పనీర్ క్రిస్పీ స్టిక్స్ తయారీకి కావల్సినవి
పనీర్ – అరకిలో (నిలువుగా కట్ చేసుకోవాలి),
కొబ్బరి తురుము, బ్రెడ్ పౌడర్ – పావు కప్పు చొప్పున,
గుడ్లు – 3, పాలు – 2 టేబుల్ స్పూన్లు (చిక్కటివి),
పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్, అల్లం – వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్,
ఇంగువ – చిటికెడు, చాట్ మసాలా, నిమ్మరసం,
ధనియాల పొడి, జీలకర్ర పొడి – అర టీ స్పూన్ చొప్పున,
ఉప్పు – తగినంత, నూనె – సరిపడా
తయారీ విధానమిలా:
ముందుగా ఒకపెద్ద బౌల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం – వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని పనీర్ ముక్కలకు పట్టించి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక బౌల్లో మొక్కజొన్న పిండి, ఇంకో బౌల్లో పాలు–గుడ్ల మిశ్రమం, మరో బౌల్లో కొబ్బరి తురుము లేదా బ్రెడ్ పౌడర్ వేసుకుని.. ఒక్కో పనీర్ ముక్క తీసుకుని, మొదట మొక్కజొన్న పిండిలో, తర్వాత గుడ్ల మిశ్రమంలో, ఆ తర్వాత కొబ్బరి తురుము లేదా బ్రెడ్ పౌడర్‌ను బాగా పట్టించి.. నూనెలో ఫ్రై చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment