ఎగ్ ఫింగర్స్ తయారికి కావల్సినవి:
గుడ్లు – 4, మిరియాల పొడి – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత, మైదా పిండి – పావు కప్పు
చాట్ మసాలా, కారం – పావు టీ స్పూన్ చొప్పున
బ్రెడ్ పౌడర్ – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానమిలా:
ముందుగా ఒక బౌల్లో మూడు గుడ్లు పగలగొట్టి.. అందులో అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని చతురస్రాకారపు పాత్రకు నూనె రాసి.. దానిలో వేసుకుని.. స్టీమ్ చేసుకోవాలి. అనంతరం దాన్ని నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంతలో ఒక చిన్న పాత్రలో మిగిలిన గుడ్డు పగలగొట్టి, స్పూన్‌తో గిలకొట్టి పెట్టుకోవాలి.
మరో పాత్రలో మైదా పిండి, చాట్ మసాలా, కారం వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంకో చిన్న పాత్రలో బ్రెడ్ పౌడర్ వేసుకుని.. ఒక్కో ముక్కను మొదట మైదా మిశ్రమంలో.. తర్వాత గుడ్డు మిశ్రమంలో ముంచి అటూ ఇటూ తిప్పి.. బ్రెడ్ పౌడర్ పట్టించి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటిని టొమాటో సాస్‌తో తింటే భలే రుచిగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment