లైవ్‌ ఫిష్‌.. మత్స్య ప్రియులకు పండగే పండగ | Fish Lovers: Spicial Story On Fish Market In Khammam | Sakshi
Sakshi News home page

లైవ్‌ ఫిష్‌.. మత్స్య ప్రియులకు పండగే పండగ

Published Sun, Nov 14 2021 12:15 PM | Last Updated on Sun, Nov 14 2021 12:15 PM

Fish Lovers: Spicial Story On Fish Market In Khammam - Sakshi

చేపలు విక్రయిస్తున్న మహిళ

సాక్షి, కల్లూరు(ఖమ్మం): చేపల కూరంటే ఇష్టపడని మనిషే ఉండరు. అలాంటిది తాజాగా, స్వచ్ఛమైన లైవ్‌ ఫిష్‌ సంవత్సరంలో 365 రోజులపాటు లభ్యమవ్వడంలో కల్లరు చేపల వర్కెట్‌ ప్రసిద్ధి. ఆదివారం వచ్చిందంటే చేపల మార్కెట్‌ వద్ద ఒకటే సందడి. కల్లరు పరిసర ప్రాంతాల నుంచి వర్కెట్‌కు రకరకాల చేపలు లైవ్‌ ఫిష్‌ రూపంలో దర్శనమిస్తుండడంతో మత్స్య ప్రియులకు పండగే పండగ.

ఇక్కడ తాజా చేపల కోసం ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగడెం, పాల్వంచ, మధిర, తిరువూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. కల్లరు మండలంలో కల్లరు, లోకవరం, చండ్రుపట్ల, ముగ్గు వెంకటాపురం, చెన్నూరు, పాయపూర్, ఎర్రబోయినపల్లి, పెద్దకోరుకొండి, చిన్నకోరుకొండి, తాళ్లరు వెంకటాపురం తదితర గ్రావలలోని మత్స్య సహకారం సంఫలలో సువరు 1200 మంది సభ్యులు ఉన్నారు. ఒక్క కల్లరు మత్స్య సహకార సంఘంలోనే 230 మంది సభ్యులు ఉన్నారు. 1200 కుటుంబాలకు చేపల విక్రయాలే ఉపాధి.

చేపల పెంపకం పై ప్రత్యేక దృష్టి
నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ పరిధిలో ఐబీ, పంచాయితీరాజ్‌ చెరువులలో సైతం సాగర్‌ నీటి సరఫరా జరుగుతుంది. దీంతో ఈ చెరువులలో చేపల పెంపకం పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం కల్లూరు మండలంలో 17 ఇరిగేషన్‌ బ్రాంచ్‌ చెరువులు, 108 కుంటలు ఉన్నాయి. వీటిలో చేప పిల్లలు పోసి సాధారణ పద్దతిలో చేపలు పెంచుతున్నారు.

అందువల్ల ఇక్కడ చేపలు తాజాగా ఉంటాయి. చేప పిల్లలు పోసిన 6 నెలల నుంచి ఏడాదిన్నర వరకు పెంచిన తర్వాత చేపలు పడతారు మత్స్యకారులు. కేవలం తౌడు, దాణా, సహజ ఎరువులు మాత్రమే పెంపకానికి వినియోగిస్తారు. 

ఆదివారం టన్నుకు పైగానే...
కల్లరులో చేపల విక్రయానికి సరైన మార్కెట్‌ సౌకర్యం లేకపోయినప్పటికీ రహదారి పక్కనే చెట్ల కింద సుమారు 10 షాపులలో విక్రయాలు కొనసాగిస్తారు. ఆదివారం రోజు కల్లరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన టన్నుకు పైగా చేపలను విక్రయిస్తారు. సాధారణ రోజులలో మాత్రం మూడు నుంచి ఐదు  క్వింటాళ్ల లోపు విక్రయాలు జరుపుతారు. చెరువుల వద్ద ఐతే కేజీ చేప రూపాయలు 100 వరకు ఉంటుంది.

మార్కెట్‌లో రూపాయలు 140 నుంచి రూ 150 వరకు విక్రయిస్తారు. 10 కేజీల చేపల వరకు ఇక్కడ దొరుకుతాయి. చేపలు శుభ్రపరిచే వారు ఇక్కడ 30 మంది వరకు ఉంటారు. వారు కేజీకి రూపాయలు. 20 చొప్పున తీసుకుంటారు. ఇలా చేపల విక్రయాల వల్ల సువరు 1200 కుటుంబాలు జీవనోపాధి పొందడం విశేషం.            

 చేపలకు ఎక్కువ గిరాకీ
మార్కెట్‌లో చేపల విక్రయాలు ఎక్కువగా జనవరి నెల నుంచి మే నెల వరకు గిరాకి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రోజుకు 30 నుంచి 50 కేజీల వరకు విక్రయిస్తాను. ఆదివారం వత్రం క్వింటాకు పైగానే చేపలు అమ్ముతాను. ఇక్కడ ఎక్కువగా శీలావతి, బొచ్చలు, గ్యాస్‌కట్, బంగారు తీగ, కొర్రమీను తదితర రకం చేపలు లభ్యమవుతాయి.

– చింతకాయల నరసింహరావు, విక్రయదారుడు  

గిరాకీ ఉంటే రకం.1,000 కలిచేపలు శుభ్రపరిచే పని చేస్తాను. మార్కెట్‌లో ఆదివారం గిరాకి ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ర. 1,000 కి పైగానే కలి గిట్టుబాటు అవుతుంది. సాధారణ రోజులలో మాత్రం రూ 300 నుంచి రూపాయలు. 400 వరకు మాత్రమే పడుతుంది. ఈ వృతి ద్వారానే మా జీవనోపాధి. సంవత్సర కాలం మాకు ఉపాధి దొరుకుతుంది.

– కవ్వత్తుల సుజాత, కల్లూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement