Chicken Omelette Recipe Indian: Recipes In Telugu: How To Make Chicken Omelette - Sakshi
Sakshi News home page

Chicken Omelette Recipe: చికెన్‌ ఆమ్లెట్‌ తయారీ విధానం ఇలా!

Published Sat, Jul 23 2022 10:55 AM | Last Updated on Sat, Jul 23 2022 11:32 AM

Recipes In Telugu: How To Make Chicken Omelette - Sakshi

చికెన్‌తో రొటీన్‌ వంటకాలు కాకుండా ఇలా ఓసారి ఆమ్లెట్‌ ట్రై చేయండి.
చికెన్‌ ఆమ్లెట్‌ తయారీకి కావలసినవి:
►గుడ్లు – నాలుగు
►ఉప్పు – రుచికి సరిపడా
►మిరియాలపొడి – రుచికి సరిపడా

►నూనె – టీస్పూను
►ఉడికించి సన్నగా తురిమిన చికెన్‌ – ముప్పావు కప్పు
►ఛీజ్‌ తురుము – రెండు టేబుల్‌ స్పూన్లు
►పాలకూర తురుము – రెండు టేబుల్‌ స్పూన్లు.

తయారీ:
►గుడ్ల సొనను గిన్నెలో వేసి చక్కగా బీట్‌ చేయాలి.
►బీట్‌ చేసిన గుడ్ల సొనలో రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి వేసి మరోసారి బీట్‌ చేయాలి.
►ఇప్పుడు పాన్‌పై నూనెవేసి వేడెక్కనివ్వాలి.
►వేడెక్కిన నూనెపై బీట్‌చేసిపెట్టుకున్న గుడ్ల సొన మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోసుకోవాలి.
►ఆమ్లెట్‌ మధ్యలో నుంచి అంచుల వరకు చక్కగా కాలేలా సొనను పరుచుకుంటూ సన్నని మంట మీద కాల్చాలి.

►ఇప్పుడు చికెన్‌ తరుగుని అవెన్‌లో కాస్త వేడి చేసి ఆమ్లెట్‌పైన వేయాలి.
►చికెన్‌తోపాటు చీజ్‌ తరుగు, పాలకూర తరుగు వేసి నిమిషం పాటు వేయించాలి.
►ఇప్పుడు ఆమ్లెట్‌ను సగభాగం మడిచి చీజ్‌ కరిగేంత వరకు రెండు వైపులా చక్కగా కాల్చాలి.
►చక్కగా కాలిన ఆమ్లెట్‌ను ఫ్రైడ్‌ బ్రెడ్, స్పినాచ్‌ సలాడ్‌తో సర్వ్‌ చేసుకోవాలి. 

ఇవి కూడా ట్రై చేయండి: Masala French Toast Recipe: ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌.. మసాలా ఫ్రెంచ్‌ టోస్ట్‌!
Chilakada Dumpa Poorilu: నోరూరించే చిలగడదుంపల పూరీ తయారీ ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement