ప్రస్తుతం ఈ ఉరుకులు పరుగులు జీవితంలో ఏదో పొట్టకింత తిన్నమా అన్నట్లు కానిస్తారు. ఏదో తూతూ మంత్రంగా తినడమే గానీ గంటలు గంటలు కూర్చొని చేసే వంటకాల జోలికే వెళ్లరు. ఇక బ్రేక్ ఫాస్ట్‌లు దగ్గరకు వస్తే..త్వరగా అయిపోయే వాటికే ప్రయారిటీ ఇస్తారు. అందులోనూ ముఖ్యంగా బ్రెడ్, ఆమ్లేట్ వంటివే ప్రివర్ చేస్తారు. చాలామంది ఉడకబెట్టి లేదా బ్రెడ్ ఆమ్లెట్ వంటి రెసీపీలు చేసుకుంటారు. మనం వెళ్లే కంగారు ఆ గుడ్డుని పగలుగొట్టడానికి నానాతంటాలు..ఇక గిలకొట్టడం మరో పని. దీంతో హడావిడిగా కిందమీద పడేసి చేసేస్తుంటాం. అలాంటి హైరానా ఏమి లేకుండా..అసలు 'గుడ్డే' లేకుండా క్షణాల్లో రెడీ చేసే ఆమ్లేట్ మన ముందుకు వస్తోంది. ఓ కేరళ వ్యక్తి దీన్ని సృష్టించాడు. ఇంతకీ ఎలా చేస్తారు? ఏవిధంగా వంటి కథాకమామీషులు ఒక్కసారి చూద్దామా!.
వివరాల్లోకెళ్తే..కేరళలోని రామనట్టుకర నివాసి అర్జున్ 'గుడ్లు' లేకుండా ఫాస్ట్‌గా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించాడు. అందుకు సంబంధించిన ఇన్‌స్టెంట్ పౌడర్‌ను కూడా మార్కెట్‌లోకి తీసుకువచ్చాడు కూడా. ఆ పౌడర్‌కి సంబంధించిన చిన్న ప్యాకెట్ ధర రూ. 5 నుంచి రూ. 100 వరకు వివిధ రేంజ్‌లో ధరలో పెద్ద ప్యాకెట్ల వరకు కూడా మార్కెట్‌లోకి తీసుకువచ్చాడు. ఈ పౌడర్ నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుందట.
ఈ రెసీపీ తయారీ వెనుక ఉన్న రీజన్..
అర్జున్ తన కూతురు ధన్‌శివ కోసం "ముత్తయప్పం" (ఆమ్లెట్) త్వరగా ఎలా తయారు చేయడం ఎలా అని ఆలోచించాడు. అదే ఈ గుడ్డ లేకుండా త్వరగా చేసే ఆమ్లెట్ రెసీపీకి నాంది పలికింది. ఆ తరువాత అర్జున్ ఇలా మూడు సంవత్సరాలుగా రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. చివరికి అనుకున్నది సాధించడమే గాక తాను రూపొందించిన ఆ పౌడర్‌ను మార్కెట్‌లకి తీసుకువచ్చే ముందు మరిన్ని ప్రయోగాలు చేసి సత్ఫలితాలు ఇచ్చేంత వరకు కొంత డబ్బును ఖర్చు పెట్టాడు. అంతా ఓకే అనుకున్నాకే మార్కెట్‌లోకి తాను తయారు చేసిన ప్రొడక్ట్‌లను తీసుకొచ్చాడు.
ఈ మేరకు అర్జున్ దాదాపు రూ. 2 కోట్లతో కొండోట్టి వజ్హయూర్‌లో 'ధన్స్ డ్యూరబుల్' అనే పేరుతో ఓ కంపెనీని కూడా పెట్టి..సేల్స్ ప్రారంభించాడు. అంతేకాదు కిడ్స్ ఆమ్మెట్, ఎగ్ బుర్జి, వైట్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్, స్వీట్ ఆమ్మెట్ బార్ స్నాక్ వంటి కొత్త ఫ్లేవర్స్‌లో మరిన్ని వెరైటీలను కస్టమర్‌లకు పరిచయం చేయనున్నాడు. ఈ మేరకు బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, యూకే, కువైట్ వంటి దేశాలకు కూడా తన ప్రొడక్ట్‌లను మార్కెట్ చేసుకుంటున్నాడు. అర్జున్ 2021లో తన వ్యాపారాన్ని ప్రారంభించారడు. ఈ పౌడర్‌ను మరింతగా ఉత్పత్తి చేసేందుకు యంత్రాలను ఏర్పాటు చేసుకోవడమే గాక సుమారు ఏడుగురు మహిళలతో సహ 12 మందికి ఎంప్లాయిమెంట్‌ని కల్పించాడు
అంతేకాదు ఆఖరికి ఆన్‌లైన్‌లో కూడా కొనుగొళ్లు చేసేలా మార్కెట్‌ని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాడు కూడా. అతని గురించి ఔట్‌లుక్ అనే న్యూస్ ఛానెల్ 'ది ఆమ్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా' శీర్షికతో అర్జున్ గురించి కథనం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి అతను ఓ సెలబ్రెటీ మాదిరిగా అన్ని పత్రికలు అతని గురించి కథనాలు రావడం జరిగింది. పైగా తాను త్వరగా ఆమ్లెట్‌ని రెడీ చేసే విధానంలో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ని బద్దలు కొట్టే సన్నహాలు కూడా చేస్తున్నట్లు పేర్కొన్నాడు అర్జున్.
(చదవండి: మగ గొరిల్లా కడుపున ఓ ఆడ గొరిల్లా పిల్ల..కంగుతిన్న జూ సిబ్బంది)
Comments
Please login to add a commentAdd a comment