రిచ్ ఫుడ్ కేంద్రంగా హైదరాబాద్
విదేశాల నుంచి అరుదైన పండ్లు,
స్పైసెస్ దిగుమతి బంజారాహిల్స్‌లో పారిస్
మల్హెర్బే ఆధ్వర్యంలోని ఫుడ్‌స్టోరీస్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అన్ని రంగాలతో పాటు ఆహార రంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. విభిన్న సంస్కృతుల సమ్మేళనంలో భాగంగా విభిన్న రకాల ఆహారానికీ నగరం కేంద్రంగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే బంజారాహిల్స్‌లో నూతనంగా ప్రారంభమైన ఫుడ్‌స్టోరీస్ వేదికగా అక్షరాల రూ.5 లక్షల విలువ చేసే పుట్టగొడుగు (మష్రూమ్) అందరినీ ఔరా అనిపిస్తోంది. కాంటినెంటల్ ఫుడ్‌తో విభిన్న ప్రాంతాలకు చెందిన ఆహార పదార్థాలకు నెలవైన నగరంలో మొట్టమొదటి సారి ఈ రిషీ మష్రూమ్ సందడి చేస్తోంది. పారిస్‌కు చెందిన ఆర్కిటెక్చరల్ ఏజెన్సీ మల్హెర్బే ఏర్పాటు చేసిన ఈ ప్రముఖ ఫుడ్‌స్టోరీస్ దేశంలో రెండోది కావడం విశేషం.
ఈ ఫుడ్‌స్టోరీస్ వేదికగా ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన డియోర్, మోయెట్–హెన్నెస్సీ, పారిస్ ఏరోపోర్ట్, గివెన్చీ వంటి బ్రాండ్‌లు సందడి చేస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన పండ్లు, సుగంధ ద్రవ్యాలు, లగ్జరీ జపనీస్ చాక్లెట్లు, గ్లోబల్ ప్యాంట్రీ, చీస్, మాంసాహార ఉత్పత్తులు ఆకర్షిస్తున్నాయి. ఫుడ్‌స్టోరీస్ కిచెన్ స్టూడియో ఫుడ్ లవర్స్‌ను అలరిస్తోందని సహ వ్యవస్థాపకురాలు అష్ని బియానీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8 వేలకు పైగా అత్యుత్తమ పదార్థాలను 4 గంటల్లోపు ఇంటికే డెలివరీ చేసే సేవలు ప్రారంభించామన్నారు.
ఇదీ చదవండి: అమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతో టాప్‌లో నిలిచాడు : సక్సెస్ స్టోరీ
Comments
Please login to add a commentAdd a comment