మసాలా ఎగ్ పనియరం తయారీకి కావల్సినవి:
గడ్డ పెరుగు – 2 కప్పులు
గుడ్డు – 3, ఉల్లిపాయ ముక్కలు,
టొమాటో ముక్కలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున
కొత్తిమీర తురుము – కొద్దిగా
అల్లం తురుము – అర టీ స్పూన్
పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్
మిరియాల పొడి – పావు టీ స్పూన్
ఉప్పు – తగినంత, నూనె – సరిపడా
తయారీ విధానమిలా:
ముందుగా పెరుగును రెండుమూడు సార్లు అటూ ఇటూ తిరగబోసుకుని సాఫ్ట్‌గా అయ్యేలా చేసుకోవాలి. అందులో గుడ్లు పగలగొట్టుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని.. దానిపై పొంగనాల పెనం పెట్టుకుని.. ప్రతి గుంతలో కొద్దికొద్దిగా నూనె వేసుకుని.. కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని వాటిలో వేసుకుని ఇరువైపులా వేయించుకోవాలి. వీటిని.. నచ్చిన చట్నీలో వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment