missing man
-
కుక్కను రక్షించబోయి.. ఎస్సార్బీసీలో పడి యువకుడు గల్లంతు
అవుకు: శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్సార్బీసీ)లో పడిన పెంపుడు కుక్కను రక్షించబోయి ఓ యువకుడు నీళ్లలో కొట్టుకోపోయాడు. రామవరం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. రామవరం గ్రామానికి చెందిన నాగరాజు, నారాయణమ్మ కుమారుడు మాసుబాకల నరేష్ (18).. ఇంటర్ పూర్తి చేశాడు. ఇంటి వద్ద ఖాళీగా ఉండటంతో మంగళవారం గేదెలను మేపటానికి వెళ్లాడు. వెంట ఉన్న కుక్క గ్రామ శివారులోని ఎస్సార్బీసీలో పడిపోయింది. దానిని రక్షించటానికి వెళ్లిన ఆయువకుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. అటుగా వెళ్తున్న ఓ బాలుడు గుర్తించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు క్రేన్ సహాయంతో ఈతగాళ్లను కాలువలోకి దించి రాత్రి వరకు గాలించారు. అయినా, యువకుడి ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాలువలో కొట్టుకుపోయి ఉంటాడని స్థానికలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు నీటిలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. -
పండ్ల మార్కెట్‌కు వెళ్లిన వ్యక్తి.. బావిలో శవమై..!
సాక్షి, రాజానగరం: చక్రద్వారబంధానికి చెందిన పండ్ల వ్యాపారి శెన్నంశెట్టి శ్రీనివాసరావు (శ్రీను) (45) అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని కశింకోట మండలం చింతలపాలెంలో రహదారిని ఆనుకుని ఉన్న నేలబావిలో అతడు శవమై తేలాడు. అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. రాజమహేంద్రవరంలోని మామిడి పండ్ల మార్కెట్‌కు వెళ్లి వస్తానని ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరిన శ్రీను తిరిగి రాలేదు. ఆ రోజంతా అతడి కోసం ఎదురు చూసిన కుటుంబ సభ్యులు సోమవారం చుట్టుపక్కల గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో అతడి కుమారుడు వీరబాబు రాజానగరం పోలీసులను ఆశ్రయించాడు. జాతీయ రహదారిపై సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. శ్రీను విశాఖ వైపు వెళ్లినట్టు గుర్తించారు. ఇంటి నుంచి వచ్చిన అతడు సూర్యారావుపేట జంక్షన్‌లోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద మోటార్ సైకిల్‌ను పార్క్ చేశాడు. తన సెల్‌ఫోన్ కూడా బైక్ కవర్లోనే ఉంచి, తాళాలను మ్యాట్ కింద పెట్టి, విశాఖ వైపు వెళ్లే లారీ ఎక్కినట్టు సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డయింది. ఇదిలా ఉండగా ‘గుర్తు తెలియని వ్యక్తి మృతి’ అంటూ వివిధ పత్రికల విశాఖ జిల్లా ఎడిషన్లలో మంగళవారం వార్తలు వచ్చాయి. అవి చూసిన కుటుంబ సభ్యులు ఒంటిపై ఉన్న దుస్తుల వివరాలను బట్టి అనుమానంతో అక్కడకు వెళ్లారు. ఆ మృతదేహం శ్రీనుదేనని గుర్తించారు. అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో భద్రపరిచిన శ్రీను మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసును రాజానగరం ఎస్సై శివనాగబాబు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమా? సీజనల్ పండ్లు విక్రయిస్తూ జీవనం సాగించే శ్రీనివాసరావు ఆయా సీజన్లలో పండ్ల కోసం తోటలు కొనుగోలు చేసి, వ్యాపారం చేస్తుంటాడు. మూడేళ్లుగా తోటలపై పెట్టుబడులు అధికం కావడం, వ్యాపారాలు అనుకున్నంతగా లేకపోవడంతో అప్పుల భారం పెరిగిందని గ్రామస్తులు అంటున్నారు. అయితే అతడికి ఉన్న ఆస్తుల దృష్ట్యా ఇటువంటి అఘాయిత్యం చేసుకునే అవసరం కూడా లేదని చెబుతున్నారు. శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చదవండి: భర్త అనుమానం.. ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య -
కారు మట్టిలో కూరుకుపోయి..18 రోజుల తర్వాత
ఆస్ట్రేలియాకు చెందిన 58 ఏళ్ల రాబర్ట్ వెబర్ క్వీన్స్‌లాండ్‌లోని ఓ హోటల్ నుంచి తన పెంపుడు కుక్కతో జనవరి 6న బయటకు వెళ్లారు. ఆరోజు నుంచి అతను మళ్లీ ఎవరికీ కనిపించలేదు. ఆ తరువాత 18 రోజుల తర్వాత అంటే జనవరి 24 ఆదివారం అతన్ని పోలీసులు గుర్తించి రక్షించారు. కాగా వెబర్ పంటపొలాలు ఉన్న ఒక రోడ్డులో వెళ్తుండగా తన కారు మట్టిలో కూరుకుపోయింది. కారు అటూ ఇటూ కదలలేని పరిస్థితి. దాంతో ఎంత ప్రయత్నించినా అతను బయటకు రాలేక కారులోనే ఉండిపోయాడు. మూడురోజుల తరువాత అతికష్టం మీద కారునుంచి బయటపడి దగ్గరల్లో ఉన్న డ్యామ్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ కాస్త సేదతీరిన తరువాత అక్కడ దొరికిన పుట్టగొడుగులు(మష్రూమ్స్), డ్యామ్‌లోని నీటిని తాగి ప్రాణాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే ఆదివారం స్థానిక ఎంపీ టోనీ పెరెట్ అటుగా వెళ్తుండగా.. వెబర్ ఒక చెట్టుకింద కూర్చొని కనిపించడంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన పోలీసులు వెబర్‌ను రక్షించి వైద్యసాయం అందిస్తున్నారు. వెబర్ శరీరంలో వైటల్స్ తగ్గడం వల్ల కాస్త నీరసంగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు. అయితే తనతో వచ్చిన పెంపుడు కుక్క ఆచూకీ మాత్రం ఇంతవరకు దొరకలేదు. భౌభౌ రికార్డు కాలిఫోర్నియాకు చెందిన విష్, హలో అనే రెండు శునకాలు ఒకే నిమిషంలో ‘28’ ట్రిక్స్ ప్రదర్శించి వరల్డ్ రికార్డ్ సెట్ చేశాయి. గతంలో ఉన్న రికార్డ్‌ను బ్రేశాయి. జంప్, క్యాచ్, ఫార్వర్డ్, ఎరౌండ్ లెఫ్ట్, ఎరౌండ్ రైట్, డౌన్...ఇలా ఈ శునకాల రకరకాల ట్రిక్స్ వీడియో చూస్తే ఆశ్చర్యమే కాదు బోలెడంత నవ్వు కూడా వస్తుంది. వీటి పిల్లలు కికో, స్పానిష్, టగ్‌లు చిన్న చిన్న రికార్డుల కోసం శిక్షణ పొందుతున్నాయి. ట్రైనర్ ఎమిలీ లర్ల్హమ్ శునకాల కోసం ప్రత్యేకమైన యూట్యూబ్ చానల్ నిర్వహిస్తోంది. -
అదృశ్యమై.. శవమై కనిపించాడు!
అద్దంకి: ఓ వ్యక్తి రెండు నెలల క్రితం అదృశ్యమై శుక్రవారం శవమై కనిపించాడు. ఈ సంఘటన మండలంలోని వెంపరాల కొండపై వెలుగు చూసింది. ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీలు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు వెల్లడించారు. ఎస్సై కథనం ప్రకారం.. వెంపరాలకు చెందిన నేరెళ్ల యోహాన్ (50)కి భార్య అన్నమ్మ ఉంది. ముగ్గురు కుమార్తెలుకాగా అందరికీ వివాహాలయ్యాయి. కుమారుడు హైదరాబాదులో బేల్దారి పనులు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో యోహాన్ తరచూ మద్యం తాగి భార్యను, గ్రామస్తులను ఇష్టం వచ్చినట్లు తిడుతుండేవాడు. రెండు నెలల క్రితం భార్యపై పోట్లాడి రూ.వెయ్యి తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. పురుగుమందు డబ్బా, మద్యం సీసా కొనుగోలు చేసి కొండపైకి వెళ్లి అక్కడ రెండూ కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త కనిపించకపోవడంతో మతిస్థిమితం లేక ఎటో వెళ్లిపోయి ఉంటాడని భార్య భావించింది. ఈ నేపథ్యంలో ఉపాధి పనుల్లో భాగంగా కొండపై కందకాలు తీసేందుకు వెళ్లిన కూలీలు అక్కడ యోహాన్ మృతదేహం ఆనవాళ్లు గుర్తించి పోలీసులు, ఆయన బంధువులకు సమాచారం ఇచ్చారు.