ఐరన్‌ లోపానికి అర్క ఐరన్‌ ఫార్టిఫైడ్‌ మష్రూమ్‌ | how to make Arka mushroom fortified rasam mix | Sakshi
Sakshi News home page

ఐరన్‌ లోపానికి అర్క ఐరన్‌ ఫార్టిఫైడ్‌ మష్రూమ్‌

Published Wed, Feb 26 2025 12:58 PM | Last Updated on Wed, Feb 26 2025 12:58 PM

how to make Arka mushroom fortified rasam mix

పుట్టగొడుగులు ఎంతో ఆరోగ్యదాయకమైనవని మనకు తెలుసు. రక్తహీనతకు ఐరన్‌ లోపం పెద్ద సమస్య. మన దేశంలో ముఖ్యంగా మహిళలు, యుక్తవయసు బాలికలు అధిక శాతంలో రక్త హీనతతో బాధపడుతున్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి. 

ఐరన్‌ లోపాన్ని అధిగమించేందుకు బెంగళూరులోని (భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి– ఐసిఎఆర్‌– అనుబంధ సంస్థ) భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్‌) అధిక  పాళ్లలో ఐరన్‌ కలిగి ఉండే పుట్టగొడుగులను రూపొందించింది. ఐరన్‌ ఎల్మ్‌ ఆయిస్టర్‌ మష్రూమ్‌ను ఉత్పత్తి చేసి, దానితో రసం  పొడిని తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవటం ద్వారా రక్తహీనతను అధిగమించవచ్చని ఐఐహెచ్‌ఆర్‌ చెబుతోంది. 

ఎల్మ్‌ ఆయిస్టర్‌ పుట్టగొడుగుల్లో సాధారణంగా ఐరన్‌ 135.60 పిపిఎం స్థాయిలో ఉంటుంది. ఫార్టిఫికేషన్‌ ప్రక్రియ ద్వారా దీన్ని 338.15 పిపిఎంకు ఐఐహెచ్‌ఆర్‌ పెంపొందించింది. అంటే 149.37% పెంచిందన్నమాట. తినే ఆహారంలో ఉన్న పోషకాన్ని కూడా మన దేహం వంట పట్టించుకోగలిగేది తక్కువే ఉంటుంది. సాధారణంగా మొక్కల ఆహారం ద్వారా మనం తీసుకోగలిగే ఐరన్‌ 5–8% మాత్రమే. అదే ఇన్‌ఆర్గానిక్‌ ఐరన్‌ టాబ్లెట్లు వంటి సప్లిమెంట్ల ద్వారా 10–12% ఐరన్‌ను మాత్రమే మన దేహం తీసుకోగలదు. అయితే, ఐఐహెచ్‌ఆర్‌ రూపొందించిన ఆర్క ఐరన్‌ ఫార్టిఫైడ్‌ మష్రూమ్‌ పొడితో రసం తయారు చేసుకొని రోజువారీ భోజనంలో తీసుకుంటే 21.68% ఐరన్‌ను తీసుకోగలుగుతామని ఐఐహెచ్‌ఆర్‌ పేర్కొంది. ఐరన్‌తో ఫార్టిఫై చేసిన పుట్టగొడుగుల పొడిని తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని  కుటీర పరిశ్రమగా ఉత్పత్తి చేసి ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది. 

చదవండి: ఒక్క ర​‍క్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధన
Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?

 

ఇతర వివరాలకు.. 
080–23086100 – ఎక్స్‌టెన్షన్‌ 348, 349. 
mushroomiihr@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement