కప్పు పచ్చిమిర్చితరుగు - 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, కారం - అర టీ స్పూను పసుపు - చిటికెడు, ధనియాల పొడి - అర టీ స్పూను, గరంమసాలా - టీ స్పూను, జీడిపప్పులు - 8 జీలకర్ర - టీ స్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి - టే బుల్ స్పూను, ఉప్పు - తగినంత తయారి: అలసందలను రెండు గంటలసేపు నానబెట్టి, కుకర్ లో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించి దించేయాలి పాన్‌లో నెయ్యి కరిగాక ఉల్లితరుగు వేయించి, అల్లంవెల్లుల్లి పేస్ట్ జతచేసి రెండు నిముషాలు వేయించి తీసి పక్కన ఉంచాలి ధనియాలపొడి, జీడిపప్పు, టొమాటో తరుగు, కారం, పసుపు, గరంమసాలా జతచేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి బాణలిలో నూనె కాగాక జీలకర్ర వేయించాలి మష్రూమ్ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు జత చేసి వేగాక మసాలా వేసి వేయించాలి ఉడికించిన అలసందలు, అర కప్పు నీరు వేసి మూత పెట్టి మంట తగ్గించాలి గ్రేవీ చిక్కగా అయిన తర్వాత దించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. మష్రూమ్ ఫ్రై కావలసినవి: మష్రూమ్ ముక్కలు - కప్పు, ఉల్లితరుగు - పావు కప్పు, ఉప్పు - తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, కొత్తిమీర - టీ స్పూను, కరివేపాకు పొడి - టీ స్పూను, నిమ్మరసం - టీ స్పూను, నూనె - 5 టేబుల్ స్పూన్లు, పసుపు - చిటికెడు తయారి: ఉప్పు కలిపిన వేడినీటిలో మష్రూమ్ ముక్కలను అర గంటసేపు నానబెట్టాలి బాణలిలో నూనె కాగాక ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి మష్రూమ్ ముక్కలు, మిరియాలపొడి, కరివేపాకు పొడి, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి వేయించాలి నిమ్మరసం జతచేసి రెండు నిముషాల తరువాత దించేయాలి. మష్రూమ్ టొమాటో పాస్తా కర్రీ కావలసినవి: పాస్తా /మాక్రోనీ/ మీల్మేకర్ - అర కప్పు, ఉప్పు - తగినంత, నానబెట్టిన మష్రూమ్ ముక్కలు - కప్పు, టొమాటోతరుగు - అర కప్పు, నూనె - 3 టేబుల్ స్పూన్లు, క్యాప్సికమ్ తరుగు - అర కప్పు, ఉల్లితరుగు - అర కప్పు, పుదీనా ఆకులు - అర కప్పు, వెల్లుల్లి రేకలు - 3, పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు - 10, బాదంపప్పులు - 6, ఏలకుల పొడి - టీ స్పూను, పసుపు - చిటికెడు, కారం - టీ స్పూను, ధనియాల పొడి - అర టీ స్పూను, గరంమసాలా - టీ స్పూను, కొత్తిమీర - తగినంత తయారి: గిన్నెలో పాస్తా, తగినంత నీరు, ఉప్పు వేసి కుకర్‌లో ఉంచి, నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి బాణలిలో టేబుల్ స్పూన్ నూనె కాగాక వెల్లుల్లి రేకలు వేయించాలి పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పులు, బాదం పప్పులు, ఏలకుల పొడి జత చేసి వేయించాలి ఉల్లితరుగు, టొమాటో తరుగు వేసి, మెత్తబడేవరకు వేయించి, దించేసి, చల్లారాక, ఈ మిశ్రమానికి పుదీనా ఆకులు జతచేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె కాగాక, క్యాప్సికమ్ తరుగు, ఉడికించిన పాస్తా, మష్రూమ్ ముక్కలు వేసి వేయించాలి కారం, పసుపు, ధనియాలపొడి, గరంమసాలా వేసి బాగా కలిపి, ముందుగా తయారుచేసి ఉంచుకున్న పేస్ట్ వేసి రెండు నిముషాలు ఉడికించాలి కొద్దిగా నీరు జత చేసి నాలుగైదు నిముషాలు ఉడికించి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. కొరమీను మష్రూమ్ పొరటు కావలసినవి: ఉడికించిన కొరమీనులు - కప్పు, మష్రూమ్ ముక్కలు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - టేబుల్ స్పూను, ఉల్లితరుగు - అర కప్పు, వెల్లుల్లి రేకలు - 6 అల్లం పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్ - 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం - టేబుల్ స్పూను, కరివేపాకు - ఒక రెమ్మ గరంమసాలా - అర టీ స్పూను, పసుపు - చిటికెడు ఉప్పు - తగినంత, నూనె - 4 టేబుల్ స్పూన్లు తయారి: బాణలిలో నూనె కాగాక ఉల్లి తరుగు వేసి బంగారురంగులోకి వచ్చేవరకు వేయించాలి అల్లం పేస్ట్, వెల్లుల్లి రేకలు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించి 5 నిముషాల తరవాత మష్రూమ్ ముక్కలు, ఉప్పు, పసుపు, నీరు జతచేసి మూత పెట్టాలి ముక్కలు ఉడికిన తర్వాత, ఉడికించి ఉంచుకున్న కొరమీనులు, సోయా సాస్ వేయాలి గరంమసాలా, నిమ్మరసం, కరివేపాకు వేసి రెండు నిముషాలు ఉంచి దించేయాలి. కర్టెసీ: రఘువీర్ కె.సి. హైదరాబాద్ సేకరణ: డా. వైజయంతి