Koraminu
-
లైవ్ ఫిష్.. మత్స్య ప్రియులకు పండగే పండగ
సాక్షి, కల్లూరు(ఖమ్మం): చేపల కూరంటే ఇష్టపడని మనిషే ఉండరు. అలాంటిది తాజాగా, స్వచ్ఛమైన లైవ్ ఫిష్ సంవత్సరంలో 365 రోజులపాటు లభ్యమవ్వడంలో కల్లరు చేపల వర్కెట్ ప్రసిద్ధి. ఆదివారం వచ్చిందంటే చేపల మార్కెట్ వద్ద ఒకటే సందడి. కల్లరు పరిసర ప్రాంతాల నుంచి వర్కెట్కు రకరకాల చేపలు లైవ్ ఫిష్ రూపంలో దర్శనమిస్తుండడంతో మత్స్య ప్రియులకు పండగే పండగ. ఇక్కడ తాజా చేపల కోసం ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగడెం, పాల్వంచ, మధిర, తిరువూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. కల్లరు మండలంలో కల్లరు, లోకవరం, చండ్రుపట్ల, ముగ్గు వెంకటాపురం, చెన్నూరు, పాయపూర్, ఎర్రబోయినపల్లి, పెద్దకోరుకొండి, చిన్నకోరుకొండి, తాళ్లరు వెంకటాపురం తదితర గ్రావలలోని మత్స్య సహకారం సంఫలలో సువరు 1200 మంది సభ్యులు ఉన్నారు. ఒక్క కల్లరు మత్స్య సహకార సంఘంలోనే 230 మంది సభ్యులు ఉన్నారు. 1200 కుటుంబాలకు చేపల విక్రయాలే ఉపాధి. చేపల పెంపకం పై ప్రత్యేక దృష్టి నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఐబీ, పంచాయితీరాజ్ చెరువులలో సైతం సాగర్ నీటి సరఫరా జరుగుతుంది. దీంతో ఈ చెరువులలో చేపల పెంపకం పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం కల్లూరు మండలంలో 17 ఇరిగేషన్ బ్రాంచ్ చెరువులు, 108 కుంటలు ఉన్నాయి. వీటిలో చేప పిల్లలు పోసి సాధారణ పద్దతిలో చేపలు పెంచుతున్నారు. అందువల్ల ఇక్కడ చేపలు తాజాగా ఉంటాయి. చేప పిల్లలు పోసిన 6 నెలల నుంచి ఏడాదిన్నర వరకు పెంచిన తర్వాత చేపలు పడతారు మత్స్యకారులు. కేవలం తౌడు, దాణా, సహజ ఎరువులు మాత్రమే పెంపకానికి వినియోగిస్తారు. ఆదివారం టన్నుకు పైగానే... కల్లరులో చేపల విక్రయానికి సరైన మార్కెట్ సౌకర్యం లేకపోయినప్పటికీ రహదారి పక్కనే చెట్ల కింద సుమారు 10 షాపులలో విక్రయాలు కొనసాగిస్తారు. ఆదివారం రోజు కల్లరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన టన్నుకు పైగా చేపలను విక్రయిస్తారు. సాధారణ రోజులలో మాత్రం మూడు నుంచి ఐదు క్వింటాళ్ల లోపు విక్రయాలు జరుపుతారు. చెరువుల వద్ద ఐతే కేజీ చేప రూపాయలు 100 వరకు ఉంటుంది. మార్కెట్లో రూపాయలు 140 నుంచి రూ 150 వరకు విక్రయిస్తారు. 10 కేజీల చేపల వరకు ఇక్కడ దొరుకుతాయి. చేపలు శుభ్రపరిచే వారు ఇక్కడ 30 మంది వరకు ఉంటారు. వారు కేజీకి రూపాయలు. 20 చొప్పున తీసుకుంటారు. ఇలా చేపల విక్రయాల వల్ల సువరు 1200 కుటుంబాలు జీవనోపాధి పొందడం విశేషం. చేపలకు ఎక్కువ గిరాకీ మార్కెట్లో చేపల విక్రయాలు ఎక్కువగా జనవరి నెల నుంచి మే నెల వరకు గిరాకి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రోజుకు 30 నుంచి 50 కేజీల వరకు విక్రయిస్తాను. ఆదివారం వత్రం క్వింటాకు పైగానే చేపలు అమ్ముతాను. ఇక్కడ ఎక్కువగా శీలావతి, బొచ్చలు, గ్యాస్కట్, బంగారు తీగ, కొర్రమీను తదితర రకం చేపలు లభ్యమవుతాయి. – చింతకాయల నరసింహరావు, విక్రయదారుడు గిరాకీ ఉంటే రకం.1,000 కలిచేపలు శుభ్రపరిచే పని చేస్తాను. మార్కెట్లో ఆదివారం గిరాకి ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ర. 1,000 కి పైగానే కలి గిట్టుబాటు అవుతుంది. సాధారణ రోజులలో మాత్రం రూ 300 నుంచి రూపాయలు. 400 వరకు మాత్రమే పడుతుంది. ఈ వృతి ద్వారానే మా జీవనోపాధి. సంవత్సర కాలం మాకు ఉపాధి దొరుకుతుంది. – కవ్వత్తుల సుజాత, కల్లూరు -
కొరమీనును మించేలా మురిమీను
• ఆరెంజ్స్పాట్స్తో గ్రూపర్ఫిష్ • ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ • సీఎంఆర్ఎఫ్ మూడేళ్ల కృషికి తగిన ఫలితం • దేశీయ హేచరీలో ఉత్పత్తికి సన్నాహాలు • చేపలపెంపకందారులకు ఇదో వరం సాక్షి, ఒంగోలు: ఇంత వరకు కోరమీను రుచికే మాంసాహార ప్రియులు లొట్టలేసేవారు. ఇప్పుడు దానికి మూడురెట్ల రుచితోపాటు ధర పలికే మురిమీను రుచి మురిపించనుంది. ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న ఈ మురిమీను (గ్రూపర్ ఫిష్) దేశీయ చేపల చెరువుల్లో పెంపకం చేపట్టేందుకు వీలుగా సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎం ఎఫ్ఆర్ఐ) మూడేళ్లుగా చేసిన పరిశోధనకు ఫలితం దక్కింది. ఆరెంజ్ స్పాట్స్తో చూడముచ్చటగా కనిపించే మురిమీను మాంసప్రియులకు కొత్త రుచిని అందించనుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈసందర్భంగా సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ సైంటిస్టులు మురిమీను గురించి ఇలా వివరించారు. మూడేళ్ల పరిశోధన ఫలించింది సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎం ఎఫ్ఆర్ఐ) 2013 నుంచి గ్రూపర్షిష్ లార్వాను ఉత్పత్తి చేయడంలో మంచి పురోగతి సాధించిందని విశాఖ రీజనల్ సెంట్రల్ ఆఫ్ సీఎం ఎఫ్ఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సుభదీఫ్ ఘోష్ తెలిపారు. సాంకేతిక బృందంతోపాటు, సిబ్బంది పడిన కష్టానికి మంచి ఫలితం దక్కిందన్నారు. సముంద్రపు నీటితోపాటు, వివిధ రకాల నీట్లో లార్వా వృద్ధితోపాటు ఉత్పత్తి చెందేలా చాలా ప్రయోగాలను చేశామన్నారు. ప్రయోగాలఫలితంగా మురిమీను 42రోజుల వ్యవధిలో సుమారు 3 సెంటీమీటర్ల పొడవు వరకు పెరిగిందన్నారు. ఏడాదికి లక్షల మురిమీను పిల్లల పంపిణీ సంవత్సరానికి లక్షల మురిమీను పిల్లల చేపల పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం ఎప్ఆర్ఐ డెరైక్టర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ చేపల పెంపకంగా విస్తారంగా పెంపకంచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హై ఎక్స్పోర్ట్ మార్కెట్ ఆరెంజ్ స్పాట్స్( గ్రూపర్ ఫిష్) మురిమీను అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉందన్నారు. దీని ఎగుమతికి ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఉష్ణమండల వాతావరణంలో మురిమీను చేపల పెంపకానికి అనువుగా వుంటుందన్నారు. ఆసియా దేశాలైన హాంగ్కాంగ్, చైనా, తైవాన్, సింగపూర్,మలేషియా దేశాలలో మంచి డిమాండ్ ఉందన్నారు. దీని ఆయా దేశాలలో అమూర్గా పిలుస్తారన్నారు. చేపల పెంపకం దారులు అధిక లాభాలు మురిమీను దేశీ చెరువులలో విస్తారంగా పెంపకంగా చేసేందుకు చేపల పిల్లలను పంపిణీ చేయనున్నామన్నారు. దీని పెంపకం ద్వారా చేపల పెంపకందారులు అధిక ఆధాయాన్ని సాధింగలరని సీ ఎంఎఫ్ ఆర్ఐ డెరైక్టర్ డాక్టర్ గోపాలకృష్ణణ్ తెలిపారు. తక్కువ వ్యవధిలో అమ్మకానికి సిద్ధంగా చేప పెరుగుతుందన్నారు. దీంతో అనతికాలంలో ఎక్కువ దిగుబడి సైతం సాధించగవచ్చనని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయ చేపల మార్కెట్లో మురిమీను కిలో ధర రూ.400- 500వరకు పలుకుతుందన్నారు. ఇదే అంతర్జాతీయ మార్కెట్లో ఇక్కడి ధరకు మూడు,నాలుగు రెట్లు అధికంగా ఉందన్నారు.