మిణుగురు పురుగులు చీకట్లో వెలుగులు వెదజల్లుతూ ఎగురుతుంటాయి. ఈ పుట్టగొడుగులు కూడా మిణుగురుల్లాగానే చీకట్లో వెలుగులు వెదజల్లుతుంటాయి. రాత్రి పూర్తిగా చీకటి పడిన తర్వాత ఇవి ఆకుపచ్చ రంగులో వెలుగుతూ మిరుమిట్లు గొలుపుతాయి.
‘మైసీనీ క్లోరోఫాస్’ అనే ఈ పుట్టగొడుగులు పగటివేళ మిగిలిన పుట్టగొడుగుల మాదిరిగానే బూడిదరంగు గోధుమరంగు కలగలసిన రంగులో కనిపిస్తాయి. ఇవి భారత్, శ్రీలంక, తైవాన్, ఇండోనేసియా, పోలినేసియా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో కనిపిస్తాయి.
అమెరికన్ వృక్షశాస్త్రవేత్త చాల్స్ రైట్ 1854లో తొలిసారిగా వీటిని జపాన్‌లోని బోనిన్ దీవుల్లో గుర్తించాడు. ఈ పుట్టగొడుగుల కాండం 2–12 అంగుళాల వరకు ఉంటుంది. పైనున్న గొడుగు వంటి భాగం 1.2 అంగుళాల వరకు ఉంటుంది.
జపాన్‌లో దీనిని ‘యాకో టాకె’ అని అంటారు. అంటే, ‘రాత్రి దీపం’ అని అర్థం. రాత్రివేళ వెలుగుతూ ఆకర్షణీయంగా కనిపించే ఈ పుట్టగొడుగులు తినడానికి మాత్రం పనికిరావు. పొరపాటున తింటే, వీటిలోని విషపదార్థాలు ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment