Ingredients
-
జిమ్‌కి వెళ్లేవాళ్లకి ఇది పర్ఫెక్ట్.. క్యాలరీల ప్రకారం తినేయొచ్చు
వంటలో ఏది ఎంత.. ఎప్పుడు వేయాలి? అనే విషయం తెలిస్తే వంట చేయడం పెద్ద కష్టమేం కాదంటారు చాలామంది. ఏది ఎప్పుడు వేయాలనేదానిపై క్లారిటీ కోసం కుకింగ్ వీడియోలను ఫాలో అయితే చాలు. అదే ఎక్కువ మోతాదులో వంటకు అంతే ఎక్కువ మోతాదులో ఇన్‌గ్రీడియెంట్స్‌ని వేయాల్సి వస్తే? ఈ డిజిటల్ మెజరింగ్ డివైస్‌ను వంటింట్లో ప్లేస్ చేస్తే సరి! యూజర్ ఫ్రెండ్లీ ఫంక్షనాలిటీ కలిగిన ఈ మెషిన్.. పిండి, నూక, పాలు, నీళ్లు ఇలా దేన్నైనా కొలిచి.. సరైన మోతాదులో చూపిస్తుంది. జిమ్‌కి వెళ్తూ లేదా డైట్ చేస్తూ కొలతప్రకారం తినేవాళ్లకు ఈ మెషిన్ భలే ఉపయోగపడుతుంది. దీనిపైనున్న పాత్ర సులభంగా డివైస్ నుంచి వేరుపడుతుంది. స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ పాత్రను క్లీన్ చేయడమూ తేలికే. ఇది బ్యాటరీలపై చక్కగా పని చేస్తుంది. -
Mushroom Omelette: మష్రూమ్స్ ఆమ్లెట్.. వేయడం చాలా ఈజీ!
కావలసినవి: పుట్టగొడుగులు – 5 (నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. అయితే ముక్కల్ని పలుచగా తరగాలి) గుడ్లు – 3, చిక్కటి పాలు – 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – కొద్దిగా, బటర్ – 1 టీ స్పూన్ చీజ్ తురుము – 1 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు – తగినంత, నూనె – సరిపడా కొత్తిమీర తురుము – గార్నిష్‌కి కొద్దిగా తయారీ: ముందుగా ఒక బౌల్లో గుడ్లు, ఉప్పు, పాలు, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం పెనంలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని.. వేడి కాగానే పుట్టగొడుగు ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. ముక్క బాగా మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుని.. అదే పెనంలో కొద్దిగా నూనె, బటర్ వేసుకుని, బటర్ కరిగిన తర్వాత.. ఎగ్స్ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసుకోవాలి. పైన చీజ్ తురుము వేసుకుని.. చిన్న మంట మీద ఉడకనివ్వాలి. అనంతరం పుట్టగొడుగుల మిశ్రమాన్ని ఆమ్లెట్కి మధ్యలో నిలువుగా పరచి.. ఆమ్లెట్‌ని ఇటువైపు నుంచి అటు వైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. పైన కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరి! క్లిక్ చేయండి: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా -
ఇలా చేస్తే.. ముఖంపై ఎలాంటి మచ్చలైనా మటుమాయం
ఎత్తుకు తగిన బరువుతో ఆకర్షణీయమైన పర్సనాలిటీతో నలుగురిన్నీ ఆకట్టుకుంటూ ఉండాలని అందరమూ కోరుకుంటాం. కానీ అన్నీ బావున్నా.. తీరా ముఖం దగ్గరికొచ్చేసరికి మచ్చలు కొంతమందిని వేధిస్తూ ఉంటాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే ఈ నల్లటి మచ్చలనే మంగు మచ్చలంటారు. ఈ మచ్చలు ముఖం రెండు వైపులా బుగ్గలపై నుంచి ముక్కు వరకూ వ్యాపిస్తాయి. ఇవి ముఖంతో పాటు మెడ, భుజాలు, వీపు వెనుకభాగంలో కూడా ఏర్పడే అవకాశం ఉంది. శరీరతత్వాన్ని బట్టి ముఖంపై మొటిమలు, పులిపిర్లు, పెద్ద పరిమాణంలో ఉండే పుట్టుమచ్చలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు మొదలైనవి ఏర్పడుతుంటాయి. వీటిలో కొన్ని వంశ పారంపర్యంగా వస్తే, మరికొన్ని హార్మోన్లలో సమతుల్యత లోపించడం వల్ల కూడా రావచ్చు. వంశ పారంపర్యంగా వచ్చే మచ్చలను నివారించలేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. ముఖంపై మంగు మచ్చలు లేదా, నల్లటి మచ్చలు వ్యాధి కాదు కానీ, వీటితో ఆత్మన్యూనతతో పదిమందిలోకీ వెళ్లడానికి ఇబ్బంది పడతారు. అసలు ఇలాంటి మచ్చలు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వాటిని నివారించ వచ్చు. తొలిదశలోనే ఉన్న వాటిని చిన్న చిన్న చిట్కాలతో నయం చేసుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలతో ముఖంపై మంగు మచ్చలు మాయం. తాజా వెన్నను ముఖంపైన ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే క్రమేణా పలచబడి కొంతకాలానికి చర్మం రంగులో కలిసిపోతాయి. పచ్చి పసుపు, ఎర్రచందనం సమభాగాలుగా కలిపి పాలల్లో కలిపి రాస్తుంటే మంగు మచ్చలు, చెంపలపైన ఉన్న నల్లని మచ్చలూ తగ్గుతాయి. జాజికాయను పాలలో అరగదీసి రాయడం వల్ల గుణం కనిపిస్తుంది. పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తుంటే కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది. పావు టీ స్పూన్నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. టొమాటోను రెండు ముక్కలుగా తరిగి, వాటితో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే నల్ల మచ్చలు తగ్గడంతోపాటు ముఖవర్చస్సు పెరుగుతుంది. అలోవెరా పేస్టును మచ్చలపై పూయాలి. ఆ మచ్చతడి ఆరిపోయాక చల్లని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మచ్చలు తగ్గిపోతాయి. టీ స్పూన్టొమాటో రసం, టీ స్పూన్గంధం పొడి, రెండు టీ స్పూన్ల ముల్తాని మట్టి కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. రోజ్‌వాటర్, కీరా రసం, నిమ్మరసం, తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుతుంటే నెల రోజులు గడిచేసరికి మంచి మార్పు వస్తుంది. బంగాళదుంప చెక్కు తీసి, సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండి, రసం తీయాలి. దానిలో దూది ఉండలని ముంచి, వాటితో మచ్చలపై అద్దాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైనంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటం. ఆత్మన్యూనతతో ఉంటే మరింత కృంగిపోతాం. పదే పదే అందవిహీనంగా ఉన్నామనే విషయాన్ని గుర్తు చేసుకుంటే డిప్రెషన్‌కు లోనవుతాం. సో అలాంటివన్నీ పక్కన పెట్టి, సహజ పద్ధతుల్లో పరిష్కారానికి ప్రయత్నించడం, లేదంటే నిపుణులైన డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఆత్మవిశ్వాసంతో ఉండి చక్కగా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటే ఏ మచ్చలూ మన అందాన్ని మసక బార్చలేవు. -
రుచుల పండుగ రంజాన్.. 10 వెరైటీలు మీకోసం!
రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు సుహార్, సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ విందు కానిస్తారు. కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ ఇచ్చి పుచ్చుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఈ ఇఫ్తార్ లో వడ్డించే వంటకాలు అద్భుతమైన రుచులతో ఉంటాయి. వీటిలో 10 వెరైటీల గురించి కలినరీ స్పెషలిస్ట్ పల్టి హరినాథ్ వివరిస్తున్నారు. సాధారణంగా రంజాన్ వేళ ఉపవాసదీక్షను ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, నిమ్మరసంతో ముగిస్తారు. అయితే ఈ పండుగ విందుల్లో ఆరగించే టాప్ 10 వంటకాల్లో... ► హలీమ్ – ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా దర్శనమిచ్చే ఫుడ్ వెరైటీ ఇది. మటన్‌ను పప్పుదినుసులు, గోధుమలు, మసాలాలు, డ్రై ఫ్రూట్స్‌లో నిదానంగా ఉడికించి తయారుచేస్తారు. ఈ ఫుడ్ అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. ► కెబాబ్స్:మటన్ లేదంటే చికెన్ ముక్కలను పెరుగు, మసాలాలలో నానబెట్టి అనంతరం ఫ్రై చేయడం లేదా స్క్రూ చేయడం లేదా బార్బిక్యు చేయడం ద్వారా వీటిని వండుతారు. ► చికెన్ షావార్మా – అత్యంత ప్రాచుర్యం పొందిన మధ్య ప్రాశ్చ్య డిష్ ఇది. సన్నగా కోసిన చికెన్ లేదా మటన్ ముక్కలను బ్రెడ్ లోపల కూరగాయలు, సాస్ కలిపి ఆరగిస్తారు. ► కీమా సమోసా – గోధుమ పిండి, మటన్‌తో తయారుచేసే ఈ సమోసాలు భారతీయ రుచుల సంగమంగా నిలుస్తాయి. ► మటన్ రెసాలా – ఇది పూర్తిగా బెంగాలీ డిష్. బోన్ మటన్ పీస్‌లను పెరుగులో నానబెట్టి , జీడిపప్పు, గసగసాల పేస్ట్‌తో పాటుగా భారతీయ మసాలాలు కూడా కలిపి తయారుచేస్తారు. పరాటా లేదా నాన్‌తో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ► దమ్ బిర్యానీ – దక్షిణ భారతదేశంలో దీనిని విభిన్న రకాలుగా చేయడం కనిపిస్తుంది. ప్రధానంగా బియ్యం, మటన్ లేదా చికెన్, మసాలాలు నెయ్యి, కుంకుమపువ్వుతో చేస్తారు. కొన్నిసార్లు కూరగాయలు, సోయా ముక్కలు, సీఫుడ్‌తో కూడా ఈ బిర్యానీ చేయడం కనిపిస్తుంది. ► ఫలాఫెల్ –అంతర్జాతీయంగా ఎక్కువ మంది ఇష్టపడే వంటకాలలో ఫలాఫెల్ ఒకటి. బటానీ గింజలు లేదంటే ఫవా బీన్స్ లేదా రెండింటినీ కలిపి తయారుచేసిన బాల్ లేదా పట్టీ ఫలాఫెల్. వీటిని సాధారణంగా హమ్మస్‌తో పాటుగా తహినీ సాస్‌తో కలిపి ఇఫ్తార్ సమయంలో సర్వ్ చేస్తారు. . ► షీర్ ఖుర్మా – మొఘలాయ్ వంటకం ఇది. షీర్ అంటే పాలు, ఖుర్మా అంటే ఖర్జూరం. రెండింటి మేళవింపే ఈ షీర్ఖుర్మా దీని ఆకృతి మాత్రమే కాదు, రుచి కూడా వినూత్నంగా ఉంటుంది. ► అఫ్లాటూన్– ప్రత్యేక తియ్యని వంటకం అఫ్లాటూన్ . స్వచ్ఛమైన నెయ్యి, నట్స్‌తో తయారుచేస్తారు. రంజాన్ వేళ భోజనం ముగించేందుకు అత్యుత్తమ డిష్ ఇది. రూ అఫ్జా – రంజాన్ మాసంలో సాధారణంగా తయారుచేసే షర్బత్ ఇది. దీనిలో వనమూలికలు, పండ్లు, కూరగాయలు, పూలు, వేర్లు కూడా భాగంగా ఉంటాయి. ప్రత్యేకమైన రుచులు, కూలింగ్ ఎఫెక్ట్ దీనిని మిలిగిన పానీయాలకు భిన్నంగా నిలుపుతుంది. ఈ రూ అఫ్జా సిరప్‌ను కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, సేమియాలలో కూడా కలిపి తీసుకోవచ్చు. ఐకమత్యం పెంచే రుచులు... ఇది నిజంగా జష్న్–ఏ–రంజాన్. విభిన్నరకాల అభి‘రుచుల’ను సంతృప్తి పరిచే విధంగా వెరైటీ డిషెస్‌ను రంజాన్ మోసుకొస్తుంది. అందుకు తగ్గట్టే ఏర్పాటయ్యే ఇఫ్తార్ విందులు అందర్నీ ఆకట్టుకుంటాయి. –మితేష్ లోహియా, డైరెక్టర్, సేల్స్–మార్కెటింగ్, గోల్డ్ డ్రాప్ -
చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇన్‌గ్రీడియంట్స్ (ఏపీఐ) దిగుమతులపై భారత ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా పెంచాలని ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది. ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్స్ (డీఐ), ఏపీఐల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ఔషధ పరిశ్రమలకు ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక (పిఎల్ఐ)పథకాన్ని ఇటీవల డీఓపీ ప్రకటించింది. ప్రస్తుతం చైనాపై ఎక్కువగా ఆధారపడిన 53 కీలకమైన ఏపీఐలతో సహా 41 ఇతర ఉత్పత్తులకు ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి భారతీయ కంపెనీలకు 10 వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భూమిపై జీవం.. చెరువులే మూలం
బోస్టన్: విశాల విశ్వం.. నక్షత్రాలు.. గ్రహాలు.. కోటానుకోట్ల జీవరాశులు. కంటికి కనిపించేవి కొన్నే.. కనిపించనివి అనంతం. విశ్వం ఎప్పుడు ఆవిర్భవించిందో తెలియదు.. జీవరాశి పుట్టుక వివరాలు తెలియవు. వీటికి సంబంధించిన అన్ని విషయాలూ రహస్యాలే. ఈ రహస్యాలన్నింటిని ఛేదించేందుకు ఏళ్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలు.. అయినా అంతంత మాత్రమే ఫలితాలు. తాజాగా జీవ రాశి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఓ అధ్యయనంలో వెలువడ్డాయి. భూమిపై జీవరాశి పుట్టుకకు చెరువులు ముఖ్యపాత్ర పోషించాయని అమెరికాలోకి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మిట్) నిర్వహించిన ఈ అధ్యయనంలో తేలింది. పెద్ద పెద్ద సముద్రాల కంటే కూడా చెరువులే జీవరాశికి అనువైన వాతావరణాన్ని భూమిపై సృష్టించాయని తెలిపింది. అది కూడా 10 సెంటీమీటర్లకు అటూఇటుగా ఉండే చెరువులే జీవానికి ఊపిరి పోశాయని పేర్కొంది. చెరువులే ఎందుకు.. భూమిపై జీవం పుట్టుకకు అవసరమైన వాటిల్లో అధిక సాంద్రత గల నైట్రోజన్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఎక్కువ మంది శాస్త్రవేత్తలు భావిస్తారు. నైట్రోజన్ ఆక్సైడ్లు సముద్రాలు, చెరువుల్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇవి వాతావరణంలోని ఇతర మిశ్రమాలతో కలసి జీవం పుట్టుకకు బాటలు వేస్తుందని చెబుతారు. అయితే ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మిట్కు చెందిన పరిధకులు సుక్రిత్ రంజన్ మాట్లాడుతూ..‘లోతైన సముద్రాల్లో ఉండే నైట్రోజన్ వల్లే జీవం ఉద్భవించి ఉంటుందని అనుకోవడం సరికాదు. ఎందుకంటే లోతైన సముద్రాల్లోని నైట్రోజన్.. వాతావరణంలోని ఇతర మిశ్రమాలతో ప్రతిచర్య జరిపే అవకాశాలు చాలా తక్కువ. అలాగే అతి నీలలోహిత కిరణాలు, సముద్రాల్లోని ఐరన్ ధాతువులు నైట్రోజన్ మిశ్రమాన్ని అధిక శాతంలో నాశనం చేసే అవకాశం ఉంది. అనంతరం మిగిలిన కొద్ది మొత్తంలోని నైట్రోజన్‌ను వాయువు రూపంలో తిరిగి వాతావరణంలోకి పంపించేస్తాయి. దీంతో సముద్రాల్లో నైట్రోజన్ జీవం పుట్టుకకు ఎంతమాత్రం దోహదపడే అవకాశం లేదు. మరోవైపు చెరువుల్లోని నైట్రోజన్ ఆక్సైడ్ల వల్లే భూమిపై జీవం ఆవిర్భవించే అవకాశాలు అత్యధికం. చెరువుల్లో నైట్రోజన్ ఆక్సైడ్ల రూపంలో నిక్షిప్తమైన నైట్రోజన్ మిశ్రమం వాతావరణంలోని ఇతర మిశ్రమాలతో ప్రతిచర్య జరిపే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే చెరువుల్లో మిశ్రమాలు కరిగే అవకాశాలు చాలా తక్కువ. మొత్తంగా చూస్తే.. శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లుగా జీవం పుట్టుకకు నైట్రోజన్ అవసరమై.. అదీ సముద్రాల్లోనిదే అయ్యిండాలంటే మాత్రం భూమిపై జీవం పుట్టుక అనేది దాదాపు అసాధ్యం. చెరువుల్లో ఉండే నైట్రోజన్‌తో మాత్రమే భూమిపై జీవం ఆవిర్భవించి ఉండేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి’అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
సౌరశక్తిని ఒడిసిపట్టేందుకు కొత్త టెక్నిక్...
సౌరశక్తి ఏటికేడాదీ చౌక అవుతున్నప్పటికీ అది ఇప్పటికే సామాన్యుడి చేతికి అందేస్థాయిలో లేదన్నది నిర్వివాద అంశం. ఈ పరిస్థితి త్వరలో మారనుందని అంటున్నారు ద సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు. సౌరశక్తిని మరింత ఎక్కువగా ఒడిసిపడుతూనే అందుకయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించేందుకు తాము నానోటెక్నాలజీ ఆధారంగా వినూత్న పదార్థాలను సిద్ధం చేశామని యాండ్రూ లెవీన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. సింగ్లెట్ ఫిషన్ అనే ఓ భౌతికశాస్త్ర ప్రక్రియ ద్వారా ఈ పదార్థాలు ఎలక్ట్రాన్లు ఎక్కువ సమయంపాటు మనుగడలో ఉండేలా చేస్తాయని లెవీన్ చెప్పారు. దీనివల్ల సూర్యుడి కిరణాల్లోని శక్తిని కనీసం 44 శాతం వరకూ విద్యుత్తుగా మార్చుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ పరిమితి 33 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. అంతేకాకుండా.. ఈ పదార్థాలు తమంతట తామే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో అమరిపోతాయని దీనివల్ల సూర్యరశ్మిలోని ఫొటాన్ల శక్తిని పరిసరాల్లోని పదార్థాలతో పంచుకునే వీలేర్పడుతుందని ఫలితంగా అధిక విద్యుదుత్పత్తి సాధ్యమని లెవీన్ వివరించారు. -
వంటింట్లో కల్తీ మంట!
- కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కల్తీనే - నగరంలో అక్రమ తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు - కల్తీ ఆహార పదార్థాల స్వాధీనం హైదరాబాద్: వెంకటేశ్వర్లు ఎప్పటిలాగే కిరాణా దుకాణానికి వెళ్లి కావాల్సిన సరుకులన్నీ పట్టుకొచ్చాడు. రెండు మూడు రోజుల తరువాత ఇంట్లో అందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి వెళితే.. పరీక్షలు జరిపి ఆహారం కల్తీ జరిగిందని తేల్చారు. చివరికి వారు వినియోగించిన కారం, పసుపు కల్తీ అయిందని తేలింది. ఎప్పుడూ వాడే బ్రాండే అయినా ఎందుకు ఇలా.. అంటే పైన కవర్ మాత్రమే బ్రాండెడ్.. లోపల ఉన్న పదార్థం మాత్రం కల్తీ జరిగింది. నగరంలో ఇప్పుడు ఇలాంటి పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. గుట్టుచప్పుడు కాకుండా ఆహార కల్తీకి పాల్పడుతున్నాయి. హైజెనిక్ కండీషన్స్ ప్రొడక్ట్ అంటూ మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇలాంటి వాటిపై లాభం అధికంగా ఉండడంతో దుకాణ వాసులు అమ్మకానికి మొగ్గుచూపుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలు వినియోగించిన వారు మాత్రం ఆసుపత్రులపాలవుతున్నారు. ఇలాంటి పరిశ్రమలపై పోలీసులు రెండు రోజులుగా దాడులు జరుపుతున్నారు. దాడులు ఎక్కడ... భారీ ఎత్తున కల్తీ ఆహార పదార్థాలను హబీబ్‌నగర్ పోలీసులు సీజ్ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా కల్తీ పసుపు, ధనియాలు, కారం, అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని తయారు చేస్తున్న పరిశ్రమపై దాడులు నిర్వహించారు. రూ.పది లక్షలకుపైగా కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీకి వాడే రసాయనాలను ధ్వంసం చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన నిర్వాహకుడు మహ్మద్ జావెద్ అక్తర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరిశ్రమలో పనిచేస్తున్న పది మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడిపై ఐపీసీ 272, 273, 336, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తయారీ ఇలా... మహ్మద్ జావెద్ అక్తర్ కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. నగరంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని అఫ్జల్‌సాగర్‌లో రెండు ఇళ్లను అద్దెకు తీసుకున్నాడు. ఈ ఇళ్లలో మిర్చి, పసుపు, ధనియాలు, అల్లం వెల్లుల్లి మిశ్రమాలను తయారు చేయిస్తున్నాడు. బిహార్ నుంచి తీసుకొచ్చిన కొందరు యువకులను ఈ పరిశ్రమలో పనికి పెట్టాడు. రాత్రివేళల్లో లోడింగ్, అన్లోడింగ్ చేస్తూ తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. నగరంలోనే కాకుండా బయటి జిల్లాలకు తరలిస్తున్నారు. పదార్థాల సీజ్... ఈ స్థావరాలపై పోలీసులు సోమవారం ఉదయాన్నే దాడులు చేశారు. దాడుల్లో భారీగా కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన కల్తీ పదార్థాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పి.మధుకర్ స్వామి తెలిపారు. కల్తీ ఇలా.. ఈ మిశ్రమాల తయారీలో మరుగుదొడ్లలో వాడే యాసిడ్, ఇతర రసాయన పదార్థాలు, వ్యర్థాలు, పౌడర్లు కలుపుతున్నారు. స్వస్త్, కింగ్, రాయల్, సదా బహర్, రోజ్.. పేర్లతో తయారు చేసిన కవర్లు, డబ్బాలను వాడుతున్నారు. హైజెనిక్ కండీషన్స్ ప్రొడక్ట్ అంటూ స్టిక్కర్లు అతికిస్తారు. -
మానవాళికి మహాభిక్ష
పుట్టగానే పడుకోబెట్టే ఊయల - వృక్షభిక్ష... లేవగానే తాగే కాఫీ - వృక్షభిక్ష... కాఫీ తాగుతూ చదివే వార్తాపత్రిక - వృక్షభిక్ష... మనకు ఆయువైన వాయువు కూడా వృక్షభిక్షే! మన జీవితం చెట్టుతో ఎంతగా మమేకమైపోయిందంటే... ఇరవై శాతం దాహానికీ, అరవై శాతం దేహారోగ్యానికీ దోహదపడేది వృక్షమే. వంటకాల్లో వాడే 70 శాతం దినుసులు వృక్షభిక్షే. గంధాలు, రకరకాల మకరందాలను ఆస్వాదిస్తూ జీవిస్తున్నామంటే అవన్నీ చెట్టు చలవే కదా. మన చిట్కా వైద్యాలన్నీ చెట్లు ప్రసాదించిన వరాలే. వీనులవిందైన సంగీత సాధనాలు వృక్షభిక్ష. వనచర, భూచరాల గూళ్లకు ఆధారం వృక్షమే. మన ఇళ్ల నిర్మాణంలో కీలకమైనభాగస్వామ్యం వృక్షానిదే. ఇక పూజాదికాలలో ఇష్టదేవతల ప్రీత్యర్థం సమర్పించే కొబ్బరికాయ, కదళీఫలం, సాంబ్రాణి, అగరుబత్తి, దీపానికి అవసరమైన పత్తి వత్తి, ఆ వత్తిని వెలిగించే అగ్గిపుల్ల కూడా వృక్షం పెట్టిన భిక్షే. వేడుకల్లోకి వెళితే... భోగిపండుగ, వినాయక పత్రి వృక్షప్రసాదితాలే. మన మనుగడ వృక్షభిక్ష. ధరించే దుస్తులు వృక్షభిక్ష, వృద్ధాప్యంలో ఊతకర్ర వృక్షభిక్ష, మరణించాక మన దేహాన్ని మోసుకుపోయే పాడె కూడా వృక్షభిక్షే. తరువుల్ని నరకడం వల్ల పక్షులు కనిపించడం లేదు, పిండం పెట్టాలంటే కాకికి దండం పెట్టాల్సి వస్తోంది. ఆలోచించండి. చెట్టు సాంగత్యం లేని మనిషి జీవితాన్ని ఊహించనైనా చేతనవుతుందేమో!?