కొరమీనును మించేలా మురిమీను | special story on korra meenu | Sakshi
Sakshi News home page

కొరమీనును మించేలా మురిమీను

Published Thu, Nov 3 2016 8:22 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

కొరమీనును మించేలా మురిమీను

కొరమీనును మించేలా మురిమీను

ఆరెంజ్‌స్పాట్స్‌తో గ్రూపర్‌ఫిష్
ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ
సీఎంఆర్‌ఎఫ్ మూడేళ్ల కృషికి తగిన ఫలితం
దేశీయ హేచరీలో ఉత్పత్తికి సన్నాహాలు
చేపలపెంపకందారులకు ఇదో వరం


సాక్షి, ఒంగోలు: ఇంత వరకు కోరమీను రుచికే మాంసాహార ప్రియులు లొట్టలేసేవారు. ఇప్పుడు దానికి మూడురెట్ల రుచితోపాటు ధర పలికే మురిమీను రుచి మురిపించనుంది. ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న ఈ మురిమీను (గ్రూపర్ ఫిష్) దేశీయ చేపల చెరువుల్లో పెంపకం చేపట్టేందుకు వీలుగా సెంట్రల్ మెరైన్  ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్  (సీఎం ఎఫ్‌ఆర్‌ఐ) మూడేళ్లుగా చేసిన పరిశోధనకు ఫలితం దక్కింది. ఆరెంజ్ స్పాట్స్‌తో చూడముచ్చటగా కనిపించే మురిమీను మాంసప్రియులకు కొత్త రుచిని అందించనుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈసందర్భంగా సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ సైంటిస్టులు మురిమీను గురించి ఇలా వివరించారు.

 మూడేళ్ల పరిశోధన ఫలించింది
సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎం ఎఫ్‌ఆర్‌ఐ) 2013 నుంచి గ్రూపర్‌షిష్ లార్వాను ఉత్పత్తి చేయడంలో మంచి పురోగతి సాధించిందని విశాఖ రీజనల్ సెంట్రల్ ఆఫ్ సీఎం ఎఫ్‌ఆర్‌ఐ సీనియర్ సైంటిస్ట్  డాక్టర్ సుభదీఫ్ ఘోష్ తెలిపారు. సాంకేతిక బృందంతోపాటు, సిబ్బంది పడిన కష్టానికి మంచి ఫలితం దక్కిందన్నారు. సముంద్రపు నీటితోపాటు, వివిధ రకాల నీట్లో లార్వా వృద్ధితోపాటు ఉత్పత్తి చెందేలా చాలా ప్రయోగాలను చేశామన్నారు. ప్రయోగాలఫలితంగా మురిమీను 42రోజుల వ్యవధిలో సుమారు 3 సెంటీమీటర్ల పొడవు వరకు పెరిగిందన్నారు.

 ఏడాదికి లక్షల మురిమీను పిల్లల పంపిణీ
సంవత్సరానికి లక్షల మురిమీను పిల్లల చేపల  పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని  సీఎం ఎప్‌ఆర్‌ఐ డెరైక్టర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ చేపల పెంపకంగా విస్తారంగా పెంపకంచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 

 హై ఎక్స్‌పోర్ట్ మార్కెట్
ఆరెంజ్ స్పాట్స్( గ్రూపర్ ఫిష్) మురిమీను అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉందన్నారు. దీని ఎగుమతికి ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఉష్ణమండల వాతావరణంలో మురిమీను చేపల పెంపకానికి అనువుగా వుంటుందన్నారు. ఆసియా దేశాలైన హాంగ్‌కాంగ్, చైనా, తైవాన్, సింగపూర్,మలేషియా దేశాలలో మంచి డిమాండ్ ఉందన్నారు. దీని ఆయా దేశాలలో అమూర్‌గా పిలుస్తారన్నారు.

చేపల పెంపకం దారులు అధిక లాభాలు
మురిమీను దేశీ చెరువులలో విస్తారంగా పెంపకంగా చేసేందుకు చేపల పిల్లలను పంపిణీ చేయనున్నామన్నారు. దీని పెంపకం ద్వారా చేపల పెంపకందారులు అధిక ఆధాయాన్ని సాధింగలరని సీ ఎంఎఫ్ ఆర్‌ఐ డెరైక్టర్ డాక్టర్ గోపాలకృష్ణణ్ తెలిపారు. తక్కువ వ్యవధిలో అమ్మకానికి సిద్ధంగా చేప పెరుగుతుందన్నారు. దీంతో అనతికాలంలో ఎక్కువ దిగుబడి సైతం సాధించగవచ్చనని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయ చేపల మార్కెట్లో మురిమీను కిలో ధర రూ.400- 500వరకు పలుకుతుందన్నారు. ఇదే అంతర్జాతీయ మార్కెట్‌లో ఇక్కడి ధరకు మూడు,నాలుగు రెట్లు అధికంగా ఉందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement