ఫిష్ – చీజ్ బాల్స్ తయారీకి కావల్సినవి:
చేప ముక్కలు – పావు కిలో (మెత్తగా ఉడికించి, చల్లారాక మధ్యలో ముల్లు తొలగించి, పొడిపొడి తురుములా చేసుకోవాలి)
బ్రెడ్ స్లైస్ – 8 లేదా 10 (నలువైపులా కట్ చేసుకుని పెట్టుకోవాలి)
చీజ్ తురుము – 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్
పసుపు – కొద్దిగా, గరం మసాలా – 1 టీ స్పూన్, కోడిగుడ్లు – 2
బ్రెడ్ పౌడర్ – పావు కప్పు, చిక్కటి పాలు – కొన్ని, ఉప్పు – తగినంత
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానమిలా:
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన ఫిష్ తురుము, చీజ్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, గరం మసాలా వేసుకొని బాగా కలిపి ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రతి బ్రెడ్ ముక్కను పాలలో నానబెట్టి.. గట్టిగా ఒత్తి.. అందులో కొద్దికొద్దిగా ఫిష్ మిశ్రమం పెట్టుకుంటూ బాల్‌లా చేసి, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment