ఇంటిప్స్
అల్లంపై తొక్క తీయడానికి చాకుకు బదులుగా స్పూను వాడితే సులభంగా పోతుంది. అల్లాన్ని ఫ్రీజర్‌లో నిల్వ ఉంచితే ఎక్కువ రోజులు ఉంటుంది. తొక్క సులభంగా వస్తుంది. వెల్లుల్లిరేకలను ముప్ఫై సెకన్లపాటు పెనం మీద వేడిచేస్తే పొట్టు త్వరగా వస్తుంది. ఆమ్లెట్ కోసం కోడిగుడ్డును గిన్నెలో వేసి గిలక్కొట్టే ముందు గిన్నెలో నీళ్లు పోసి వంపేస్తే గుడ్డు సొన గిన్నెకు అంటుకోకుండా ఉంటుంది.
వంటలో ఉప్పు ఎక్కువైందనపిస్తే వెంటనే పచ్చిబంగాళాదుంపను చక్రాలుగా కోసి వేయాలి. బంగాళాదుంప ముక్కలు ఉప్పును పీల్చుకుంటాయి. క్యాలీఫ్లవర్ వండిన తర్వాత కూడా తెల్లగా ఆకర్షణీయంగా కనిపించాలంటే వండేటప్పుడు ఒక టీ స్పూన్ పాలు కలపాలి.