ఎప్పుడూ ఒకేలా కాకుండా వంటకాలకు ఏదైనా ప్రత్యేకతను జోడించాలని ఆలోచన వస్తే ఎంపికలో మొదటి స్థానంలో ఉండేవి పుట్టగొడుగులు. వెజ్ అయినా.. నాన్ వెజ్ అయినా విందు పసందుగా మార్చేయాలంటే అన్నింటికీ అండగా నేనన్నానంటూ వచ్చి చేరుతాయి. రుచితో పాటు పోషకాలనూ సమృద్ధిగా అందిస్తాయి.
మష్రూమ్స్ మటన్
కావలసినవి:
► మటన్– 500 గ్రాములు; టొమాటో – 250 గ్రాములు; ఉల్లిపాయ – 2 (సన్నగా తరగాలి); బటన్ పుట్టగొడుగులు – 200 గ్రాములు; కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్లు;
► నూనె – 6 టేబుల్ స్పూన్లు; లవంగాలు – 2; ఏలకులు – 2; సాజీర – అర టీ స్పూన్; దాల్చిన చెక్క – చిన్న ముక్క;
► గరం మసాలా – పావు టీ స్పూన్; బిర్యానీ ఆకులు – 2; మెంతిపొడి – అర టీ స్పూన్; అల్లం పేస్ట్ – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు;
► కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి– టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత
తయారీ: ప్రెజర్ పాన్‌లో నూనె వేసి, వేడి చేయాలి.
►లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, సాజీర వేసి, కొన్ని సెకన్ల తర్వాత, ఉల్లిపాయ తరుగు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
► అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి ∙దీంట్లో టమోటా ముక్కలు వేసి, గుజ్జులా అయ్యే వరకు ఉడికించాలి.
► దీంట్లో మటన్ ముక్కలను వేసి, గోధుమ రంగులోకి వచ్చే వరకు ఉడికించాలి.
► తర్వాత పుట్టగొడుగులు, కొబ్బరి పొడి, ఉప్పు వేసి, కప్పు నీళ్లను కలిపి, ప్రెజర్ కుకర్ మూత పెట్టి, 15 నిమిషాలు ఉడికించాలి.
► 10 నిమిషాలు చల్లారేవరకు ఉంచి, ఆ పైన కుక్కర్ మూత తీయాలి.
► ధనియాల పొడి, మసాలా వేసి, 5 నిమిషాలు ఉడికించి, దించాలి.
► కొత్తిమీర తరుగు వేసి, సర్వ్ చేయాలి.
చదవండి: (మాంసాహారం డీప్ ఫ్రై లేదా రోస్ట్ చేస్తే.. ‘హెటెరోసైక్లిక్ అరోమాటిక్ అమైన్స్’ వల్ల)
మష్రూమ్స్ మంచూరియా
కావలసినవి:
►మైదా – అర కప్పు; మష్రూమ్స్ – 250 గ్రాములు; కార్న్‌ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్లు; అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్;
►నీళ్లు – కప్పు; ఉప్పు – తగినంత; పంచదార – అర టీ స్పూన్; పచ్చి మిర్చి – 3 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్;
►కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్; ఉల్లికాడల తరుగు – టేబుల్ స్పూన్; బెల్ పెప్పర్ – 1 (సన్నగా తరగాలి)
సాస్ కోసం: నల్ల మిరియాల పొడి – చిటికెడు; పంచదార – చిటికెడు; సోయా సాస్ – టీస్పూన్
తయారీ:
►పుట్టగొడుగులను కడిగి, తుడిచి, సగానికి కట్ చేయాలి. ఒక గిన్నెలో సాస్ మినహా పై పదార్థాలన్నీ తీసుకోవాలి.
► తగినన్ని నీళ్లు పోసి పిండిని బాగా కలుపుకోవాలి.స్టౌ పై బాణలి పెట్టి, తగినంత నూనె పోసి, వేడి చేయాలి.
► పుట్టగొడుగులను పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, తీసి, పక్కన పెట్టుకోవాలి.
►అదే నూనెలో, కట్ చేసి పెట్టుకున్న ఉల్లి కాడలను వేసి, నిమిషం సేపు వేయించి, తీసి పక్కనుంచాలి.
►నల్ల మిరియాలు, ఉప్పు, చక్కెర, సోయా సాస్ కలిపి పక్కనుంచాలి. ఈ సాస్‌లో వేయించిన పుట్టగొడుగులను వేసి, అన్నింటికీ సాస్ పట్టేలా బాగా కదిలించాలి.
► తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీరతో అలంకరించి, సర్వ్ చేయాలి.
చదవండి: (30 ఏళ్లకే బీపీ, షుగర్.. ఒక్కపూట అన్నానికే పరిమితం.. కోటీశ్వరులు మెచ్చిన తిండి..)
Comments
Please login to add a commentAdd a comment