Variety
-
ఔరా! ఆ పుట్టగొడుగు.. ఐదు లక్షలట!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అన్ని రంగాలతో పాటు ఆహార రంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. విభిన్న సంస్కృతుల సమ్మేళనంలో భాగంగా విభిన్న రకాల ఆహారానికీ నగరం కేంద్రంగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే బంజారాహిల్స్‌లో నూతనంగా ప్రారంభమైన ఫుడ్‌స్టోరీస్ వేదికగా అక్షరాల రూ.5 లక్షల విలువ చేసే పుట్టగొడుగు (మష్రూమ్) అందరినీ ఔరా అనిపిస్తోంది. కాంటినెంటల్ ఫుడ్‌తో విభిన్న ప్రాంతాలకు చెందిన ఆహార పదార్థాలకు నెలవైన నగరంలో మొట్టమొదటి సారి ఈ రిషీ మష్రూమ్ సందడి చేస్తోంది. పారిస్‌కు చెందిన ఆర్కిటెక్చరల్ ఏజెన్సీ మల్హెర్బే ఏర్పాటు చేసిన ఈ ప్రముఖ ఫుడ్‌స్టోరీస్ దేశంలో రెండోది కావడం విశేషం. ఈ ఫుడ్‌స్టోరీస్ వేదికగా ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన డియోర్, మోయెట్–హెన్నెస్సీ, పారిస్ ఏరోపోర్ట్, గివెన్చీ వంటి బ్రాండ్లు సందడి చేస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన పండ్లు, సుగంధ ద్రవ్యాలు, లగ్జరీ జపనీస్ చాక్లెట్లు, గ్లోబల్ ప్యాంట్రీ, చీస్, మాంసాహార ఉత్పత్తులు ఆకర్షిస్తున్నాయి. ఫుడ్‌స్టోరీస్ కిచెన్ స్టూడియో ఫుడ్ లవర్స్‌ను అలరిస్తోందని సహ వ్యవస్థాపకురాలు అష్ని బియానీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8 వేలకు పైగా అత్యుత్తమ పదార్థాలను 4 గంటల్లోపు ఇంటికే డెలివరీ చేసే సేవలు ప్రారంభించామన్నారు. ఇదీ చదవండి: అమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతో టాప్‌లో నిలిచాడు : సక్సెస్ స్టోరీ -
మంకీ జాక్ గురించి విన్నారా? బోలెడన్ని పోషకాలు, ప్రయోజనాలు
మంకీ జాక్ మనకు అనువైన పంట. ఏడాదంతా ఆకులతో పచ్చగా, నిలువుగా పెరుగుతుంది. దీని కలప విలువైనది. పరికరాలు తదితర వస్తువులు తయారీకి వాడుతారు. మంకీ జాక్ పండు ఆరోగ్యకరమైనది. ఇందులో పోషక విలువలతో పాటు ఔషధ విలువలు కూడా ఉంటాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్న ఈ కాలంలో ఆగ్రో ఫారెస్ట్రీ పద్ధతిలో ఈ చెట్లను సాగు చేస్తూ.. ఈ చెట్లు అందించే పాక్షిక నీడలో ఇతర స్వల్పకాలిక పంటలు పండించుకోవచ్చు. వ్యవసాయానికి సుస్థిరత చేకూర్చటానికి మంకీ జాక్ చెట్లు ఎంతగానో దోహదపడతాయి. కలప కోసం పెంచే రైతుకు పండ్లు కూడా ఇస్తుంది. మంకీ జాక్‌ను బాదల్, దెఫల్, దావ్ లేదా లకూచ తదితర పేర్లతో పిలుస్తారు. ఆగ్రోఫారెస్ట్రీకి ఎంతగానో ఉపయోగపడే ఈ జాతి చెట్లు విస్మరణకు గురయ్యాయి. ఇకనైనా దృష్టి కేంద్రీకరించాల్సిన దీర్ఘకాలిక పంట ఇది. మంకీ జాక్ చెట్లుపర్యావరణరంగా, ఆర్థికపరంగానే కాక పోషకాహార స్థాయిని పెంపొందించడానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మంకీ జాక్ బొటానికల్ నేమ్ ఆర్టోకార్పస్ లకుచ (Artocarpus Lacucha) పనస, మల్బరీ కూడా ఇదే కుటుంబానికి చెందినవి. అందుకే మంకీ జాక్ పండు ఆకారం, దానిలో తొనలు, గింజలు పనసను పోలి ఉంటాయి. కాకపోతే కొంచెం చిన్నవి. భారత్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మయన్మార్‌లోని కొన్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో సైతం చక్కగా పెరిగే బహుళ ప్రయోజనకారి మంకీ జాక్ చెట్టు. నిటారుగా పెరిగే చెట్టు ఇది. అంతర పంటలతో కూడిన తోటల్లో ప్రధాన వృక్ష జాతిగా మంకీ జాక్ చెట్లను పెంచుకోవచ్చు. పర్యావరణపరమైన సమతుల్యతను కాపాడే అనేక ప్రయోజనాలు అందించటం మంకీ జాక్ చెట్ల ప్రత్యేకత. నిటారుగా 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు పెద్దగా, గట్టిగా ఉంటాయి. కొన్నిప్రాంతాల్లోఈ చెట్ల ఆకులు ఏడాదికి ఒకసారి రాలిపోతాయి. దీని పండ్లు మెత్తగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, పండినప్పుడు పసుపు రంగులోకి మారతాయి. ఈ చెట్టు బెరడు ముదురు రంగులో ఉంటాయి. దీని పూలు సువానతో తేనెటీగలను ఆకర్షిస్తూ పరపరాగ సంపర్కానికి దోహదపడుతూ ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఉన్నప్పటికీ మంకీ జాక్ చెట్ల పెంపకం పెద్దగా కనపడక΄ోవటం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో ఒక్కచోట తప్ప ఈ చెట్లు కనిపించవు. (ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!)పండ్లు తినొచ్చు.. పచ్చడి పెట్టుకోవచ్చు..మంకీ జాక్ కొత్త వాతావరణ పరిస్థితులకు, భిన్నమైన నేలలకు ఇట్టే అలవాటు పడిపోతుంది. ఏ ప్రాంతంలోనైనా ఇతర పంటలతో కలిపి సాగు చేయటానికి అనువైన జాతి ఇది. పండ్లు, పశుగ్రాసం, కలప, ఔషధ గుణాలు, సహజ రంగుగా వాడటానికి ఉపయోగపడే బెరడు వంటి ఉపయోగాలున్నాయి.మంకీ జాక్ పండును నేరుగా తినొచ్చు. పచ్చళ్లు, సాస్‌లు, చట్నీలు తయారు చేసుకోవచ్చు. ఈ పండ్ల గుజ్జు తింటే కాలేయ జబ్బులు తగ్గిపోతాయట. యాంటీఆక్సిడెంట్లతో పాటు కాలేయాన్ని రక్షించే గుణాలు పుష్కలంగా ఉండటం దీని ప్రత్యేకత. వయోభారం వల్ల చర్మం ముడతలు పడటం వంటి సమస్యల్ని దూరం చేసే చికిత్సల్లో దీన్ని వాడుతున్నారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీలో వాడుతున్నారు. జార్కండ్ వంటి చోట్ల గిరిజనుల సంప్రదాయ వైద్యంలో మంకీ జాక్‌ను ఉపయోగిస్తున్నారు. మంకీ జాక్ చెట్టు ఆకుల్లో ప్రొటీన్ అత్యధికంగా 28.6% ఉంటుంది. అందువల్ల ఈ ఆకులు పశువులకు అత్యంత విలువైన గ్రాసం అని చెప్పచ్చు. కాబట్టి పొడి పశువులపాల ఉత్పత్తిని పెంపొందించడానికి మంకీ జాక్ చెట్టు ఆకులు బాగా ఉపయోగపడతాయి. ప్రత్యేకించి ఎండా కాలంలో ఇతర పచ్చి మేత అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈ చెట్ల ఆకులు చక్కని పచ్చిమేతగా ఉపయోగపడతాయి. దీని బెరడు నుంచి వచ్చే జిగురు ఉపయోగకరం. అన్నిటికీ మించి దీని కలప ఎంత గట్టిగా ఉంటుందంటే చెద పురుగులు కూడా ఏమీ చేయలేవు. అందువల్ల కుర్చీలు, బల్లలు వంటి ఫర్నీచర్ తయారీలో దీని చెక్కను వాడుతున్నారు. పడవలు, నౌకల తయారీలో, నిర్మాణ రంగంలో కూడా ఈ కలపను ఉపయోగిస్తున్నారు.పర్యావరణ, పౌష్టికాహార ప్రయోజనాలుమంకీ జాక్ చెట్లు సుస్థిర వ్యవసాయ పద్ధతులకు అనేక విధాలుగా దోహదపడతాయి. భూసారాన్ని పెంపొందించటం, గాలికి వర్షానికి మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడటం, జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి ఈ చెట్లు దోహదపడతాయి. వేడిని, గాలిలో తేమను తట్టుకొని పెరుగుతాయి. తరచూ కరువు బారిన పడే నిస్సారమైన భూముల్లో సైతం ఈ చెట్లు పెరుగుతాయి. ఈ చెట్ల నీడ సానుకూల సూక్ష్మ వాతావరణాన్ని కలిగిస్తుంది కాబట్టి అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. ఇక పోషకాల సంగతికి వస్తే.. మంకీ జాక్ పండ్లు, ఆకులు పోషకాల గనులే. పండ్ల గుజ్జులో డయటరీ ఫైబర్, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విత్తనాలు, జిగురులో యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉన్నాయి. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణశక్తి ఇనుమడిస్తుంది. నాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎజెంట్‌గా పనిచేస్తుంది. ఈ గుణగణాలు మనుషులకు, పశువులకు ఆరోగ్యాన్నందిస్తాయి. తద్వారా పశువుల ఉత్పాదకత పెరుగుతుంది. పండ్ల ధర కిలో రూ. 175మంకీ జాక్ చెట్లు వర్షాధార వ్యవసాయం చేసే చిన్న,సన్నకారు రైతులకు మంచి ఆదాయాన్ని సమకూర్చుతాయి. ఒక చెట్టు ఆకుల నుంచి 200 కిలోల పచ్చి మేతను పొందవచ్చని, ఆ మేరకు పొడి పశువుల పోషణ ఖర్చు తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్ల పచ్చి ఆకులు క్వింటాలు రూ. 300 విలువ చేస్తాయి. పండ్లు కిలో రూ. 175 పలుకుతామంటున్నారు. చీడపీడలను తట్టుకునే స్వభావం కలిగిన ఈ చెట్లను పెంచటం చాలా సులభం. దీని కలప, పండ్ల ద్వారా కూడా ఇంకా ఆదాయం సమకూరుతుంది. మంకీ జాక్ చెట్లు రాల్చే ఆకులు భూమిని సారవంతం చేస్తాయి. అంటే రైతులు రసాయనాలపై ఆధారపడటం తగ్గుతుంది. అంతర పంటలకు అనువైన తోటల్లో పెంచడానికి మంకీ జాక్ చెట్లు ఎంతో అనువైనవి. భూతాపోన్నతితో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కలిగే అతివృష్టి, అనావృష్టిని తట్టుకునే స్వభావం, నిస్సారమైన భూముల్లోనూ పెరిగే స్వభావం ఈ చెట్లకు ఉండటం రైతులకు ఎంతో ఉపయోగపడే విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే, మంకీ జాక్ చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే గ్రామీణాభివృద్ధికి, పేదరికాన్ని పారదోలటానికి, పశుగ్రాసం కొరతను తీర్చడానికి, పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంపొందించడానికి బహువిధాలుగా ఉపయోగ పడుతుంది. -
ఇవేం పేర్లు బాబోయ్!.. రాజకీయ పార్టీలకు గమ్మత్తైన పేర్లు
ట్వంటీ20. హైటెక్. సాఫ్. సూపర్ నేషన్. జాగ్తే రహో... ఇవన్నీ ఏమిటా అనుకుంటున్నారా? రాజకీయ పార్టీల పేర్లు! వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజం. మన దేశంలో ఆరు జాతీయ పార్టీలు, 57 రాష్ట్ర పార్టీలున్నాయి. వీటి పేర్లు మనం తరచూ వినేవే. వీటితో పాటు భారత్‌లో ఏకంగా 2,597 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో వినడానికే గమ్మత్తైన, ఆసక్తికరమైన, పేర్లున్న పార్టీలకు కొదవ లేదు. కాకపోతే వీటిలో చాలావరకు ఎన్నికల సమయంలో తప్ప పెద్దగా తెరపైకే రావు. పార్టీ పెట్టడం యమా ఈజీ మన దేశంలో పార్టీ పెట్టడం సులువైన పని. రూ.10 వేలు డిపాజిట్, 100 మంది సభ్యుల మద్దతుంటే చాలు... పార్టీ పెట్టేయొచ్చు. ఏ మతాన్నో, కులాన్నో, ప్రాంతాన్నో కించపరిచేలా లేకపోతే చాలు. దాంతో దేశవ్యాప్తంగా ఇలా వేలాది పార్టీలు పుట్టుకొచ్చాయి. వాటిలో గమ్మత్తైన పేర్లకూ కొదవ లేదు. ఇండియన్ లవర్స్ పార్టీ, ఇండియన్ ఓషియానిక్ పార్టీ, లైఫ్ పీస్ఫుల్ పార్టీ, హోలీ బ్లెస్సింగ్ పీపుల్స్ పార్టీ, లేబర్ అండ్ జాబ్ సీకర్స్ పార్టీ, అఖిల భారతీయ భారత్‌మాతా–పుత్రపక్ష, భారతీయ మొహబ్బత్ పార్టీ, మినిస్టీరియల్ సిస్టం అబాలిషన్ పార్టీ, ఆల్ పెన్షనర్స్ పార్టీ, తమిళ్ తెలుగు నేషనల్ పార్టీ, ఇండియన్ విక్టరీ పార్టీ, ఇంటర్నేషనల్ పార్టీ, చిల్డ్రన్ ఫస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, చాలెంజర్స్ పార్టీ, స్వచ్ఛ భారత్ పార్టీ, సత్యయుగ్ పార్టీ, ఇన్సానియత్ పార్టీ, నేషనల్ టైగర్ పార్టీ, మర్యాదీ దళ్... ఇలా ఈ జాబితా చాంతాడును మించిపోతుంది. ప్రధాని మోదీ ఇటీవల పదేపదే ప్రస్తావిస్తున్న నారీ శక్తి పేరుతో కూడా ఒక పార్టీ ఉంది! ఆమ్ ఆద్మీ పార్టీని తలపించేలా గరీబ్ ఆద్మీ పేరుతో కూడా ఒక పార్టీ ఉంది. ఇక, ద రిలిజియన్ ఆఫ్ మ్యాన్ రివాల్వింగ్ పొలిటికల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ పేరునైతే వీటికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు! అయితే ఈ పార్టీల్లో చాలావరకు వ్యవస్థపై తమ అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసేందుకు, ఆదర్శ సమాజ స్వప్నానికి రూపమిచ్చేందుకు వాటి వ్యవస్థాపకులు చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. రైట్ టు రీకాల్! ...అంటే తమకు నచ్చని ప్రజాప్రతినిధిని చట్టసభ నుంచి తప్పించే హక్కు. భారత్‌లో లేకున్నా చాలా దేశాల్లో ఈ హక్కుంది. కాకపోతే యూపీలో రాకేశ్ సూరి అనే 42 ఏళ్ల కంప్యూటర్ ఆపరేటర్ ఈ పేరుతో ఏకంగా పార్టీయే పెట్టారు. హామీలు నెరవేర్చని ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే ప్రతిపాదనపై పౌరులకు అవగాహన కల్పించడమే ఆయన లక్ష్యమట. అన్నట్టూ, ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఘాజియాబాద్ నుంచి ఆయన పోటీ కూడా చేస్తున్నారు! యూపీలో ఇలాంటి భిన్నమైన పేర్లతో కూడిన పార్టీలకు కొదవ లేదు. సబ్ సే అచ్ఛీ అనే పార్టీ కూడా అక్కడ ఉనికిలో ఉంది. తొలుత దీని పేరు ఇస్లామిక్ డెమోక్రటిక్ పార్టీ. మతపరమైనదిగా ఉందంటూ అభ్యంతరాలు రావడంతో ఇలా మార్చేశారన్నమాట! ఆప్ కీ అప్నీ పార్టీ (పీపుల్స్), సుభాష్ వాదీ భారతీయ సమాజ్‌వాదీ పార్టీ వంటి పార్టీలు కూడా యూపీలో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫుట్‌బాల్ ఇలా కూడా ఆడొచ్చా? ఎప్పుడూ చూడలేదే!
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఆట ఫుట్‌బాల్. ఈ ఆటలో క్రీడాకారులు మైదానంలో చిరుతల్లా పరిగెత్తుతూఅద్భుతమైన గోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. నియమిత సమయంలో ఏ జట్టు అయితే ఎక్కువ గోల్స్ చేస్తారో వాళ్లను విజేతలుగా నిర్ణయిస్తారు. ఇదంతా.. ఇప్పటివరకు మనకు తెలిసిన ఫుట్‌బాల్ గేమ్. కానీ ఇప్పుడు ఓ వెరైటీ ఫుట్‌బాల్ గేమ్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే.. సాధారణంగా ఫుట్‌బాల్ ఆడాలంటే జట్టుకు 11మంది సభ్యులు ఉంటారు. కానీ ఈ వెరైటీ ఫుట్‌బాల్‌లో మాత్రం కేవలం ఇద్దరి మధ్యే పోటీ ఉంటుంది. ఇక వీళ్లకు వందల అడుగుల విస్తీర్ణం ఉన్న మైదానం కూడా అవసరం లేదు. కేవలం రెండు టేబుల్స్ పట్టేంత స్థలం ఉంటే చాలు. అయితే ఫుట్‌బాల్ గేమ్ మాదిరిగా వీళ్లు కూడా బంతిని చేతితో తాకకుండా కాలితో తమ ప్రత్యర్థి సెట్లోకి ఎవరైతే ఎక్కువ సార్లు బంతిని వేస్తారో వాళ్లే విజేతలుగా పరిగణించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.దీంతో.. ఫుట్‌బాల్‌ను ఇలా కూడా ఆడతారా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. గ్లాస్ ఫుట్బాల్ని ఎప్పుడూ చూడలేదు. భలే వెరైటీగా ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. Legend game pic.twitter.com/gLC6jzFJ3R — Enezator (@Enezator) November 3, 2023 -
అంత పెద్ద పేరా.. కుదరదు
మాడ్రిడ్: స్పెయిన్‌లోని ఓ రాచకుటుంబానికి చెందిన రాకుమారుడు తన కుమార్తెకు ఏకంగా 157 అక్షరాలతో సుదీర్ఘంగా ఉండే వెరైటీ పేరు పెట్టారు. స్పెయిన్‌లోని ఆల్బా రాజ్య వారసుడు, 17వ హ్యూస్కర్ డ్యూక్ ఫెర్నాండో ఫిట్జ్–జేమ్స్ స్టువర్ట్, సోఫియా దంపతులకు ఇటీవల కూతురు జన్మించింది. ఫెర్నాండో ఆమెకు ప్రత్యేకంగా ఉండే ఏకంగా 25 పదాలు, 157 అక్షరాలతో కూడిన.. పొడవాటి పేరు పెట్టారు. అదేమిటంటే.. సోఫియా ఫెర్నాండా డొలొరెస్ కయెటనా టెరెసా ఏంజెలా డీ లా క్రుజ్ మికేలా డెల్ శాంటిసిమో సక్రామెంటో డెల్ పర్పెటువో సొకొర్రో డీ లా శాంటిసిమా ట్రినిడాడ్ వై డీ టొడొస్ లాస్ సాంటోస్’. ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ పేరును అధికారికంగా రిజిస్టర్ చేసేందుకు స్పెయిన్ అధికారులు మాత్రం అంగీకరించడంలేదు. నిబంధనలకు లోబడి చిన్నగా ఉండే పేరును కూతురికి పెట్టుకోవాలని, అప్పుడే రికార్డుల్లో నమోదు చేస్తామని రాకుమారుడికి అధికారులు సూచించారు. దీనిపై రాకుమారుడు స్పందించాల్సి ఉంది. -
‘నా పొట్ట.. నా ఇష్టం’.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న రెస్టారెంట్
కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే పబ్లిసిటీ చాలా అవసరం. ట్రెండ్‌కు తగ్గట్లు కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈమధ్య రెస్టారెంట్ బిజినెస్‌కి డిమాండ్ బాగా పెరిగింది. డిఫరెంట్ థీమ్స్‌తో,క్యాచీ నేమ్స్‌తో వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. కొన్ని రెస్టారెంట్ పేర్లు అయితే ఒక్కసారి చదివితే గుర్తుండేలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. వెరైటీ పేర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. తాజాగా మరో రెస్టారెంట్ పేరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవలె ప్రారంభమన ఆ రెస్టారెంట్ పేరు వింటే నవ్వు ఆపుకోలేరు. లేటెస్ట్గా ‘నా పొట్ట నా ఇష్టం’ అనే రెస్టారెంట్ పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఈ రెస్టారెంట్ పేరుపై పలు ఫన్నీ మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ రెస్టారెంట్ రాజమండ్రిలోని దానవాయిపేటలో ఉంది. ఇదే పేరుతో మరో రెస్టారెంట్ జగిత్యాలలో ఉంది. దానిపై సరదా కవిత్వాలు అల్లేస్తున్నారు. “నా పొట్ట నా ఇష్టం” 😂 చూడూ - చూడకపో నీ ఇష్టం తినడం నా అభీష్టం 😃 నే తినకపోతే హోటెల్ వాడికి నష్టం 😪 మధ్యలో నీకేమిటి కష్టం? 🤔 భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు వినూత్న ఐడియాలతో రెస్టారెంట్ ఓనర్స్ తెగ ట్రై చేస్తున్నారు. మొదట్లో ఓ హోటల్ ప్రారంభిస్తే అక్కడి టేస్ట్, క్వాలిటీ బావుంటే ఆటోమెటిక్‌గా వ్యాపారం పుంజుకునేది. కానీ ప్రస్తుతం నిర్వాహకులు మౌత్ పబ్లిసిటీకే సై అంటున్నారు. క్రియేటివిటీతో కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తమ రెస్టారెంట్లకు డిఫరెంట్ పేర్లు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ప్రయత్నిస్తారు. ఇలా గతంలోనూ..తిందాంరా మామ, తిన్నంత భోజనం, పాలమూరు గ్రిల్స్, వివాహ భోజనంబు, సుబ్బయ్యగారి హోటల్, బాబాయ్ భోజనం, రాయలసీమ రుచులు, ఉలవచారు, నాటుకోడి, మాయాబజార్,రాజుగారి పులావ్, ఘుమఘుమలు,నిరుద్యోగి ఎంఏ, బీఈడి, కోడికూర చిల్లు వంటి వెరైటీ రెస్టారెంట్ల పేర్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో కనిపించే వెరైటీ టైటిల్స్ - హోటల్స్ తిన్నంత భోజనం - నాగోల్ మెట్రో ఉప్పు కారం - కొండాపూర్ కోడికూర, చిట్టిగారె - జూబ్లీ హిల్స్ రాజుగారి రుచులు - కొండాపూర్ వివాహ భోజనంబు - జూబ్లీ హిల్స్ దిబ్బ రొట్టి - మణికొండ అరిటాకు భోజనం - అమీర్ పేట వియ్యాలవారి విందు - ఎల్బీనగర్ తాలింపు - అమీర్ పేట తినేసి పో - కొంపల్లి బకాసుర - AS రావు నగర్ అద్భుతః - దిల్సుఖ్ నగర్ -
టీ–17 పందులు సూపర్.. నెలకు లక్షకు పైగా నికరాదాయం!
తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించే సీమ పందుల పెంపకంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పందుల పరిశోధనా కేంద్రం ఎస్వీవీయూ టీ–17 రకం సీమ పందుల జాతిని అభివృద్ధి చేసింది. శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ ఈ జాతి పందులను పెంచుతున్న రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. యువ రైతులు సైతం ఆసక్తి చూపుతుండటం విశేషం. పంది మాంసాన్ని ‘పోర్క్’ అంటారు. కండ (హమ్), వారు (బాకన్), సాసెజ్, నగ్గెట్స్, ప్యాట్టీస్, పోర్క్ పచ్చడి, బ్యాంబూ పోర్క్ల రూపంలో సీమ పంది ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. వీటిలో మాంసకృత్తులు, విటమిన్లతో పాటు ఓలిక్ లినోలిక్ ఫాటీయాసిడ్స్ అధికంగా ఉంటాయి. పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులకు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి సీమ పంది మాంసం ఉత్పత్తులు ఉపయోగపడతాయని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. పందుల పెంపకాన్ని లాభదాయకం చేయడంతో పాటు కొత్త పంది రకాల అభివృద్ధికి తిరుపతిలోని పరిశోధనా కేంద్రం గడిచిన ఐదు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. స్థానికంగా లభ్యమయ్యే వివిధ వ్యవసాయ ఉప ఉత్పత్తులను 10–15 శాతం వరకు పందుల దాణా తయారీకి వినియోగించి ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. పందులకు సంక్రమించే మేంజ్ అనే చర్మ వ్యాధికి డోరోమెక్టిన్ అనే ఔషధాన్ని కనిపెట్టారు. 20 శాతం మంది పోర్క్ తింటున్నారు దేశంలో 9 లక్షల మిలియన్ల పందులుంటే, ఆంధ్రప్రదేశ్‌లో 92 వేలున్నాయి. దేశంలో 22 శాతం మంది, రాష్ట్రంలో 11 శాతం మంది పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ మాంసాహారుల్లో పంది మాంసం తినే వారి సంఖ్య 18–20 శాతం ఉన్నారని అంచనా. ఏటా రూ.18 కోట్ల విలువైన 894 టన్నుల పంది మాంసం ఉత్పత్తులు మన దేశం నుంచి వియత్నాం, కాంగో, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతవుతున్నాయి. ఒక పంది... 80 పిల్లలు... ఐదేళ్ల క్రితం విదేశీ జాతి పందులతో దేశవాళీ పందులను సంకరపరిచి ఎస్వీవీయూ టీ–17 (75 శాతం లార్జ్‌వైట్ యార్క్‌షైరు, 25 శాతం దేశవాళీ పంది) అనే కొత్త పంది జాతిని అభివృద్ధి చేశారు. వాడుకలో సీమ పందిగా పిలిచే వీటి పెంపకంపై రైతులు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. జీవిత కాలంలో ఈతకు 8 చొప్పున 10 ఈతల్లో 80 పిల్లలను పెడుతుంది. పుట్టినప్పుడు 1.12 కేజీలుండే ఈ పంది పిల్ల వధించే సమయానికి 85 కేజీల వరకు బరువు పెరుగుతుంది. పది ఆడ, ఒక మగ పందిని కలిపి ఒక యూనిట్‌గా వ్యవహరిస్తారు. కేంద్రం నుంచి అభివృద్ధి చేసిన పందులకు సంబంధించి 400 యూనిట్లను రైతులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఏపీలో రైతుల దగ్గర 20 వేల పైగా ఈ రకం పందులు పెరుగుతున్నాయి. ఒక యూనిట్ దేశవాళీ పందుల పెంపకం ద్వారా సగటున ఏటా రూ. 3–3.5 లక్షల ఆదాయం వస్తుంటే, ఈ రకం సీమ పందుల పెంపకం ద్వారా రూ. 6–7 లక్షల ఆదాయం వస్తుంది. మాంసం రూపంలో అమ్మితే రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి నెలకు రూ. లక్షకు పైగా నికరాదాయం నేనో సాప్ట్వేర్ ఉద్యోగిని. రెండేళ్లుగా పశుపోషణ చేస్తున్నా. గతేడాది తిరుపతి పందుల పరిశోధనా కేంద్రం నుంచి 15 పిల్లలతో పాటు 5 పెద్ద పందులను కొని పెంపకం చేపట్టా. హాస్టళ్లు, హోటళ్ల నుంచి సేకరించే పదార్థాలను పందులకు మేపుతున్నాం. చూడి/పాలిచ్చే పందులకు విడిగా దాణా పెడతున్నా. నెలకు రూ. 49,400 ఖర్చవుతోంది. మాంసం ద్వారా రూ.1.40 లక్షలు, పంది పిల్లల అమ్మకం ద్వారా రూ.13,500 ఆదాయం వస్తోంది. ఖర్చులు పోను నెలకు రూ.లక్షకు పైగా నికరాదాయం వస్తోంది. పందుల పెంపకం లాభదాయకంగా ఉంది. – సుంకర రామకృష్ణ, నూజివీడు, ఎన్టీఆర్ జిల్లా మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తే... నేనో సాప్ట్వేర్ ఉద్యోగిని. పందుల పెంపకంపై ఆసక్తితో తిరుపతి పరిశోధనా కేంద్రంలో శిక్షణ పొందాను. ఈ పరిశ్రమ ఎంతో లాభసాటిగా ఉందని గ్రహించాను. త్వరలో పందుల పెంపకం యూనిట్ పెడుతున్నా. మార్కెటింగ్‌పై మరింత అవగాహన కల్పిస్తే యువత ఆసక్తి కనపరుస్తారు. –జి.మహేష్, గాజులమండ్యం, తిరుపతి జిల్లా పొరుగు రాష్ట్రాల రైతుల ఆసక్తి శాస్త్రీయ పద్ధతుల్లో సీమ పందుల పెంపకంపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాం. ఎస్వీవీయూ టీ–17 జాతి పందులకు మంచి డిమాండ్ ఉంది. పొరుగు రాష్ట్రాల రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పెంపకంలో మెళకువలతో పాటు వీటికి సంక్రమించే వ్యాధులను గుర్తించి తగిన చికిత్స, నివారణా చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పంది మాంసం ఉత్పత్తుల్లో ఉండే పోషక విలువలపై వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ కే.సర్జన్‌రావు (99890 51549), పరిశోధనా సంచాలకులు, ఎస్వీవీయూ, తిరుపతి రైతులకు నిరంతర శిక్షణ తిరుపతిలో పందుల పరిశోధనా కేంద్రం ఏర్పాటై 50 ఏళ్లవుతోంది. తాజాగా విడుదల చేసిన ఎస్వీవీయూ టీ–17 రకం పంది జాతికి మంచి డిమాండ్ ఉంది. దేశవాళీ పందులతో పోల్చుకుంటే రెట్టింపు ఆదాయం వస్తుంది. వీటి పెంపకంపై ఆసక్తి గల యువతకు, రైతులకు ఏడాది పొడవునా శిక్షణ ఇస్తున్నాం. –డాక్టర్ ఎం.కళ్యాణ్ చక్రవర్తి (94405 28060), సీనియర్ శాస్త్రవేత్త, అఖిల భారత పందుల పరిశోధనా కేంద్రం, తిరుపతి -
మంచి మాట: జీవనమధురిమలు
ప్రతి ఒక్కరి జీవితంలో మాధుర్యముంటుంది. కానీ, దానిని చేరుకునే సోపానం ఒకటి కాదు అనేక రకాలు. మనకి అనువైనదేదో తెలియచేప్పేది మన జీవిత నేపథ్యం. ఈ జీవన మాధుర్యానుభూతి.. స్థాయి.. గాఢతలను నిర్ణయించేది మన జీవిత దృక్పథం.. వైఖరి.. భావన. సుఖం.. సంతోషం .. ఆనందం వీటి భావన, అనుభూతి మనందరిలో ఒకే రకంగా ఉండదు. జీవన మాధుర్యమూ అంతే! కొందరికి ఐశ్వర్యం జీవన మాధుర్యం. మరికొందరికి పుస్తకాలు. అందమైన ప్రకృతి, పరోపకారం .. జీవితార్థ శోధన.. ఆధ్యాత్మికత, జీవాత్మ – పరమాత్మల సంబంధ, సంయోగ యోచన, వృత్తి, హోదా... సజ్జన సాంగత్యం.. ఇలా అనేకానేక ఆలోచనలు జీవన మాధుర్యంలోని విభిన్నతను, వైవిధ్యతను సూచిస్తున్నాయి. లోకో భిన్న రుచిః. చెరుకు తియ్యగా ఉంటుంది. ఇది మనకందరకు తెలుసు. ఈ భావన అనుభవంలోకి రావాలంటే చెరకు గడ మీద ఉండే మందపాటి పెచ్చును తీసి, ముక్కను కొరికి నమలాలి. అపుడు కొద్దిగా తీపిదనం తెలుస్తుంది. ఎంత బాగా నమిలితే అంతటి రసం.. అంతటి తీపి. అలాగే జీవితం కూడ. ఇదీ చెరకు గడే.. ఎలా జీవించాలో తెలుసుకోవాలి. అనుభవించటం తెలియాలి. అనుభవించినకొద్దీ జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది. క్షీరసాగర మధనం తరువాతే అమృతం లభించింది. దానిని మన జీవితంలో వెతికి పట్టుకోగలిగే చూపు.. నేర్పు కావాలి. లేనప్పుడు ఎవరైనా గురువును పెద్దల్ని.. అనుభవజ్ఞుల్ని ఆశ్రయించాలి. మధుపం అనేక పుష్పాలమీద వాలి.. వాటిలోని మకరందాన్ని ఆహారంగా స్వీకరిస్తుంది. తేనె అన్ని పుష్పాలలో ఉండదు. వేటిలో ఉంటుందో దానికి తెలుసు. వాటి మీద వాలి వాటి నుంచి తేనెను పీల్చుకుంటుంది. జీవిత పుష్పంలోని మకరందాన్ని ఆస్వాదించాలంటే అది ఎలా ఎక్కడ ఏ రూపంలో ఉందో తీసుకోగలగాలి. దాన్ని అందుకోవాలి. జీవితంలోని తీపిని మనకు తెలియచెప్పేది కుటుంబం. ఇది ప్రధాన సాధనం. బంధాలు – అనుబంధాలలోని తీయదనపు రుచి తెలుసుకున్న తరువాత స్నేహం ఆ రుచిని మరింత పెంచుతుంది. మన ఇంటి ఆవరణలో... మన వీధిలో ఉండే వాళ్ళతో సావాసం ఓ అద్భుత మధురసమే. తరువాత విద్యాభ్యాస కాలంలో స్నేహితులు, కాకి ఎంగిళ్ల తిళ్ళు.. మధ్యాహ్న భోజనాలలో పంచుళ్లు, వారితో గిల్లికజ్జాలు.. మౌనవ్రతాలు..ఊరేగటాలతో పాటు విద్యలో అసూయ.. ఒకరినొకరు దాటి వెళ్లాలనుకునే పోటీ తత్వం... సాహసాలు.. దుస్సాహసాలు ... ఇలా ఎన్ని మధురిమలు! గుండె పట్టలేనన్ని! ఇవి అనుభవించిన కాలంలోనే కాక తరువాతి కాలంలో కూడ నెమరువేసుకునే జ్ఞాపకాల తీపి ఊటలవుతాయి. ఒంటరితనంలో, మనసు శూన్యమైన సమయంలో.. గాయపడిన వేళ.. ఈ మధురిమలు ఎంత ఊరటనిస్తాయి! మనసు అతలాకుతలం కాకుండా కాపాడి మనల్ని నిలబెడతాయి. జీవన మాధుర్యాన్ని తెలుసుకుని.. దాన్ని అనుభవించేవారు విద్వాంసులే కానక్కర లేదు. వారు విద్యావిహీనులు కావచ్చు. సామాన్యులూ కావచ్చు. ఎవరైతే ఆ రుచిని ఒడిసి పట్టుకుని ఆస్వాదిస్తారో వారే గొప్ప వేదాంతులు.. యోగులు.. . సత్యశోధకులు. జీవిత మాధుర్యాన్ని తెలుసుకుని అనుభవించటమే జీవన రహస్యం. ఏమిటది? రెండక్షరాలలో ఉంటుందది. అదే.. తృప్తి... వివాహానంతరం ఒక స్త్రీ.. పురుషుడు దాంపత్యమనే నావలో జీవనసాగరంలో ప్రయాణం చేయాలి. ఆరంభపు అనురాగం అంబరమే. ఈ ఆనందపు తీపి గురుతులు మనస్సుకెంత ఉల్లాసాన్ని.. ఉత్సాహాన్ని... హాయిని ఇస్తాయో! భార్యాభర్తల దాంపత్యపు తీయని ఫలాలే పిల్లలు. వారి పెంపకం.. ముద్దుమురిపాలు.. ఆపై వీరి వివాహం. మేము సైతం మీ జీవన మాధుర్యానికంటూ వచ్చేవాళ్లే కదా మనవలు.. మనవరాళ్లు. వివాహం వల్ల ఒనగూరే మధురిమలెన్నెన్నో ! రోహిణి కార్తె చండ్ర నిప్పులు తరువాత పలుకరించే తొలకరి జల్లులో ఒక ఆనందముంది. బాగా వేడెక్కిన భూమిని వానచుక్క చుంబించిన తరుణాన అవనినుండి వచ్చే మట్టి వాసనే అది. శీతాకాలపు ఉషోదయాన మంచు కురిసిన పచ్చిక మీద పాదాలుంచిన క్షణం.. ఓహ్... అది ఎంతటి హాయిని... ఆహ్లాదాన్ని ఆనందాన్నిస్తుంది! పిల్ల తెమ్మర మన నాసికకు చేరవేసే పూల సుగంధం కూడ ఒక జీవన మధురిమే. ఇలా మనకి ఆనందాన్నిచ్చేవన్నీ మన జీవన మాధుర్యాన్ని పెంచేవే. ఈ జీవన మధురిమలు ఎవరికైనా సొంతమే. ఎవరైనా ఆనందించవచ్చు. కావలసినది కొంచెం స్పృహ. తపన. అన్వేషణ. జీవిత అంతరార్థాన్ని, తనలోని అంతర్యామిని అర్థం చేసుకుంటూ ఆ సర్వాంతర్యామిని ఈ సకల చరాచర సృష్టిలో చూసే ప్రయత్నం కొందరు చేస్తారు. ఇదే వారి దృష్టిలో మానవ జీవితంలోని మాధుర్యాన్ని చూపగలిగే మార్గం. ఇదే గొప్పదైనది. ఇదే అసలైనది అని వారి భావన. భగవంతుడి తత్వాన్ని అవగతం చేసుకునే ఓ అద్భుతమైన సోపానం. మానవ సేవలో అంకితమవ్వటం మాధవ సేవే కదా! మంచి చేసేది... మంచిని పెంచేది ప్రతిదీ మాధుర్యాన్ని పంచి ఇచ్చేదే. జీవితంలోని మాధుర్యాన్ని దర్శించాలంటే బాధలను, కష్టాలను దూరంగా ఉంచి, ఆనందకరమైన జ్ఞాపకాలను సదా మననం చేసుకుంటూ ఉండాలి. చెడ్డవారిలోనూ మంచిని చూడగలగాలి. చేదులోను తీపిని చూసే మానసిక స్థితిని పెంచుకోవాలి. అప్పుడు సృష్టి అంతా మధురంగానే ఉంటుంది. – లలితా వాసంతి -
వెరైటీ క్రైమ్: 2021లో ఎన్నెన్ని వింతలో.. ఇదెక్కడి గోలరా బాబూ..
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో హత్యలు, హత్యాయత్నాలు, బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, భారీ చోరీలు వంటి సంచలనాత్మక నేరాలు నమోదవుతూనే ఉంటాయి. వీటిని నిత్యం చూస్తూనే ఉంటాం. వీటితో పాటు అంతగా ప్రాచుర్యానికి నోచుకోని వెరైటీ నేరాలు కూడా నమోదవుతూ ఉంటాయి. కొన్ని కేసులను తమ విధుల్లో భాగమనుకుంటూ పోలీసులు ఇష్టంతో చేసినా... ఇదెక్కడి గోలరా బాబూ అనుకుంటూ కష్టంగా భావించినా ఈ తరహా కేసుల్నీ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. వీటిలో అత్యధికం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఠాణాల పరిధిలో చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది చోటు చేసుకున్న వాటిలో ఈ కోవలోకి వచ్చే కేసుల్లో కొన్ని... చదవండి: జపాన్ నుంచి నెహ్రూ జూ పార్క్‌కు అరుదైన అతిథులు! జనవరిలోనే.. తనది పోయిందని మరొకరిది... సాధారణంగా ఎవరైనా తమ వస్తువు పోతే వీలున్నంత వరకు వెతికి విలువైనది అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. లేని పక్షంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని వదిలేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మూల సునీల్ కుమార్ తన బ్యాగ్ పోయినందుకు మరోటి చోరీ చేసి చిక్కాడు. ఇతగాడు రైల్లో వస్తూ తన బ్యాగ్ పోగొట్టుకున్నాడు. ఈ నష్టం పూడ్చుకునేందుకు విజయనగరం నుంచి వచ్చిన శివశంకర్ అనే వ్యక్తిది చోరీ చేశాడు. బాధితుడు రైల్వే పోలీసులను ఆశ్రయించడంతో సీసీ కెమెరాల ఆధారంగా చిక్కి జైలుకు వెళ్లాడు. నేరం చేస్తుండగా నిద్రొచ్చేసింది.. ఓ టార్గెట్‌ను ఎంచుకుని అక్కడ చోరీ చేయాలని భావించిన దొంగలు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తారు. రెక్కీ తర్వాత ‘పని’లోకి దిగి చడీచప్పుడు కాకుండా పూర్తి చేస్తారు. ఆపై ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా ఉడాయించేస్తారు. అయితే చాంద్రాయణగుట్ట పరిధిలోని ఆలయంలో చోరీ చేసిన బాలుడు మాత్రం అందులోనే బజ్జుని చిక్కాడు. ఓ బాలుడు శ్రీశైలం రహదారిపై ఉన్న శ్రీరామాలయంలో చోరీకి వచ్చాడు. అర్థరాత్రి శ్లాబ్ నుంచి మెట్ల మార్గంలో లోపలకు ప్రవేశించాడు. అక్కడి హుండీ, అల్మారా తాళాలు పగులకొట్టి సొత్తును సంచిలో వేసుకున్నాడు. ఇంత వరకు అంతా అతడు అనుకు న్నట్లే జరిగినా... ఈ పనితో అలసిపోయాడో ఏమో అక్కడే నిద్రపోయాడు. ఉదయం వచ్చిన పూజారి బాలుడిని, అతడితో ఉన్న సంచిలో సొత్తును చూసి పోలీసులకు అప్పగించాడు. మూత్రం తెచ్చిన తంటా... దేవరకొండ బస్తీలో మూత్ర విసర్జన రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ఆ బస్తీకి చెందిన ఓ యువకుడు ఓ రోజు రాత్రి ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన చేస్తున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఇతడిని మందలించాడు. ఇరువురి మధ్యా మాటామాటా పెరిగి వాగ్వాదం మొదలైంది. కొద్దిసేపటికే ఇద్దరి స్నేహితులూ అక్కడకు చేరుకుని రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఇది పరస్పర దాడుల వరకు వెళ్లింది. విషయం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరడంతో రెండు వర్గాలకు చెందిన 17 మందిపై కేసు నమోదైంది. కాస్త అడ్వాన్స్ అయ్యాడు.. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత నుంచో భార్యలకు భర్తలు, అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు ఎదురైన కేసులు ఎన్నో చూస్తుంటాం. అయితే కర్నూలు జిల్లాకు చెందిన మనోజ్‌కుమార్‌రెడ్డి మాత్రం ‘అడ్వాన్స్’ అయిపోయాడు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా కేపీహెచ్‌బీ రెండో ఫేజ్‌కు చెందిన యువతితో వివాహం కుదిరింది. ఐదెకరాల భూమి, మరో రూ.25 లక్షల విలువైన స్థలం కట్నంగా ఇచ్చేలా ఒప్పందం తర్వాత నిశి్చతార్థం కూడా జరిగింది. కర్ణాటకలోని బేలూరులో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న ఇతడి మనస్సు పెళ్లికి ముందే మారిపోయింది. అదనంగా ఐదెకరాలు ఇస్తేనే తాళి కడతానంటూ యువతితో పాటు ఆమె తల్లిదండ్రులనూ ఫోన్ ద్వారా వేధిస్తూ బెదిరింపులకు దిగాడు. ఫిర్యాదుతో చివరకు జైలు గడప తొక్కాడు. భయపడి బాత్రూమ్లో పడేశాడు.. నగదు, సొత్తు చోరీ చేసిన దొంగలు దాన్ని తమతో పట్టుకుపోతారు. ఆనక జల్సాలు, అవసరాలకు ఖర్చు చేసుకుంటారు. అయితే జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రకాష్ ఇంట్లో చోరీ చేసిన క్యాటరింగ్ బాయ్ మాత్రం ఆ మొత్తాన్ని కమోడ్‌లో వేసి ఫ్లష్ చేసేశాడు. దీపావళి సందర్భంగా ప్రకాష్ రూ.3.5 లక్షలు అమ్మవారి ఎదుట ఉంచి పూజించాడు. ఆ ఫంక్షన్‌కు క్యాటరింగ్ బాయ్‌గా వచి్చన షేక్ చాంద్ రజాక్ ఆ మొత్తాన్ని జేబులో పెట్టుకున్నాడు. కొద్దిసేపటికి డబ్బు పోయిన విషయం గుర్తించిన యజమాని తనిఖీలు మొదలెట్టారు. దీంతో తాను చిక్కుతానని భయపడిన రజాక్ బాత్రూమ్లోకి వెళ్లాడు. రూ.75 వేలు జేబులో ఉంచుకుని మిగతా మొత్తం కమోడ్‌లో వేసి ఫ్లష్ చేసేశాడు. జేబులో ఉన్న డబ్బుతోనే చిక్కిన అత గాడు ఆరా తీస్తే అసలు విషయం చెప్పాడు. అదృశ్యాలు తట్టుకోలేక ‘ఆమె’గా మార్చారు.. యువతిగా మారాలన్న తన కోరికను కుటుంబీకులు అంగీకరించట్లేదనే ఉద్దేశంలో షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదేపదే ‘అదృశ్యం’ అవుతున్నాడు. ఎట్టకేలకు ఈ అంశం సైబరాబాద్ ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్‌డెస్క్ వద్దకు వచి్చంది. అతడి ఆచూకీ కనిపెట్టిన అధికారులు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అంతటితో ఆగకుండా కుటుంబీకులకు కౌన్సెలింగ్ చేసి అతడి కోరిక తీరేలా చేశారు. షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదో తరగతిలో ఉండగానే యువతిగా మారాలని భావించాడు. తన కోరికను తల్లిదండ్రులకు చెప్పగా వాళ్లు ససేమిరా అన్నారు. దీంతో రెండుమూడుసార్లు ఇల్లు విడిచి పారిపోయిన అతగాడు ట్రాన్స్‌జెండర్స్ గ్రూపుల్లో చేరుతున్నాడు. విషయం గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్ డెస్‌్కకు చేరింది. సిద్ధిపేటలో అతడిని గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. యువతిగా మారాలన్న కోరిక తీరకపోతే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం కావడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని పరిణామాలకు దారితీసే ఆస్కారం ఉందని గుర్తించారు. తల్లిదండ్రులకు హెల్ప్ డెస్క్ కౌన్సెలింగ్ చేసి వారి కుమారుడి కోరికను మన్నించేలా చేశారు. రాజీ కోసం చోరీ.. గ్రామీణ ప్రాంతాల్లో చోటు చేసుకున్న కొన్ని నేరాలు పోలీసుల వరకు రావు. పెద్దల సమక్షంలో జరిగే పంచాయితీల్లోనే సెటిల్ అవుతుంటాయి. చోరీ కేసులో ఇలాంటి ఓ సెటిల్మెంట్కు సంబంధించిన సొమ్ము చెల్లించడానికి నగరానికి వచ్చి చోరీ చేసి చిక్కాడో ప్రబుద్ధుడు. సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలం, సత్యగామకు చెందిన నాగరాజు ఆ గ్రామంలో ఓ చోరీ చేశాడు. పెద్ద మనుషుల సమక్షంలో ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తానంటూ అంగీకరించాడు. ఆ డబ్బుతో పాటు తనకూ కొంత మిగలాలనే ఉద్దేశంతో సిటీకి వచ్చి చోరీ చేయాలని భావించాడు. నగరానికి వచ్చి బంజారాహిల్స్‌లోని ఓ దేవాలయంలో పూజారిగా చేరాడు. అక్కడికి వచి్చన ఓ బాధితురాలి ఇబ్బందులు తొలగిస్తానని నమ్మబలికాడు. అందుకు అవసరమైన పూజ కోసం బంగారం ఇస్తే పూర్తయిన తర్వాత మరో తు లం కలిపి ఇస్తానంటూ నమ్మించాడు. ఇలా ఆమె నుంచి బంగారం, వెండి తీసుకుని పారి పోయాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. -
లైవ్ ఫిష్.. మత్స్య ప్రియులకు పండగే పండగ
సాక్షి, కల్లూరు(ఖమ్మం): చేపల కూరంటే ఇష్టపడని మనిషే ఉండరు. అలాంటిది తాజాగా, స్వచ్ఛమైన లైవ్ ఫిష్ సంవత్సరంలో 365 రోజులపాటు లభ్యమవ్వడంలో కల్లరు చేపల వర్కెట్ ప్రసిద్ధి. ఆదివారం వచ్చిందంటే చేపల మార్కెట్ వద్ద ఒకటే సందడి. కల్లరు పరిసర ప్రాంతాల నుంచి వర్కెట్‌కు రకరకాల చేపలు లైవ్ ఫిష్ రూపంలో దర్శనమిస్తుండడంతో మత్స్య ప్రియులకు పండగే పండగ. ఇక్కడ తాజా చేపల కోసం ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగడెం, పాల్వంచ, మధిర, తిరువూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. కల్లరు మండలంలో కల్లరు, లోకవరం, చండ్రుపట్ల, ముగ్గు వెంకటాపురం, చెన్నూరు, పాయపూర్, ఎర్రబోయినపల్లి, పెద్దకోరుకొండి, చిన్నకోరుకొండి, తాళ్లరు వెంకటాపురం తదితర గ్రావలలోని మత్స్య సహకారం సంఫలలో సువరు 1200 మంది సభ్యులు ఉన్నారు. ఒక్క కల్లరు మత్స్య సహకార సంఘంలోనే 230 మంది సభ్యులు ఉన్నారు. 1200 కుటుంబాలకు చేపల విక్రయాలే ఉపాధి. చేపల పెంపకం పై ప్రత్యేక దృష్టి నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఐబీ, పంచాయితీరాజ్ చెరువులలో సైతం సాగర్ నీటి సరఫరా జరుగుతుంది. దీంతో ఈ చెరువులలో చేపల పెంపకం పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం కల్లూరు మండలంలో 17 ఇరిగేషన్ బ్రాంచ్ చెరువులు, 108 కుంటలు ఉన్నాయి. వీటిలో చేప పిల్లలు పోసి సాధారణ పద్దతిలో చేపలు పెంచుతున్నారు. అందువల్ల ఇక్కడ చేపలు తాజాగా ఉంటాయి. చేప పిల్లలు పోసిన 6 నెలల నుంచి ఏడాదిన్నర వరకు పెంచిన తర్వాత చేపలు పడతారు మత్స్యకారులు. కేవలం తౌడు, దాణా, సహజ ఎరువులు మాత్రమే పెంపకానికి వినియోగిస్తారు. ఆదివారం టన్నుకు పైగానే... కల్లరులో చేపల విక్రయానికి సరైన మార్కెట్ సౌకర్యం లేకపోయినప్పటికీ రహదారి పక్కనే చెట్ల కింద సుమారు 10 షాపులలో విక్రయాలు కొనసాగిస్తారు. ఆదివారం రోజు కల్లరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన టన్నుకు పైగా చేపలను విక్రయిస్తారు. సాధారణ రోజులలో మాత్రం మూడు నుంచి ఐదు క్వింటాళ్ల లోపు విక్రయాలు జరుపుతారు. చెరువుల వద్ద ఐతే కేజీ చేప రూపాయలు 100 వరకు ఉంటుంది. మార్కెట్లో రూపాయలు 140 నుంచి రూ 150 వరకు విక్రయిస్తారు. 10 కేజీల చేపల వరకు ఇక్కడ దొరుకుతాయి. చేపలు శుభ్రపరిచే వారు ఇక్కడ 30 మంది వరకు ఉంటారు. వారు కేజీకి రూపాయలు. 20 చొప్పున తీసుకుంటారు. ఇలా చేపల విక్రయాల వల్ల సువరు 1200 కుటుంబాలు జీవనోపాధి పొందడం విశేషం. చేపలకు ఎక్కువ గిరాకీ మార్కెట్లో చేపల విక్రయాలు ఎక్కువగా జనవరి నెల నుంచి మే నెల వరకు గిరాకి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రోజుకు 30 నుంచి 50 కేజీల వరకు విక్రయిస్తాను. ఆదివారం వత్రం క్వింటాకు పైగానే చేపలు అమ్ముతాను. ఇక్కడ ఎక్కువగా శీలావతి, బొచ్చలు, గ్యాస్కట్, బంగారు తీగ, కొర్రమీను తదితర రకం చేపలు లభ్యమవుతాయి. – చింతకాయల నరసింహరావు, విక్రయదారుడు గిరాకీ ఉంటే రకం.1,000 కలిచేపలు శుభ్రపరిచే పని చేస్తాను. మార్కెట్లో ఆదివారం గిరాకి ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ర. 1,000 కి పైగానే కలి గిట్టుబాటు అవుతుంది. సాధారణ రోజులలో మాత్రం రూ 300 నుంచి రూపాయలు. 400 వరకు మాత్రమే పడుతుంది. ఈ వృతి ద్వారానే మా జీవనోపాధి. సంవత్సర కాలం మాకు ఉపాధి దొరుకుతుంది. – కవ్వత్తుల సుజాత, కల్లూరు -
స్వీట్ మదర్&డాటర్ మూమెంట్స్
-
కరోనా భయంతో స్వీట్ వద్దన్నాడు! కోపంతో నేలకేసికొట్టిన వధువు
కరోనా ప్రభావమో.. మరేమో కానీ.. ఈ మధ్య జరిగిన చాలా వివాహాలలో ఏదో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంటుంది. దీంతో ఈ పెళ్లిళ్లు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుక కూడా అలాంటి కోవకు చెందినదే. ఈ వివాహాంలో వరుడు, వధువు ఇద్దరు స్టేజీమీద నిల్చోని ఉన్నారు. ఈ క్రమంలో పెళ్లి కార్యక్రమం ప్రారంభమైంది. అయితే, ఈ వేడుకలో యువతి స్నేహితులు, ఒక ప్లేట్లో స్వీట్ బాక్స్ ఉంచి స్టేజీ మీదకు తీసుకొచ్చారు. ఆ తర్వాత స్వీట్ బాక్స్‌ను వధువుకు ఇచ్చి వరుడికి తినిపించాలని కోరారు. ఈ క్రమంలో, ఆ వధువు ఆ బాక్స్‌లోని ఒక స్వీట్‌ను తీసుకుని వరుడికి తినిపించేందుకు చేయి చాచింది. అయితే, పాపం.. ఆ వరుడు ఏ ఆలోచనలో ఉన్నాడో, లేక కరోనా వేళ స్వీట్ గోల ఏంటని గాబరా పడ్డాడో గానీ.. నోరు తెరవడానికి కాస్త ఆలస్యం చేశాడు. దీంతో ఆ వధువుకి చిర్రెత్తినట్టుంది. దీంతో వెంటనే తన చేతిలోని స్వీట్‌ను కోపంతో నేలపై పడేసింది. అయితే, ఈ అనుకోని సంఘటనతో, ఆ పెళ్లి కొడుకుకి ఏంచేయాలో అర్థంకాక.. బిత్తర ముఖం వేసుకొని అలాగే ఉండి పోయాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ఆ యువతికి పెళ్లి ఇష్టం లేదేమో..’, ‘ అందరి ముందు ఇంత కోపం పనికి రాదు..’, ‘నీ కోపంతో స్వీట్‌ను నేల పాలు చేశావ్ కదా.. ’ ‘ బాబీ.. కూల్.. చల్లబడండి..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, గతంలో జరిగిన ఒక వివాహ వేడుకలో సదరు వధువు.. వరుడి ముఖంపై పువ్వులను విసిరి కొట్టిన ఘటన వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. చదవండి: వరుడికి బంపరాఫర్.. స్టేజిమీదే ముద్దు పెట్టిన మరదలు -
పక్షి రెట్టతో ఫేషియల్..చర్మసమస్యలు మాయం
పూర్వం చర్మం అందంగా కనిపించాలంటే ఒంటికి సగ్గుపిండి, పసుపు .. వంటివి రాసుకుని నలుగుపెట్టుకుని స్నానం చేసేవారు. కానీ నేడు పరిస్థితి అలా లేదు. బ్యూటీపార్లర్లు, స్పాలకు వెళ్తున్నారు. అక్కడ రకరకాల సౌందర్యం చికిత్సలు చేయించుకుంటున్నారు. అయితే ఈ మధ్య ఈ సౌందర్య చికిత్సలు వింతగా తయారయ్యాయి. ఎంతలా అంటే ..మన ఊహకు అందనంత. జలగలు రక్తాన్ని పీల్చుతాయని తెలుసు. అలాంటిది శరీరంపై పాకించుకుంటే.. ! అమ్మో! అనకుండా ఉండగలమా? కానీ వివిధ దేశాల్లో కొన్ని బ్యూటీ స్పాలలో ఈ తరహా థెరపీ ఉంది. దీనిని లీచ్ థెరపీ అంటారు. ఈ చికిత్సలో పదుల సంఖ్యలో ముఖంపై జలగల్ని వదులుతారట. జలగలు చర్మం పై పొరల్లో ఉండే చెడు రక్తాన్ని పీల్చేస్తాయిట. ఇవి కొన్ని మాత్రమే.. తేనెటీగలతో కుట్టించుకోవడం, మనిషి రక్తాన్ని ముఖానికి రాసుకోవడం, పాములు, తేళ్ల నుంచి తీసే విషంతో ఫేషియల్స్, బీరు, వైనూ, కాఫీ, టీ .. స్నానాలు ఇలా ఎన్నో రకాల సౌందర్య చికిత్సలు పాశ్చాత్య దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. జపాన్‌లో నైటింగేల్ పక్షి వేసే రెట్టలు ఎండాక, ఆ పొడిని బియ్యం కడిగిన నీటిలో కలిపి ముఖానికి రాసుకుంటారు. చర్మ సమస్యలని దూరం చేసుకొనేందుకు ఈ రకం ఫేషియల్ వేసుకుంటారట. జపాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో స్నెయిల్ ఫేషియల్స్ అనే కొత్త రకం చికిత్స చేస్తున్నారు. అంటే నత్తను ముఖంపై పాకించుకోవడం. నత్త పాకేటప్పుడు జిగట పదార్థాన్ని విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. ఆ ద్రవంలో చర్మంపై ముడుతలు పడకుండా చెయ్యగల ఔషధ గుణాలు ఉన్నాయట. ఫిలిప్పీన్స్, ఇతర దేశాల్లో కోరలు పీకిన పాములు, కొండ చిలువల్ని శరీరంపై పాకించి మసాజ్ చేస్తున్నాయి కొన్ని స్పాలు. దీనివల్ల ఒత్తిడి దూరమవుతుంది. శరీరానికి విశ్రాంతి కూడా అందుతుందట. -
పాపం...రాహుల్
ముంబై, మహారాష్ట్ర : రాజకీయాల పరంగా ఎన్ని విబేధాలున్నప్పటికి ప్రధానమంత్రి మోదీతో సహా పలువురు రాజకీయ నాయకులు ‘బర్త్‌డే బాయ్’ రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ రెబల్స్ మాత్రం ఈ రోజు కూడా రాహుల్‌ను విడిచిపెట్టడం లేదు. పూణెకు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ రెబల్ రాహుల్‌కు వెరైటీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. మహారాష్ట్ర పూణెకు చెందిన షెహ్జాద్ తన ట్విటర్లో ‘ఇప్పటికే అర్థ శతాబ్దాన్ని పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మీరు బలవంతంగా చేస్తున్న ఈ ఉద్యోగాన్ని(కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి) వదిలి, కనీసం 2019 నాటికైనా మీ మనసుకు నచ్చిన ఉద్యోగాన్ని పొందాలని ఆశిస్తున్నాను’ అంటు ట్వీట్ చేసాడు. షెహ్జాద్ చేసిన మెసేజ్... Happy Birthday Rahul Gandhi ji! As you near half a century, I pray for your long life, and hope in 2019 you can pursue a profession which your heart really intends to pursue, rather than a job you have been forced to take up.. గతంలోను... షెహ్జాద్ రాహుల్‌ను విమర్శించడం ఇదే ప్రథమం కాదు. గతంలో రాహుల్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు కూడా షెహ్జాద్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. ‘రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా లేరు. వారసత్వం ప్రకార పట్టాభీషక్తుడయ్యే మొఘల్ సామ్రజ్యపు రాజులా ఉన్నారని విమర్శించాడు. రాహుల్ ఎన్నిక ప్రక్రియ మొఘల్ తరహా వారసత్వ పట్టాభీషేక ప్రక్రియాలా ఉంద’ని ఎద్దేవా చేశాడు. -
ఒకే చోట సకల దేవతల దర్శనం
-
అరటి..వెరైటీ
అరబుపాలెం గ్రామానికి చెందిన తుట్టా వెంకటప్పారావు తన ఇంటి పెరటిలో పచ్చమొకిరి రకం అరటి విరగ్గాసింది. ఆరడుగుల పొడవున ఉన్న గెలకు 24 హస్తాలుండగా, వీటిలో ఒక్కొక్కదానికి 30నుంచి 32వరకు కాయలున్నాయి. –మునగపాక -
లవ్ స్టోరీయే.. కాకపోతే కాస్త వెరైటీ..
నువ్వు నా ప్రాణం సవోరీ.. తెల్లారి లేగానే.. సెంజీ చెప్పే మాట ఇదే.. ఎందుకంటే.. సవోరీ అంటే సెంజీకి ప్రాణం.. అంతకంటే ఎక్కువే.. చూశారుగా ఎలా సేవ చేస్తున్నాడో.. చక్రాల కుర్చీలో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పుతాడు.. షాపింగ్‌కు తీసుకెళ్తాడు.. ఆమెకు నచ్చినవన్నీ కొంటాడు.. సాయంత్రం షికారుకు తీసుకెళ్తాడు.. ఆమెకు కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకుంటాడు.. కంటికి రెప్పలా కాపాడతాడు.. ఆహా.. ఏం లవ్‌స్టోరీ అని అనిపిస్తోంది కదా.. ఇది లవ్ స్టోరీయే.. కాకపోతే కాస్త వెరైటీ.. ఎందుకంటే.. సవోరీ ఓ బొమ్మ.. ఈ 61 ఏళ్ల పెద్దాయన ప్రేమించింది.. ఈ బొమ్మనే.. పెళ్లై ఇద్దరు పిల్లలున్న సెంజీ నకజిమా బిజినెస్‌మన్.. జపాన్‌లోని నగానోలో ఉంటాడు. ఏమైందో ఏమో.. లేటు వయసులో లవ్యూ అంటూ ఈ సిలికాన్ బొమ్మ వెంట పడ్డాడు. రూ.3.5 లక్షలు పెట్టి కొని, దీన్ని ఇంటికి తెచ్చుకున్నాడు.. పెళ్లాన్ని పక్కనపెట్టి.. దీన్ని పెళ్లాంలా చూసుకుంటున్నాడు.. ఏమైనా అంటే.. ఇది బొమ్మకాదు.. నా లవర్ అంటూ తిక్కతిక్కగా చెబుతున్నాడట. పైగా ఆమె వ్యక్తిత్వం ఎంతో నచ్చిం దట.. ‘ఈ మనుషులు హృదయం లేని వారు.. మోసం చేయాలని చూస్తారు.. కానీ సవోరీకి డబ్బుపై ఆశ లేదు.. నిర్మల హృదయం కలది’ అంటూ డైలాగులు చెబుతున్నాడు. ఇదిలా ఉంటే.. జపాన్, మరికొన్ని ఆసియా దేశాల్లో ఈ సిలికాన్ బొమ్మలు కొనుగోలు చేసేవారు పెరిగిపోతున్నారట. గర్ల్‌ఫ్రెండ్ సాహచర్యం కావాలనుకునేవారు వీటిని ఎక్కువగా కొంటున్నారట. -
వెరైటీగా లవ్ ప్రపోజ్ చేశాడు
-
మనసుల్ని దోచేస్తున్న దోశలివిగో!!
-
ఫ్యూజన్ ఫుడ్: కలిపి తిన్నా కలదు సుఖం
కాంబినేషన్ లేకుండా తింటే... కడుపు కంభం చెరువైపోతుంది! కాస్త చూస్కొని వేస్కోవాలి. పడేవీ వుంటాయి, పడనివీ ఉంటాయి. పడనివాటితో కలిపి కొడితే.. పడేవి కూడా పడకుండా పోతాయి. సలహా బాగానే ఉంది కానీ, వెరైటీలకు అలవాటు పడిన ప్రాణానికి ఈ మాట రుచిస్తుందా? కన్ను అరటిపండంటే... నోరు కోడిగుడ్డంటుంది. నాలుక... ఆపిల్ ని బేక్ చేయమంటుంది! ఏం చేయడం? ‘ఫ్యూజన్ ఫుడ్’ని వండేయడమే! అదొకటుందా? ఉంది. ఈవారం ఫ్యూజనే మన విజన్! ప్రమాదం లేని కాంబినేషన్!! క్రేప్స్ విత్ బనానా ఫ్లేంబ్ కావలసినవి: కోడిగుడ్లు - 7 (రెండు గుడ్లు కేవలం తెల్లసొన మాత్రమే తీసుకోవాలి); చిక్కటిపాలు - రెండున్నర కప్పులు; మైదా - ఒకటింపావు కప్పులు; ఉప్పు - చిటికెడు; బటర్ - 6 టేబుల్ స్పూన్లు; బనానా ఫ్లేంబ్ కోసం... అరటిపళ్లు - 4; బటర్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; టాపింగ్ కోసం - తగినంత వెనిలా ఐస్‌క్రీమ్ తయారి: పెద్ద పాత్రలో కోడిగుడ్లు వేసి గిలకొట్టాలి పాలు, మైదా, ఉప్పు జత చేసి మళ్లీ గిలకొట్టాలి ఉండలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి పెనం వేడి చేసి టీ స్పూన్ బటర్ వేడి చేయాలి కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని గరిటెతో తగినంత వేయాలి బాగా కాలాక రెండవవైపు తిప్పితే క్రేప్స్ తయారవుతాయి ఇలా మొత్తం పిండితో వేసుకుని పక్కన ఉంచాలి అరటిపళ్లను ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పాత్రను స్టౌ మీద ఉంచి టేబుల్ స్పూను బటర్ వేసి కరిగాక అరటిపండు ముక్కలను వేసి కొద్దిగా వేయించి తీస్తే ఫ్లేక్స్ రెడీ అయినట్లే. (అరటిపండు ముక్కలను వేయించుకోవడం ఇష్టంలేని వారు కట్ చేసిన ముక్కలను వాడుకోవచ్చు) పైన తయారుచేసి ఉంచుకున్న క్రేప్స్ లోపల వీటిని ఉంచి సర్వ్ చేయాలి. వీటిని చాక్లెట్ సాస్‌తో సర్వ్ చేస్తే చాలా వెరైటీగా ఉంటుంది. బేక్ డ్ ఆపిల్ కప్స్ కావలసినవి: గ్రీన్ ఆపిల్స్ - 4 (తొక్క తీసేయాలి); నిమ్మరసం - రెండు టీ స్పూన్లు; పంచదార -5 టేబుల్ స్పూన్లు; మసాలా - టీ స్పూను; జాజికాయ పొడి - పావు టీ స్పూను; లవంగాల పొడి - అర టీ స్పూను; ఉప్పు - పావు టీ స్పూను; వెనిలా ఎసెన్స్ - 2 టీ స్పూన్లు; మైదా - రెండు కప్పులు + రెండు టేబుల్ స్పూన్లు; కోడిగుడ్లు - మూడు; ఐస్ వాటర్ - 4 టేబుల్ స్పూన్లు; బటర్ - 8 టేబుల్ స్పూన్లు; వెనిలా ఐస్‌క్రీమ్ - 4 స్కూపులు తయారి: చిన్న చాకు తీసుకుని దానితో ఆపిల్‌ను కప్‌లా వచ్చేలా, లోపలి గుజ్జును బాల్స్‌లా వచ్చేలా స్కూప్లాంటి దానితో నెమ్మదిగా తీయాలి. (ఆపిల్ అంగుళం మందంగా వచ్చేవరకు ఇలా చేయాలి) నిమ్మరసం తీసుకుని ఆపిల్ కప్స్ మీద, ఆపిల్ బాల్స్ మీద నిమ్మరసం చల్లాలి దాల్చినచెక్కపొడి, పంచదార, మసాలా, జాజికాయపొడి, లవంగాలపొడి, ఉప్పు, వెనిలా ఎసెన్స్‌లను ఆపిల్ కప్స్‌లో వరసగా వేయాలి ఆపిల్బాల్స్ మీద కూడా చల్లి పక్కన ఉంచాలి మిక్సింగ్ బౌల్లో మైదాపిండి, కోడిగుడ్ల సొన వేసి చేతితో బాగా కలపాలి 6 టేబుల్ స్పూన్ల బటర్ జత చేసి కలపాలి. (అవసరమనుకుంటే కొద్దిగా చల్లటి నీరు జతచేసి మరోమారు కలపాలి. పిండి మెత్తగా ఉండేలా చూసుకోవాలి) పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అప్పడాల పీట మీద వేసి కొద్దిగా పొడి పిండి జత చేసి పూరీలా ఒత్తి, ఆపిల్ బాల్స్ మిశ్రమం మధ్యలో ఉంచి అంచులు మూసేయాలి అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి అల్యూమినియం ప్లేట్‌కి చీజ్ రాసి ఆపిల్ కప్స్‌ను ఇందులో ఉంచాలి ఒక కోడిగుడ్డును బాగా గిలక్కొట్టి ఎగ్ వాష్‌తో మృదువుగా ఈ సొనను వీటి మీద రాయాలి ఆపిల్ కప్స్‌ని సుమారు 40 నిముషాలు బేక్ చేయాలి. (గోధుమరంగులోకి మారేవరకు ఉంచాలి) ఇంక ఐదు నిముషాలలో బేకింగ్ పూర్తవుతుందనగా టేబుల్ స్పూన్ బటర్‌ను పెద్ద బాణలిలో కరిగించి, ఆపిల్ బాల్స్‌ను మూడు నిముషాల పాటు వేయించి వీటిని ఆపిల్ కప్స్‌లో ఉంచి వేడివేడిగా సర్వ్ చేయాలి. ఆల్మండ్ పుడింగ్ విత్ లిచీ కావలసినవి: అగర్ అగర్ పొడి - అర టీ స్పూను (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); నీరు - ఆరు కప్పులు; చిక్కటిపాలు - 5 కప్పులు (సుమారు ముప్పావు లీటరు); మరిగించిన పాలు - రెండు కప్పులు (చిక్కగా కోవాలా తయారయినవి); పంచదార - కప్పు; ఆల్మండ్ ఎసెన్స్ - ఒకటిన్నర స్పూనులు; లిచీలు - గార్నిషింగ్ కోసం తయారి: పెద్ద పాత్రలో నీరు పోసి మరిగించాలి చిన్న గిన్నెలో అగర్ అగర్ పొడి, ఐదారు చుక్కల వేడినీరు వేసి పేస్ట్‌లా కలిపి, మరుగుతున్న నీటిలో ఈ మిశ్రమాన్ని వేసి కలపాలి పాలు, మరిగించిన కోవాలాంటిపాలు పోసి బాగా కలిపి మంట తగ్గించి పది నిముషాలు ఉంచాలి పంచదార వేసి కరిగేవరకు కలుపుతుండాలి స్టౌ మీద నుంచి కిందకు దించి ఆల్మండ్ ఎసెన్స్ జత చేయాలి పుడ్డింగ్ మౌల్డ్‌లో పోసి డీప్‌ఫ్రీజ్‌లో రాత్రంతా ఉంచాలి సర్వ్ చేసే ముందు ముక్కలుగా కట్ చేసి లిచీలతో గార్నిష్ చేయాలి. ఆల్మండ్ కేక్ విత్ మ్యాంగో బటర్‌క్రీమ్ ఫ్రాస్టింగ్ కావలసినవి: పంచదార - కప్పు; బటర్ - అర కప్పు; కోడిగుడ్లు - 2; మైదా - ఒకటిన్నర కప్పులు; బేకింగ్ సోడా - అర స్పూను; ఉప్పు - అర టీ స్పూను; పాలు అర కప్పు; ఆల్మండ్ ఎసెన్స్ - ముప్పావు టీ స్పూను. మ్యాంగో బటర్ క్రీమ్... సాల్ట్ లేని బటర్ - కప్పు; కన్ఫెక్షనరీస్ పంచదార - అర కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); పాలు - పావుకప్పు; మామిడిపండు గుజ్జు - ఒకటిన్నర కప్పులు లేదా మ్యాంగో ప్యూరీ - ఒకటిన్నరకప్పులు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది) తయారి: అవెన్‌ను 350 డిగ్రీల వద్ద ప్రీహీట్ చేయాలి బేకింగ్ పాన్‌కి బటర్ పూయాలి ఒక పెద్ద పాత్రలో బటర్, పంచదార వే సి మెత్తగా అయ్యేవరకు కలపాలి కోడిగుడ్డు సొన జత చేసి కలపాలి ఆల్మండ్ ఎసెన్స్ జత చేసి మళ్లీ బాగా కలపాలి వేరే పాత్రలో మైదా, బేకింగ్ సోడా వేసి బాగా జల్లెడపట్టి పై మిశ్రమానికి జతచేసి నెమ్మదిగా గిలకొట్టాలి చివరగా పాలు జతచేసి గరిటెతో కలపాలి బేకింగ్ పాన్‌లో ఈ మిశ్రమం పోసి, సుమారు 40 నిముషాలు అవెన్‌లో బేక్ చేసి తీసేయాలి 20 నిముషాల తర్వాత కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి మరొక పాత్రలో చల్లగా ఉన్న బటర్ క్రీమ్ వేసి బాగా చిక్కగా అయ్యేలా గిలకొట్టాలి కన్ఫెక్షనరీ సుగర్ జతచేసి, రెండూ కలిసేలా బాగా కలపాలి పాలు నెమ్మదిగా పోస్తూ కలిపి మరో మారు గిలకొట్టాలి చివరగా మామిడిపండు గుజ్జు వేసి వేగంగా గిలకొట్టాలి బటర్ క్రీమ్, మామిడిపండు గుజ్జు కలిసేవరకు స్పీడ్‌గా బీట్ చేయాలి మ్యాంగ్ బటర్క్రీమ్ను కేక్ స్లైసుల మీద పోసి సర్వ్ చేయాలి. అగర్... అగర్... అగర్ అగర్ అనే పదార్థం చూడటానికి చైనా సాల్ట్లాగ ఉంటుంది. ఇది ఆల్గై నుంచి తయారవుతుంది. 1658లో జపాన్‌లోని మినోరా టాంజెమన్ దీన్ని కనిపెట్టాడు జపాన్‌లో అగర్ అగర్‌ను కాంటెన్ అని పిలిచేవారు. దీనిని కొన్నిరకాల పేస్ట్రీలలో వినియోగిస్తారు అగర్ స్వాభావికంగా అగరోస్, అగరోపెక్టిన్ల మిశ్రమంతో తయారవుతుంది ఇది తెల్లగా, స్ఫటికంలా ఉంటుంది చిన్న చిన్న క్రిస్టల్స్ రూపంలోనూ, పొడి రూపంలోనూ దొరుకుతుంది జె ల్లీ, పుడ్డింగ్స్, కస్టర్డ్స్ తయారీలో దీనిని ఉపయోగిస్తారు అగర్ అగర్లో 80 శాతం పీచుపదార్థం ఉండటం వలన, ఇది పేగులను సక్రమంగా ఉంచడంలో తోడ్పడుతుంది. బనానా బైట్ ఫిట్టర్స్ కావలసినవి: అరటిపళ్లు - 3 (బైట్ సైజ్‌లో తురమాలి); కోడిగుడ్లు -2; మైదా - కప్పు; కార్న్‌ఫ్లోర్ - అర కప్పు; బేకింగ్ సోడా - అర టీ స్పూను; ఉప్పు - పావు టీ స్పూను; క్లబ్ సోడా - అర కప్పు; నూనె - తగినంత; కండెన్స్డ్ మిల్క్ - చిలకరించడానికి తగినంత తయారి: పెద్ద పాత్రలో కోడిగుడ్డు సొన వేసి బాగా చిలకరించాలి మైదాపిండి, కార్న్‌ఫ్లోర్ , బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి మరోమారు బీట్ చేయాలి. (ఈ మిశ్రమం బాగా చిక్కగా ఉండాలి) చివరగా క్లబ్ సోడా వేసి బాగా కలపాలి బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి అరటిపండు ముక్కలను పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి వేయించాలి మంట మీడియంలో ఉంచి వేయించితే బాగా వేగుతాయి పేపర్ టవల్ మీదకు తీసి వేడివేడిగా సర్వ్ చేయాలి సేకరణ: డా.వైజయంతి