సౌరశక్తిని ఒడిసిపట్టేందుకు కొత్త టెక్నిక్‌... | New technique for solar energy solving | Sakshi
Sakshi News home page

సౌరశక్తిని ఒడిసిపట్టేందుకు కొత్త టెక్నిక్‌...

Published Mon, Jan 28 2019 12:33 AM | Last Updated on Mon, Jan 28 2019 12:33 AM

New technique for solar energy solving - Sakshi

సౌరశక్తి ఏటికేడాదీ చౌక అవుతున్నప్పటికీ అది ఇప్పటికే సామాన్యుడి చేతికి అందేస్థాయిలో లేదన్నది నిర్వివాద అంశం. ఈ పరిస్థితి త్వరలో మారనుందని అంటున్నారు ద సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ శాస్త్రవేత్తలు. సౌరశక్తిని మరింత ఎక్కువగా ఒడిసిపడుతూనే అందుకయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించేందుకు తాము నానోటెక్నాలజీ ఆధారంగా వినూత్న పదార్థాలను సిద్ధం చేశామని యాండ్రూ లెవీన్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు.

సింగ్లెట్‌ ఫిషన్‌ అనే ఓ భౌతికశాస్త్ర ప్రక్రియ ద్వారా ఈ పదార్థాలు ఎలక్ట్రాన్లు ఎక్కువ సమయంపాటు మనుగడలో ఉండేలా చేస్తాయని లెవీన్‌ చెప్పారు. దీనివల్ల సూర్యుడి కిరణాల్లోని శక్తిని కనీసం 44 శాతం వరకూ విద్యుత్తుగా మార్చుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ పరిమితి 33 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. అంతేకాకుండా.. ఈ పదార్థాలు తమంతట తామే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో అమరిపోతాయని దీనివల్ల సూర్యరశ్మిలోని ఫొటాన్ల శక్తిని పరిసరాల్లోని పదార్థాలతో పంచుకునే వీలేర్పడుతుందని ఫలితంగా అధిక విద్యుదుత్పత్తి సాధ్యమని లెవీన్‌ వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement