Recipe: మష్రూమ్‌ పాప్‌ కార్న్‌ ఇలా చేసుకుంటే టేస్ట్‌ అదిరిపోద్ది! | Recipes In Telugu: How To Make Mushroom Popcorn | Sakshi
Sakshi News home page

Mushroom Popcorn: మష్రూమ్‌ పాప్‌ కార్న్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా!

Published Sun, May 29 2022 1:51 PM | Last Updated on Sun, May 29 2022 1:59 PM

Recipes In Telugu: How To Make Mushroom Popcorn - Sakshi

పుట్టగొడుగు కర్రీ బోర్‌ కొట్టిందా.. అయితే.. మష్రూమ్‌ పాప్‌కార్న్‌ను ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని కొత్త రుచిని ఆస్వాదించండి.

మష్రూమ్‌ పాప్‌ కార్న్‌ తయారీకి కావలసినవి:
►పుట్టగొడుగులు – 15 నుంచి 20 లోపు(శుభ్రం చేసుకుని, ముక్కల్లా కట్‌ చేసుకుని పెట్టుకోవాలి)
►అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, కారం, 
►చాట్‌ మసాలా  – 1 టీ స్పూన్‌  చొప్పున
►మైదా , నిమ్మరసం, జీలకర్ర పొడి, గరం మసాలా
►పాలు – 1 టేబుల్‌ స్పూన్‌  చొప్పున
►ఓట్స్‌ పౌడర్, బ్రెడ్‌ పౌడర్‌ – 5 టేబుల్‌ స్పూన్లు చొప్పున(రెండు కలిపి పెట్టుకోవాలి)
►గుడ్లు – 2 (ఒక గుడ్డుని పాలలో కలిపి పెట్టుకోవాలి)
►ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

మష్రూమ్‌ పాప్‌ కార్న్‌ తయారీ:
►ముందుగా ఒక గిన్నెలో పుట్టగొడుగు ముక్కలు వేసుకోవాలి.
►అందులో అల్లం–వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కారం, చాట్‌ మసాలా, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్‌  నూనె, ఒక గుడ్డు వేయాలి.
►ఆ మిశ్రమాన్ని  ముక్కలకు బాగా పట్టించి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
►అనంతరం ఒక చిన్న బౌల్‌లో ఓట్స్, జీలకర్ర పొడి, గరం మసాలా, మైదా వేసుకొని బాగా కలిపి ఉంచాలి.
►కళాయిలో నూనె వేడి చేసుకుని, ఒక్కొక్క పుట్టగొడుగు ముక్కను మొదట గుడ్డు–పాల మిశ్రమంలో, ఆపై ఓట్స్‌–బ్రెడ్‌ పౌడర్‌ మిశ్రమంలో ముంచి బాగా పట్టించి నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది.

ఇది కూడా ట్రై చేయండి: Mutton Rogan Josh Recipe In Telugu: అన్నం, రుమాలీ రోటీలోకి అదిరిపోయే మటన్‌ రోగన్‌ జోష్‌! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement