ఎప్పుడు గుడ్డుతో వేసుకునే ఆమ్లెట్ కాకుండా కాస్త వెరైటీగా ఆలోచించండి. మసాలా వేసి చేసే ఎగ్ ఆమ్లెట్ గురించి తెలిసిందే. అలా కాకుండా అరటిపండుతో అదిరిపోయే రుచితో ఇలా ఆమ్లెట్ వేసుకుని చూడండి. పిల్లలు, పెద్దులు వదిలిపెట్టకుండా తినేస్తారు చూడండి. అయితే దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా!.
బనానా ఆమ్లెట్‌కి కావలసినవి:
అరటి పండు – ఒకటి
గుడ్లు – రెండు
ఉప్పు – రుచికి సరిపడా
మిరియాల పొడి – టీస్పూను
కారం – అరటీస్పూను
నూనె – ఆమ్లెట్ వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: ∙అరటిపండును ముక్కలుగా తరగాలి. మిక్సీజార్‌లో అరటిపండు ముక్కలు, గుడ్ల సొన, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి నురగ వచ్చేంత వరకు గ్రైండ్ చే యాలి. ఇప్పుడు పెనం మీద నూనె వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోసుకోవాలి. సన్నని మంట మీద రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే బనానా ఆమ్లెట్ రెడీ.
Comments
Please login to add a commentAdd a comment