వంటలో ఏది ఎంత.. ఎప్పుడు వేయాలి? అనే విషయం తెలిస్తే వంట చేయడం పెద్ద కష్టమేం కాదంటారు చాలామంది. ఏది ఎప్పుడు వేయాలనేదానిపై క్లారిటీ కోసం కుకింగ్ వీడియోలను ఫాలో అయితే చాలు.
అదే ఎక్కువ మోతాదులో వంటకు అంతే ఎక్కువ మోతాదులో ఇన్‌గ్రీడియెంట్స్‌ని వేయాల్సి వస్తే? ఈ డిజిటల్ మెజరింగ్ డివైస్‌ను వంటింట్లో ప్లేస్ చేస్తే సరి! యూజర్ ఫ్రెండ్లీ ఫంక్షనాలిటీ కలిగిన ఈ మెషిన్.. పిండి, నూక, పాలు, నీళ్లు ఇలా దేన్నైనా కొలిచి.. సరైన మోతాదులో చూపిస్తుంది.
జిమ్‌కి వెళ్తూ లేదా డైట్ చేస్తూ కొలతప్రకారం తినేవాళ్లకు ఈ మెషిన్ భలే ఉపయోగపడుతుంది. దీనిపైనున్న పాత్ర సులభంగా డివైస్ నుంచి వేరుపడుతుంది. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ పాత్రను క్లీన్ చేయడమూ తేలికే. ఇది బ్యాటరీలపై చక్కగా పని చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment