Recipe: నోరూరించే ఫిష్‌ ఆమ్లెట్స్‌ రోల్స్‌ తయారీ ఇలా! | Recipes In Telugu: How To Make Fish Omelette Rolls | Sakshi
Sakshi News home page

Fish Omelette Rolls Recipe: నోరూరించే ఫిష్‌ ఆమ్లెట్స్‌ రోల్స్‌ తయారీ ఇలా!

Published Wed, Aug 10 2022 3:10 PM | Last Updated on Wed, Aug 10 2022 5:12 PM

Recipes In Telugu: How To Make Fish Omelette Rolls - Sakshi

టేస్టీ టేస్టీ ఫిష్‌ ఆమ్లెట్స్‌ రోల్స్‌ ఇంట్లో ఇలా తయారు చేసుకోండి!
ఫిష్‌ ఆమ్లెట్స్‌ రోల్స్‌ తయారీకి కావలసినవి:  
►చేప ముక్కలు – 2
►గుడ్లు – 3, కారం, పసుపు, ఉప్పు– తగినంత
►అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – అర టేబుల్‌ స్పూన్‌

►పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – కొద్దికొద్దిగా
►గరం మసాలా – 1 టేబుల్‌ స్పూన్‌
►కొత్తిమీర తురుము – కొద్దిగా
►నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

ఫిష్‌ ఆమ్లెట్స్‌ రోల్స్‌ తయారీ:
►ముందుగా చేప ముక్కలపై కారం, పసుపు, ఉప్పు కొద్దికొద్దిగా వేసుకోవాలి.
►అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకుని ముక్కలకు బాగా పట్టించాలి.
►15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
►అనంతరం కళాయిలో నూనె వేడి చేసుకుని, దోరగా వేయించుకోవాలి.

►చల్లారిన తర్వాత ముళ్లు తొలగించి.. పొడిపొడిగా చిదుముకుని.. ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.
►పెనం మీద నూనె వేసుకుని.. వేడి కాగానే.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దోరగా వేయించి.. చేప మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. ►కొత్తిమీర తురుము కూడా వేసుకుని ఆ మిశ్రమాన్ని బౌల్‌లోకి  తీసుకోవాలి.
►అనంతరం పాన్‌ మీద కొద్దిగా నూనె వేసుకుని, ప్లెయిన్‌ ఆమ్లెట్స్‌ వేసుకుని.. వాటిలో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని ఉంచి రోల్స్‌లా చుట్టాలి.
►ఆ తర్వాత సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. 

ఇవి కూడా ట్రై చేయండి: Beetroot Bajji Recipe: బీట్‌రూట్‌ బజ్జీలు ఇలా!
Corn Palak Pakoda Recipe: స్వీట్‌ కార్న్‌, పాలకూర.. కార్న్‌ పాలక్‌ పకోడి ఇలా తయారు చేసుకోండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement