సరవకోట (శ్రీకాకుళం) : పొలంలో దొరికిన పుట్టగొడుగులను కూర చేసుకుని తిని ముగ్గురు అస్వస్థత పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా సరవకోట మండలం బుడితి గ్రామంలో ఈ ఘటన జరిగింది. భారతి అనే మహిళ పొలంలో పుట్టగొడుగులు కనిపించగా వాటిని తీసుకొచ్చి సోమవారం ఉదయం కూర చేసింది. దానిని ఆమెతోపాటు పిల్లలు యయాత్(10), సంతోషి (13)లకు పెట్టింది.
అనంతరం ఆమె పొలానికి వెళ్లగా, పిల్లలు స్కూల్‌కు వెళ్లారు. యయాత్, సంతోషిలకు స్కూల్లో వాంతులు కాగా, వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భారతికి కూడా పొలంలో వాంతులు అవుతుండడంతో ఆమెను కూడా ఆస్పత్రికి తరలించారు.
పుట్టగొడుగులు తిని ముగ్గురికి అస్వస్థత
Published Mon, Sep 7 2015 6:58 PM | Last Updated on Fri, Oct 5 2018 6:48 PM
Advertisement