
ఆస్ట్రేలియాకు చెందిన 58 ఏళ్ల రాబర్ట్ వెబర్ క్వీన్స్‌లాండ్‌లోని ఓ హోటల్ నుంచి తన పెంపుడు కుక్కతో జనవరి 6న బయటకు వెళ్లారు. ఆరోజు నుంచి అతను మళ్లీ ఎవరికీ కనిపించలేదు. ఆ తరువాత 18 రోజుల తర్వాత అంటే జనవరి 24 ఆదివారం అతన్ని పోలీసులు గుర్తించి రక్షించారు. కాగా వెబర్ పంటపొలాలు ఉన్న ఒక రోడ్డులో వెళ్తుండగా తన కారు మట్టిలో కూరుకుపోయింది. కారు అటూ ఇటూ కదలలేని పరిస్థితి. దాంతో ఎంత ప్రయత్నించినా అతను బయటకు రాలేక కారులోనే ఉండిపోయాడు. మూడురోజుల తరువాత అతికష్టం మీద కారునుంచి బయటపడి దగ్గరల్లో ఉన్న డ్యామ్ దగ్గరకు వెళ్లాడు.
అక్కడ కాస్త సేదతీరిన తరువాత అక్కడ దొరికిన పుట్టగొడుగులు(మష్రూమ్స్), డ్యామ్‌లోని నీటిని తాగి ప్రాణాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే ఆదివారం స్థానిక ఎంపీ టోనీ పెరెట్ అటుగా వెళ్తుండగా.. వెబర్ ఒక చెట్టుకింద కూర్చొని కనిపించడంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన పోలీసులు వెబర్‌ను రక్షించి వైద్యసాయం అందిస్తున్నారు. వెబర్ శరీరంలో వైటల్స్ తగ్గడం వల్ల కాస్త నీరసంగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు. అయితే తనతో వచ్చిన పెంపుడు కుక్క ఆచూకీ మాత్రం ఇంతవరకు దొరకలేదు.
భౌభౌ రికార్డు
కాలిఫోర్నియాకు చెందిన విష్, హలో అనే రెండు శునకాలు ఒకే నిమిషంలో ‘28’ ట్రిక్స్ ప్రదర్శించి వరల్డ్ రికార్డ్ సెట్ చేశాయి. గతంలో ఉన్న రికార్డ్‌ను బ్రేశాయి. జంప్, క్యాచ్, ఫార్వర్డ్, ఎరౌండ్ లెఫ్ట్, ఎరౌండ్ రైట్, డౌన్...ఇలా ఈ శునకాల రకరకాల ట్రిక్స్ వీడియో చూస్తే ఆశ్చర్యమే కాదు బోలెడంత నవ్వు కూడా వస్తుంది. వీటి పిల్లలు కికో, స్పానిష్, టగ్‌లు చిన్న చిన్న రికార్డుల కోసం శిక్షణ పొందుతున్నాయి. ట్రైనర్ ఎమిలీ లర్ల్‌హమ్ శునకాల కోసం ప్రత్యేకమైన యూట్యూబ్ చానల్ నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment