రోటీ, ఆమ్లెట్ తిని బోర్ కొట్టిందా! ఇలా వెరైటీగా అటుకులు, జొన్నపిండితో రొట్టె చేసుకుని.. ఆమ్లెట్ రోల్స్ చేసుకుని తింటే టేస్ట్ అదిరిపోద్ది.
పోహా రోటీ – ఆమ్లెట్ రోల్స్
కావలసినవి:
►గుడ్లు – 3 (ఒక బౌల్‌లో గుడ్లు పగలగొట్టుకుని, అందులో ఉప్పు,కారం, పసుపు, పాలతోపాటు ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కూరగాయల తరుగు వంటివి అభిరుచిని బట్టి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి)
►అటుకులు – 2 కప్పులు
►జొన్నపిండి – పావు కప్పు
►నెయ్యి – టేబుల్ స్పూన్
►గోరు వెచ్చని నీళ్లు – సరిపడా
►ఉప్పు – తగినంత, నూనె – సరిపడా
తయారీ:
►ముందుగా అటుకులు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
►జొన్నపిండి, ఉప్పు, నెయ్యి వేసుకుని, గోరువెచ్చని నీళ్లను కొద్దికొద్దిగా కలుపుకుంటూ.. ముద్దలా చేసుకోవాలి.
►15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని, తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి
►ఆ ఉండలను చపాతీల్లా ఒత్తుకోవాలి.
►పాన్‌పై సరిపడా నూనె వేసుకుని ఇరువైపులా దోరగా వేయించుకోవాలి.
►ఒకవైపు ఆమ్లెట్ వేసుకుని.. సర్వ్‌చేసుకునే ముందు.. నచ్చిన మసాలా కర్రీతో రోల్స్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.
ఇవి కూడా ట్రై చేయండి: Korrala Idli- Millet Halwa: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా తయారీ ఇలా..
బాస్మతి బియ్యంతో ఘీ రైస్.. కార్న్‌ఫ్లోర్‌తో పనీర్ జిలేబీ! తయారీ ఇలా
Comments
Please login to add a commentAdd a comment