
లవ్ స్టోరీయే.. కాకపోతే కాస్త వెరైటీ..
నువ్వు నా ప్రాణం సవోరీ..
తెల్లారి లేగానే.. సెంజీ చెప్పే మాట ఇదే..
ఎందుకంటే.. సవోరీ అంటే సెంజీకి ప్రాణం.. అంతకంటే ఎక్కువే..
చూశారుగా ఎలా సేవ చేస్తున్నాడో..
చక్రాల కుర్చీలో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పుతాడు..
షాపింగ్‌కు తీసుకెళ్తాడు..
ఆమెకు నచ్చినవన్నీ కొంటాడు..
సాయంత్రం షికారుకు తీసుకెళ్తాడు..
ఆమెకు కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకుంటాడు..
కంటికి రెప్పలా కాపాడతాడు..
ఆహా.. ఏం లవ్‌స్టోరీ అని అనిపిస్తోంది కదా..
ఇది లవ్ స్టోరీయే.. కాకపోతే కాస్త వెరైటీ..
ఎందుకంటే.. సవోరీ ఓ బొమ్మ.. ఈ 61 ఏళ్ల పెద్దాయన ప్రేమించింది.. ఈ బొమ్మనే.. పెళ్లై ఇద్దరు పిల్లలున్న సెంజీ నకజిమా బిజినెస్‌మన్.. జపాన్‌లోని నగానోలో ఉంటాడు. ఏమైందో ఏమో.. లేటు వయసులో లవ్‌యూ అంటూ ఈ సిలికాన్ బొమ్మ వెంట పడ్డాడు. రూ.3.5 లక్షలు పెట్టి కొని, దీన్ని ఇంటికి తెచ్చుకున్నాడు.. పెళ్లాన్ని పక్కనపెట్టి.. దీన్ని పెళ్లాంలా చూసుకుంటున్నాడు.. ఏమైనా అంటే.. ఇది బొమ్మకాదు.. నా లవర్ అంటూ తిక్కతిక్కగా చెబుతున్నాడట. పైగా ఆమె వ్యక్తిత్వం ఎంతో నచ్చిం దట.. ‘ఈ మనుషులు హృదయం లేని వారు.. మోసం చేయాలని చూస్తారు.. కానీ సవోరీకి డబ్బుపై ఆశ లేదు.. నిర్మల హృదయం కలది’ అంటూ డైలాగులు చెబుతున్నాడు. ఇదిలా ఉంటే.. జపాన్, మరికొన్ని ఆసియా దేశాల్లో ఈ సిలికాన్ బొమ్మలు కొనుగోలు చేసేవారు పెరిగిపోతున్నారట. గర్ల్‌ఫ్రెండ్ సాహచర్యం కావాలనుకునేవారు వీటిని ఎక్కువగా కొంటున్నారట.